EPAPER
Kirrak Couples Episode 1

RevanthReddy: రేవంత్ రెడ్డికి విజయశాంతి సపోర్ట్ అందుకేనా? సంథింగ్ సంథింగ్

RevanthReddy: రేవంత్ రెడ్డికి విజయశాంతి సపోర్ట్ అందుకేనా? సంథింగ్ సంథింగ్

RevanthReddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు ఆశాదీపం అని అధిష్టానం భావిస్తోంది. దిగువ శ్రేణి కేడర్ సైతం రేవంత్ రెడ్డిలో మరో వైఎస్సార్ ను చూస్తున్నారు. కానీ, సీనియర్లు మాత్రం రేవంత్ ను సహించడం లేదు. ఎప్పటికప్పుడు చిక్కుముళ్లతో ఆయన ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు. అయినా, రేవంత్ రెడ్డి దూకుడు ఆగడం లేదు. తాజాగా బీఆర్ఎస్ లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనంగా నిలిచారు. రేవంత్ పనితీరు, సామర్థ్యంపై ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు.. సీనియర్లకు మినహా.


లేటెస్ట్ గా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. పార్టీ అధ్యక్షుడిని ఫాలోయర్స్ పొగడటం కామనే. పదవుల కోసమో, ప్రచారం కోసమో.. చాలామంది రేవంత్ ను భుజాలపై మోస్తుంటారు. కానీ, ఈసారి కాంగ్రెస్ కు బద్ధ శత్రువైన బీజేపీ నుంచి ప్రశంసలు వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ల తీరుపై పంచ్ లు పడ్డాయి. అలా రేవంత్ రెడ్డిని ఓ బీజేపీ బిగ్ లీడర్ పొగడటం చర్చనీయాంశంగా మారింది.

టి.కాంగ్ కుమ్ములాటపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సీరియస్ కామెంట్లు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పరోక్షంగా మద్దతు పలికారు. కాంగ్రెస్ కోసం పని చేసే వారిపై కుట్రలు చేస్తున్నారని, పార్టీతో పాటు తాము ఎదిగేందుకు శ్రమించే నేతల్ని కిందికి లాగిపడేయ్యడానికి నిరంతరం కుట్రలు జరుగుతూనే ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడైన సోదరుడు రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు, టీపీసీసీలో జరగుతున్న పరిణామాలు ఇవేనన్నారు విజయశాంతి. వ్యవస్థ మారకుండా మాణిక్కం ఠాగూర్ పోయి మాణిక్ ఠాక్రే వచ్చినా ఎవరేం చేయలేరన్నారు. బీఆర్ఎస్ అవినీతి, కేసీఆర్ నియంతృత్వంపై పోరాటంలో బీజేపీకి ఉన్నంత బలం కాంగ్రెస్ కు లేకపోయినప్పటికీ ఆయా పార్టీల సొంత మనుగడ కోసమైనా నేతలు పని చేయాలని విజయశాంతి సూచించారు.


చాలా సింపుల్ గా తేల్చేశారు విజయశాంతి. కనీసం మనుగడ కోసమైనా కాంగ్రెస్ నేతలు పని చేయాలని సీనియర్లకు హితవు పలకడం కలకలం రేపుతోంది. విజయశాంతి వ్యాఖ్యలు అక్షర సత్యాలంటున్నారు. బీజేపీ దూకుడుతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. గ్రామస్థాయిలోనూ ఇప్పటికీ హస్తం కేడర్ పటిష్టంగా ఉన్నా.. వారిలో ఉత్సాహం నింపే నాయకుడు, పోరాట కార్యక్రమాలు కరువయ్యాయి. పీసీసీ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చినప్పటి నుంచీ.. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ ఇలా వరుసబెట్టి సీనియర్లు ఏదో ఒక కిరికిరి పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు వారంతా జత కట్టి మరింత డ్యామేజ్ చేస్తున్నారు. అధిష్టానానికి అదనపు పని పెట్టారు. పార్టీ కార్యక్రమాలకంటే కూడా సీనియర్ల దాడిని డిఫెన్డ్ చేసుకోవటానికే రేవంత్ కు సమయం సరిపోతోందని అంటున్నారు. ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి అసలేం మంచిది కాదంటున్నారు. అందుకే, ప్రత్యర్థి పార్టీ నేతలతో చెప్పించుకునే దుస్థితికి దిగజారిందని చెబుతున్నారు.

మరి, ఉన్నట్టుండి విజయశాంతికి రేవంత్ రెడ్డి మీద అంతటి అభిమానం, కాంగ్రెస్ పార్టీ మీద ఇంతటి సానుభూతి ఎందుకు వచ్చిందనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. విజయశాంతి పేరుకు మాత్రం కీలక నాయకురాలిగా ఉన్నా.. పార్టీలో ఆమెకు అంతగా ప్రాధాన్యం లేదని అంటున్నారు. కేవలం బహిరంగ సభల్లో జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పుడు మాత్రమే విజయశాంతి కనిపిస్తున్నారు. అంతేగానీ, రాష్ట్ర స్థాయి సమావేశాలు, కీలక మంతనాల్లో విజయశాంతి ప్రమేయం ఉండటం లేదు. ఆమెకు ఆహ్వానం రావట్లేదో.. వచ్చినా తాను వెళ్లట్లేదో.. కారణం ఏదైనా.. బీజేపీలో విజయశాంతి స్థానం ఏంటో ఆమెతో పాటు పార్టీ నేతలకూ అర్థం కావట్లేదని అంటున్నారు.

Related News

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

Big Stories

×