EPAPER

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి
Ghee: ఇంట్లో ఉండే నెయ్యి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని ఉపయోగించడం ద్వారా చర్మం మెరుపుని పెంచుకోవచ్చు. పెదవులకు కొద్దిగా నెయ్యిని రాసి చూడండి.. ఎంత హైడ్రేటెడ్ గా ఉంటాయో. పెదవులే పొడిబారే సమస్య నుంచి నెయ్యి వెంటనే బయట పడేస్తుంది.


నెయ్యిని తినే పదార్థంగానే చూస్తాము. ఇది స్వీట్ లకు, బిర్యానీలకు మంచి రుచిని అందిస్తుంది. నెయ్యిని కేవలం ఆహార పదార్ధంగానే చూడకండి. దీన్ని అందాన్నిచ్చే కాస్మెటిక్స్‌గా కూడా వాడుకోవచ్చు. నెయ్యితో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీని సాయంతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. నెయ్యి కూడా పాల ఉత్పత్తి. పాలల్లో ఉండే గుణాలు నెయ్యిలో కూడా ఉంటాయి. కాబట్టి చర్మాన్ని మెరిపించే సామర్థ్యం నెయ్యిలో ఉంటుంది.

కొన్ని రకాల చర్మ సమస్యలు తగ్గాలన్నా, చర్మం రంగు ప్రకాశవంతంగా మారాలన్నా నెయ్యిని అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. చర్మానికి నెయ్యిని రాయడం వల్ల ఇది యాంటీ ఏజింగ్ క్రీమ్ గా పనిచేస్తుంది. ముఖంపై వచ్చే ముడతలను, గీతలను పోగొడుతుంది. వారంలో కనీసం రెండు మూడుసార్లు రాత్రిపూట నెయ్యిని ముఖానికి పట్టించి నిద్రపోండి. ఆ మార్పు రెండు మూడు వారాల్లోనే తెలుస్తుంది.


నెయ్యిలో ఉండే పోషకాలు
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని చర్మ సంరక్షనలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. చర్మానికి ఈ నెయ్యిని అప్లై చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. చర్మం బిగుతుగా మారుతుంది. మెరుపును సంతరించుకుంటుంది. ఇతర క్రీములు వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. మీరు చేయాల్సిందల్లా రెండు మూడు రోజులకు ఒకసారి పావు స్పూను నెయ్యిని తీసుకుని చేతులకు బాగా రుద్దుకొని ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది.

Also Read: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

ముఖానికి మాత్రమే కాదు శరీరానికి కూడా పట్టించడం వల్ల ఉపయోగం ఉంటుంది. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు, చర్మం లోపలికి ఇంకిపోతాయి. చర్మాన్ని లోపల నుంచి హైడ్రేటింగా మారుస్తాయి. దీనివల్ల చర్మం తేమవంతంగా ఉంటుంది. పొడిబారినట్టు మారకుండా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే చర్మం పొడిబారుతుందో దురదలు, దద్దుర్లు వంటివి వస్తాయి. అవి రాకుండా అడ్డుకునే శక్తి నెయ్యికే ఉంది.

నెయ్యిలో ఎమోలియంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి పొడిబారే లక్షణాలను తగ్గిస్తాయి. చర్మం పొరలు పొరలుగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ప్రతి పొరలోకి నెయ్యి ఇంకి అద్భుతమైన మాయిశ్చరైజర్లాగా పని చేస్తుంది. మీరు ఒక్కసారి వాడి చూడండి. దీని సామర్థ్యం మీకే తెలుస్తుంది. మీరు రెగ్యులర్ గా నెయ్యిని శరీరానికి అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా మారడం ఖాయం.

కొందరికి ఏ కాలంలోనైనా పెదాలు పగలడం అనే సమస్య కనిపిస్తుంది. దీనికి మంచి పరిష్కారం నెయ్యి వాడడమే. పగిలిన పెదవులకి నెయ్యిని అప్లై చేయడం వల్ల పెదవులు హైడ్రేటెడ్ గా ఉంటాయి. ఇప్పుడు పొడిబారే సమస్య తగ్గిపోతుంది. దీన్ని లిప్ మాస్క్ గా కూడా వాడుకోవచ్చు. పగిలిన చర్మానికి ఉపశమనం కలిగించడంలో నెయ్యి ముందుంటుంది. దీనిలో ఉండే హైడ్రేటింగ్ లక్షణాలు పెదవులను చర్మాన్ని కూడా తేమవంతంగా మారుస్తాయి.

నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా నిగారంపుతో కనిపించేలా చేస్తాయి. పెదవులపై కొందరికి నల్లని మచ్చలు వంటివి వస్తూ ఉంటాయి. అవి పోగొట్టుకోవాలన్నా కూడా నెయ్యిని అప్పుడప్పుడు పెదవులకు అప్లై చేస్తూ ఉండండి. నెయ్యిలో యాంటీ ఇన్ ఫ్లమ్మేషన్ లక్షణాలు కూడా ఎక్కువ. మీకు చర్మం దురద అనిపిస్తున్నప్పుడు లేదా చికాకు పెడుతున్నప్పుడు ఈ నెయ్యిని అప్లై చేయడం ఎంతో మంచిది. ఇది తేమను చర్మంలోనే లాక్ చేసి ఉంచుతుంది. పొడిగా మారకుండా కాపాడుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి మృదువుగా ఉండేలా చూస్తుంది. కాబట్టి నెయ్యిని మారడం ఈరోజు నుంచే ప్రారంభించండి.

Related News

Homemade Hair Oil: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Big Stories

×