IND vs AUS Test: టీమిండియా ( Team India ) దారుణమైన ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో తుక్కు తుక్కు ఓడిపోయింది. 92 ఏళ్ల చరిత్ర. 584 టెస్టుల అనుభవం. సాంప్రదాయ స్పిన్ పిచ్ లపై మన వారిని కొట్టిన వారంటూ ఎవరూ లేరు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మనదేశంలో సిరీస్ లో గెలుచుకున్నాయి. కానీ ఎప్పుడూ కూడా వైట్ వాష్ అయితే చేయలేకపోయాయి. ఇన్నేళ్ల తర్వాత ఏ టీం సాధించలేని ఘనత, ఆ రికార్డు ఈరోజు ముక్కలైపోయింది. మూడవ టెస్టులో న్యూజిలాండ్ విసిరిన 147 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగులకే టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయిపోయింది.
Also Read: Shikhar Dhawan: ఆ మిస్టరీ అమ్మాయితో ధవన్ కు రెండో పెళ్లి..?
Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?
ఫలితంగా 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో అవమానకర రీతిలో ఓటమి ఎదుర్కోవడమే కాదు 0-3 తేడాతో భారత్ ను వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇండియాలో ఆడి ఇండియాను ఓ టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ చెయలేదు. అలాంటిది మొదటిసారి మూడు మ్యాచ్ల సిరీస్ కి మూడుకి మూడు గెలుచుకొని న్యూజిలాండ్ సరికొత్త చరిత్రను లిఖించుకుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 3 టెస్టులోను అద్భుతంగా రాణించి భారత పతనాన్ని శాసించాడు.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్ ఇదే !
మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన పటేల్ రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి మూడవ టెస్టులో భారత్ ను గోరంగా ఓడించాడు. ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాల్సిన టీమిండియాకు ( Team India ) ఇది ఊహించలేని దారుణమైన ఓటమి. కాగా, సునీల్ గవాస్కర్ ( Sunil gavashkar) కెప్టెన్ రోహిత్ శర్మపై ( Rohit sharma) సంచలన కామెంట్స్ చేశాడు. వచ్చేసారి బోర్డర్ గావస్కర్ సిరీస్ మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ కనక ఆడకపోతే మొత్తం పర్యటనకు బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని సునీల్ గవాస్కర్ వెల్లడించారు. ఆసీస్ తో సిరీస్ ఈనెల 22న ప్రారంభమవుతుంది.
అయితే తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ మొదటి మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. పెర్త్ టెస్ట్ కు బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అదే కనుక నిజమైతే సెలక్షన్ కమిటీ ఆసీస్ తో సిరీస్ మొత్తానికి బుమ్రాను ( Jasprit Bumrah ) కెప్టెన్ గా నియమించాలని కోరారు , సునీల్ గవాస్కర్. ఆటగాడిగా సిరీస్ లో రోహిత్ ను ఆడమని చెప్పాలిని గావస్కర్ అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.