Amala Paul : ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రముఖ బ్యూటీ అమలాపాల్ (Amala Paul) తెలుగు, తమిళ్ భాషలలో పలు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే మొదటిసారి ఒక డైరెక్టర్ ను వివాహం చేసుకున్న ఈమె, అతడికి విడాకులు ఇచ్చి.. గత ఏడాది నవంబర్ 5వ తేదీన తన ప్రియుడు జగత్ దేశాయ్ తో ఏడడుగులు వేసింది. ఇక నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా అమలాపాల్ అప్పటి మధుర జ్ఞాపకాలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది.
ఇకపోతే వీరి పెళ్లి కేరళలోని కొచ్చిలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన పెళ్లి వీడియోని కూడా ఆమె షేర్ చేసింది. అయితే ఇక్కడ తన మొదటి భర్త గురించి పరోక్షంగా కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమలాపాల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇలా షేర్ చేసింది. “నా జీవితంలో గతంలో కొన్ని తప్పులు జరిగాయి. అయితే వాటికి నేను థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే వాటి వల్లే ఇతడు నా జీవితంలోకి వచ్చాడు” అంటూ చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఆమె తన జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది దర్శకుడు ఏ. ఎల్. విజయ్ (AL.Vijay)తో వివాహమే అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే జగత్ దగ్గర ఉంటే చాలా సేఫ్ గా అనిపిస్తోంది అని కూడా ఆమె తెలిపింది. ఏది ఏమైనా తన మొదటి భర్త దగ్గర తనకు సేఫ్టీ లేదని, ఆ ప్రేమ దొరకలేదని.. ఇప్పుడు అవన్నీ కూడా జగత్ దగ్గర దొరుకుతున్నాయి అంటూ పరోక్షంగా తెలిపింది అమలాపాల్.
అమలాపాల్ మొదటి వివాహం విషయానికి వస్తే.. నటిగా కెరియర్ ఆరంభించిన ఈమె 2014లో తమిళ దర్శకనిర్మాత అయిన విజయ్ ను వివాహం చేసుకుంది. కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోవడమే మంచిదని విడాకులు తీసుకున్నారు. అలా 2017 లో వేరుపడ్డ ఈ జంట ఎవరికి వారు కెరియర్ పై ఫోకస్ పెట్టగా.. ఇప్పుడు అమలాపాల్ జగత్ ను వివాహం చేసుకొని, ఏడాదిలోపే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇక ఈమె విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు అనఖ. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన అమలాపాల్ , కేరళలోని కొచ్చిలో స్థిరపడింది. ఈమె తల్లి అన్నీస్ పాల్.. గృహిణి, ఈమె తండ్రి వర్గీస్ పాల్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక తన విద్యాభ్యాసాన్ని కొచ్చి లో పూర్తి చేసింది. 2009లో ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశానికై ఒక సంవత్సరం విరామం తీసుకున్న ఈమెను ఛాయాచిత్రాలలో చూసిన ప్రముఖ మలయాళ డైరెక్టర్ లాల్ జోష్ తన చిత్రం నీల తామర సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఆ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో కూడా నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
View this post on Instagram