Chennai Crime: రైలు కదులుతూ చిన్నగా రైల్వే స్టేషన్ వద్దకు వచ్చింది. అంతలోనే రైలు లోపల నుండి ఒక సూట్ కేస్ ను విసిరివేశారు అగంతకులు. తీరా అనుమానంగా ఉన్న ఆ సూట్ కేసును పోలీసులు ఓపెన్ చేశారు. ఇక అంతే ఒళ్లు జలధరించింది.. చేతులు, కాళ్లు వణికిపోయాయి. ఇంతకు సూట్ కేసులో ఏముందో తెలుసా.. రక్తపు మడుగులో శవం. రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదంతా మనం థ్రిల్లర్ సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ అచ్చం ఇలాగే జరిగింది చెన్నై సమీపంలోని మీంజూర్ రైల్వేస్టేషన్లో..
నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రిక్ రైలులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. వారి రైలు మీంజూర్ రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే, వారి వద్ద ఉన్న సూట్ కేస్ ను రైల్వేస్టేషన్లో పడేశారు. సూట్ కేస్ విసిరిన సమయంలో అక్కడే గల ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మహేష్ ఈ దృశ్యాన్ని గమనించాడు. ఇక సూట్ కేస్ నుండి రక్తం వస్తుండగా, అనుమానించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వెంటనే సూట్ కేసును ఓపెన్ చేశాడు.
అలా ఓపెన్ చేశాడో లేడో షాక్ కు గురయ్యాడు. ఆ సూట్ కేసులో ఉన్నది ఓ మహిళ మృతదేహం.
వెంటనే ఉన్నతాధికారులకు విషయం తెలిపిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆ తండ్రి కూతురిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ విచారణలో నెల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, మరొకరు ఆయన కుమార్తె దివ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. ఇంతకు ఈ మహిళ ఎవరు? అసలేం జరిగిందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Ganesh Selfie Video: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్
సూట్ కేసులో శవాన్ని తెచ్చి రైల్వేస్టేషన్లో పడవేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మహిళను హత్య చేశారా? అన్ని ప్రశ్నలకు సమాధానం పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది. మొత్తం మీద నెల్లూరుకు చెందిన మహిళను హత్య చేసి సూట్ కేసులో తీసుకువచ్చి ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకొనే ప్రయత్నం వీరిద్దరూ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
డెడ్ బాడీని సూట్‌కేస్‌లో ఉంచి రైలు లోంచి విసిరేసిన తండ్రి, కూతురు
నెల్లూరులో మహిళను హత్య చేసి, డెడ్ బాడీని సూట్‌కేస్‌లో పెట్టి, మీంజూర్ రైల్వేస్టేషన్లో విసిరేసిన తండ్రి సుబ్రహ్మణ్యం, కూతురు దివ్యశ్రీ
నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళే సబర్బన్ రైలులో ఘటన
సూట్‌కేస్ విసిరిన… pic.twitter.com/2mWJqaeze3
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2024