EPAPER

Anilkumar, Jogi ramesh: కేసుల ఒత్తిడి.. ఇబ్బందుల్లో మాజీమంత్రులు, జనసేనతో మంతనాలు?

Anilkumar, Jogi ramesh: కేసుల ఒత్తిడి.. ఇబ్బందుల్లో మాజీమంత్రులు, జనసేనతో మంతనాలు?

Anilkumar, Jogi ramesh: చేసిన పాపాలు ఏదోరూపంలో వెంటాడుతాయని తరచు పెద్దలు చెప్పే మాట. అధికారం ఉన్నా.. లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండాలని తలపండిన సీనియర్ రాజకీయ నేతల మాట. అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. అధికారం పోయాక నేతల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. లేటెస్ట్‌గా వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు జనసేన‌లోకి వెళ్లేందుకు మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


ఫ్యాన్ పార్టీలో ఉక్కుపోత మొదలైందా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు నేతలకు మింగుడు పడడం లేదా? వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని భావిస్తున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో తమకు పరిచయాలున్న వేరే పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రులిద్దరు జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒకరు నెల్లూరు జిల్లాకి చెందిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కాగా, మరొకరు కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్.


కొద్దిరోజుల కిందట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆయన రిలాక్స్ అవుతున్నారట. వైసీపీలో ఉన్నప్పుడు ఎటువైపు పోలీసులు వస్తారేమోనని భయంతో బెంబేలెత్తేవారట. సింపుల్‌గా చెప్పాలంటే సామినేని  ప్రశాంతంగా ఉన్నారని ఆయన మద్దతుదారుల మాట.

వైసీపీలో ఇబ్బందిపడుతున్న నేతలతో  సామినేని మంతనాలు సాగిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. వారిలో అనిల్ కుమార్, జోగి రమేష్‌లతో  చర్చలు జరిపారట. ఒకవేళ పార్టీలోకి వస్తారంటే అధినేతతో మాట్లాడుతానని చెప్పారట. దీంతో మాజీమంత్రలు ఆలోచనలో పడినట్టు జనసేన పార్టీ వర్గాల మాట. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా నేతలు రావడం ఖాయమని గ్లాసు పార్టీలో చిన్నపాటి చర్చ.

ALSO READ: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్

మాజీ మంత్రి జోగి రమేష్‌ ప్రస్తుతం కేసుల చుట్టూ తిరుగుతున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసుతోపాటు మరికొన్నింటిని ఎదుర్కొంటున్నారు. వాటిని నుంచి బయట పడాలంటే వైసీపీలో ఉంటే కష్టమని భావిస్తున్నారట. ఈ క్రమంలో తన అభిప్రాయాలను సన్నిహితులతో పంచుకున్నారట.

నెల్లూరు వైసీపీలో నేతల మధ్య అంతర్గత పోరు ముదిరిపాకాన పడింది. అనిల్‌కుమార్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారట. అలాగని వైసీపీ తరపున గట్టిగా మాట్లాడలేక పోతున్నారు. ఆయనను పార్టీ దాదాపుగా సైడున పెట్టిందనే టాక్ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారడమే ఉత్తమమని భావిస్తున్నారట అనిల్.

Related News

YCP Leaders: వైసీపీ అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఛీ మరీ ఇంత దిగజారాలా?

Janasena Leader Kiran Royal: అంబటికి గంట, అరగంట అలవాటే.. రోజవ్వకు జబర్దస్త్ గాలి పోలేదా.. జనసేన సెటైర్స్

Nara Lokesh Red Book: రెడ్ బుక్‌లో ఆ పేజీ ఓపెన్ చేసే సమయం అసన్నమైందా? నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రులేనా?

DGP Warns Netizens: డిప్యూటీ సీఎం కామెంట్స్.. రంగంలోకి డీజీపీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

Lady Aghori: విశాఖలో లేడీ అఘోరీ.. పవన్ కల్యాణ్‌కు నా ఆశీస్సులు

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Big Stories

×