Homemade Hair Oil: అమ్మాయిలకైన, అబ్బాయిలకైన బాగా ఇష్టమైంది జుట్టే కదా.. ఆ జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా ఉంటే బాగుంటుందని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. జుట్టు రాలకుండ ఉండేందుకు చేయని ప్రయత్నం ఉండదు. బయట మార్కెట్లో ఎన్ని రకాల హెయిర్ ఆయిల్స్ వాడిన ఫలితం మాత్రం సూన్యం. కాబట్టి మన ఇంట్లోనే దొరికే పదార్ధాలతో ఈ హెయిర్ ఆయిల్ ఒకసారి ట్రై చేశారంటే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. పైగా ఇందులో వాడే ఏ పదార్దాలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావు. జుట్టు కూడా ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ఈ హెయిర్ ఆయిల్‌ని ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
ఉసిరికాయలు
కొబ్బరినూనె
మెంతులు
కరివేపాకు
ఉల్లిపాయలు
తయారు చేసుకునే విధానం..
ముందుగా ఉసిరి కాయలను చిన్నముక్కలుగా కట్ చేసి, వీటితో పాటు కరివేపాకు, మెంతులు, ఉల్లిపాయలు కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కావాల్సినంత కొబ్బరి నూనె వేసి.. అందులో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేయాలి. బాగా బ్రైన్ కలర్ వచ్చేంత వరకు ,10- 15 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లార్చి ఒక క్లాత్‌లో వేసి గాజు సీసాలో వడకట్టుకోవాలి. ఇది కొద్ది రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతే.. ఈజీగా నాచురల్ హెయిర్ ఆయిల్ రెడీ అయినట్లే.
ఈ ఆయిల్ రెండు రోజులకు ఒకసారి జుట్టుకు అప్లై చేసి గంట, రెండు గంటల తర్వాత తలస్నానం చేయొచ్చు. ఆయిల్‌ను జుట్టుకు పెట్టేటప్పుడు బాగా కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసి అప్లై చేసుకోండి. మీకు కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ ఆయిల్ వాడే పదార్ధాలన్ని జుట్టు సంరక్షణకు చాలా మంచిది. హెయిర్ కూడా సిల్కీగా, పొడవుగా, నల్లగా మారుతుంది. వైట్ హెయిర్‌ను కూడా నివారించవచ్చు.
Also Read: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి
ఉసిరికాయలు ఉపయోగాలు..
ఉసిరిలో విటమిన్ సి,ఫైబర్, ఫైటో న్యూట్రియంట్లు, అధికంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పని చేస్తుంది. ఉసిరి కాయల ఉపయోగాలు జుట్టుకి మాత్రమే కాదండోయ్.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మెంతులు ప్రయోజనాలు..
మెంతుల్లో కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటోషియం లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి.
కరివేపాకు ఉపయోగాలు..
కరివేపపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో.. జుట్టు పెరుగుదలకు కూడా అంతే మంచిది. వీటిలో అనేక రకాల ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.
ఉల్లిపాయలు ఉపయోగాలు..
ఉల్లిపాయల్లో జుట్టు పెరుగుదలకు కావాల్సిన అనేక రకాల పోషకాలు అధికంగా ఉన్నాయి. వీటిని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.