Upcoming Mobiles In Nov 2024 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మెుబైల్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. ఇక నవంబర్ లో రియల్ మీ, ఐక్యూ, ఒప్పోతో పాటు మరిన్ని మోడల్స్ మార్కెట్లోకి లాంఛ్ కానున్నాయి. ఇక ఈ నెలలో ఏ ఏ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్ కానున్నాయి. వాటి ఫీచర్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
అక్టోబర్‌లో Xiaomi, OnePlus, నథింగ్, Lava ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి టాప్ కంపెనీల నుంచి Xiaomi 15, OnePlus 13, Lava Agni 3, nothing Phone (2a) Plus కమ్యూనిటీ ఎడిషన్ తో పాటు మరికొన్ని బెస్ట్ మెుబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక నవంబర్ లో మెుదలుకానున్న స్మార్ట్ ఫోన్స్ జాతరలో మరిన్ని అదిరిపోయే ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. Asus ROG Phone 9 series, Oppo Find X8 series, Realme GT 7 Pro, iQOO 13 మెుబైల్స్ రాబోతున్నాయి. ఇక వీటి ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.
Asus ROG Phone 9 series – Asus ROG మెుబైల్ 9 సిరీస్.. ROG 9, ROG ఫోన్ 9 ప్రోగా రెండు వేరియంట్స్ లో నవంబర్ 19న రాబోతుంది. 6.78 అంగుళాల FULL HD+ AMOLED డిస్‌ప్లే, 16GB RAM, 256/512GB స్టోరేజ్, Android 15 OS, ట్రిపుల్ కెమెరా సెటప్ తో 32MP ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ రానుంది.
ALSO READ : మళ్లీ పేలిన ఐఫోన్.. మహిళకు తీవ్ర గాయాలు.. స్పందించిన యాపిల్ ఏమన్నాదంటే!
Oppo Find X8 series – ఈ మెుబైల్ లాంఛ్ తేదీ అధికారికంగా వెలువడలేదు కానీ నవంబర్‌లో రానుందని ఒప్పో తెలపింది. 120Hz రిఫ్రెష్ రేట్, 6.59 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15, 12GB/16GB RAM, 256GB స్టోరేజ్, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో 5630mAh బ్యాటరీ, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్ తో రాబోతుంది.
Realme GT 7 Pro – ఈ మెుబైల్ నవంబర్ 26న రానుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో రాబోతుంది. మల్టీ లేయర్ యాంటీ గ్లేర్ టెక్నాలజీతో టాప్ ఎండ్ కెమెరా వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ మెుబైల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి బెస్ట్ ఆఫ్షన్. AI మోషన్ డిబ్లర్ టెక్నాలజీ, AI టెలిఫోటో అల్ట్రా క్లారిటీ, AI గేమ్ సూపర్ రిజల్యూషన్‌తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఫోటోగ్రఫీ ఫీచర్స్ తో రాబోతుంది.
iQOO 13 – iQOO 13 మెుబైల్ 144Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.82 అంగుళాల LPTO OLED డిస్‌ప్లే, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్, 16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 6150mAh బ్యాటరీ, Android 15 OS ఫీచర్స్ ను కలిగి ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, LED ఫ్లాష్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో రాబోతుంది.