Brahmamudi serial today Episode: కళ్యాణ్ మీద డాక్యుమెంటరీ తీసి దుగ్గిరాల ఫ్యామిలీ పరువు తీయాలనుకుంటుంది అనామిక. సామంత్ అడిగితే కూడా అదే కారణం చెప్తుంది. కానీ దీని వల్ల మనకేం లాభం అని సామంత్ అడుగుతాడు. ఆ కుటుంబం పరువు తీసేస్తే ఆటోమాటిక్ గా మార్కెట్ స్వరాజ్ కంపెనీ పడిపోతుందని చెప్తుంది. ఇలా చెప్పే మొన్న 40 కోట్లు లాస్ చేశావని సామంత్ అంటే పది సంవత్సరాలుగా రాని అవార్డు నీ కంపెనీకి వచ్చేలా చేసింది కూడా నేనే కదా సామంత్ అంటుంది అనామిక. దీంతో సామంత్ ఏమీ అనకుండా వెళ్లిపోతాడు.
హాల్లో అందరూ కూర్చుని ఇందిరాదేవి, సీతారామయ్యల కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంతలో రుద్రాణి ఏమిటీ ఈ అకాల సమావేశం అని అడుగుతుంది. దీంతో పక్కనే ఉన్న స్వప్న నీకు పోయే కాలం వచ్చినట్టు ఉంది. ఇప్పుడు అమ్మమ్మగారు ఏదో చెప్పబోతున్నారు విన అంటుంది. అప్పుడే అక్కడకు ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు.. ఏంటమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా..? అని సుభాష్ అడుగుతాడు. దీంతో అవునని దీపావళి పండగ వస్తుంది కదా దాని గురించి మాట్లాడాలి అని చెప్తుంది ఇందిరాదేవి.
ఈ సారి పండగకి మన కంపెనీ వర్కర్స్ కు బోనస్ ఇవ్వాలి కదా..? ప్రతి సంవత్సరం మన గెస్ట్ హౌస్ లో ఇచ్చేవాళ్లం. ఈసారి చిన్న మార్పు చేశాను అని సీతారామయ్య చెప్పగానే బోనస్సా.. అసలు ఈ సంవత్సరం కంపెనీకి అన్ని నష్టాలే వచ్చాయి కదా నాన్న మళ్లీ వర్కర్స్ కు బోనస్ ఎందుకు..? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఆ నష్టాలన్నీ నీ కొడుకు వల్లే వచ్చాయని స్వప్న అంటుంది. ఇంతలో మళ్లీ రుద్రాణి ఎవరైనా కంపెనీ లాభాల్లో ఉంటే బోనస్ లు ఇస్తారు. మీరేంటి రివర్స్ లో ఆలోచిస్తున్నారు అంటుంది. కంపెనీ లాభనష్టాలు ఎప్పుడు ఆలోచించ కూడదు. అయినా బోనస్ లు ఇస్తేనే కంపెనీకి నష్టాలు వస్తాయని నువ్వెలా అనుకుంటావు అని ఎదరు ప్రశ్నిస్తాడు సీతారామయ్య..
ఇంతలో అపర్ణ లాభనష్టాల గురించి చింత నీకెందుకు రుద్రాణి అని అడుగుతుంది. అంటే తనకు మాలిన ధర్మం ఎందుకని రుద్రాణి అంటుంది. అలా అయితే ఫస్ట్ మన ముగ్గరిని ఇంట్లోంచి గెట్ అవుట్ అనాలి తాతయ్యగారు అని స్వప్న చెప్పగానే నువ్వు సూపర్ స్వప్న చాలా బాగా చెప్పావు అంటాడు ప్రకాష్. ఇంతలో సుభాష్ బాగుంది నాన్నా.. కానీ ఈసారి చిన్న మార్పు అన్నారు అదేంటి..? అని అడుగుతాడు. దీంతో సీతారామయ్య ఈసారి బోనస్ లు గెస్ట్ హౌస్ లో కాకుండా ఇంట్లోనే ఇద్దామనుకున్నాను అని చెప్తాడు. అలాగే ఎప్పటిలా కాకుండా ఈ సారి బోనస్ లు మన కావ్య చేతుల మీదుగా ఇప్పించాలని చెప్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు ఒక్క ధాన్యలక్ష్మీ, రుద్రాణి తప్పా.. సీతారామయ్య నిర్ణయాన్ని రుద్రాణి, ధాన్యలక్ష్మీ అపోజ్ చేస్తారు.
సీతారామయ్య మాత్రం మీ నిర్ణయం తీసుకోవడానికి చెప్పలేదు.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి మీకు చెప్పాను. అలాగే నా ముగ్గురు మనవళ్లు ముగ్గురు మనవరాళ్లతో కలిసి ఈ సారి దీపావళి పండగ జరుపుకోవాలనుకుంటున్నాను. కావ్యను కళ్యాణ్, అప్పులను కూడా ఇంటికి పిలిపించండి అని సీతారామయ్య ఆర్డర్ వేస్తాడు. ప్రకాష్ వెంటనే లేచి కళ్యాణ్, అప్పులను ఇంటికి తీసుకురావడానికి నేను వెళ్తున్నాను అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ కూడా మీతో పాటు నేను వస్తాను అని వెళ్తుంది. ఇక కావ్యను తీసుకురావాలంటే అత్తయ్య వెళ్తేనే వస్తుంది అని అపర్ణ చెప్తుంది.
అయితే సరే నేనే వెళ్తాను అని ఇందిరాదేవి కావ్యను తీసుకురావడానికి వెళ్తుంది. కనకం ఇంటికి వెళ్లిన ఇందిరాదేవి కావ్యను పండగకి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చానని చెప్తుంది. దీంతో కావ్య నేనా.. నేను దీపావళి పండగకి వస్తే.. ముందు మీ మనవడి కళ్లల్లోనే టపాసులు పేలతాయి. అది మీకు బాగా తెలుసు అంటుంది. దీంతో ఆ టపాసుల మీద నీళ్లు చల్లడానికి నేను రెడీగా ఉంటాను కదా..? అంటూ భరోసా ఇస్తుంది ఇందిరాదేవి. కనకం కూడా ఎంత చెప్పినా కావ్య వినదు. దీంతో ఇద్దరూ కలిసి కావ్యను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఒప్పిస్తారు.
కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ధాన్యలక్ష్మీ లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి ఉంటుంది. దీంతో కళ్యాణ్, అప్పు ఎమోషనల్ గా పలకరిస్తారు. ధాన్యలక్ష్మీ లోపలికి వెళ్లి రూం చూసి ఇది ఇల్లులా లేదని మనం మన డ్రైవర్లకు ఇచ్చే రూములే దీనికన్నా బెటర్ అంటుంది. అసలు తన కొడుకు ఆటో నడుపుతున్నాడని తెలిస్తే ఈవిడ గుండె ఆగి చస్తుందేమో అని అప్పు మనసులో అనుకుంటుంది. ధాన్యలక్ష్మీ మాత్రం ఏంట్రా నీకీ ఖర్మా.. చూస్తుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ బాధపడతుంది. దీంత కళ్యాణ్ నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడుతున్నాము అమ్మా.. అని చెప్తుండగానే ప్రకాష్ ఇవన్నీ తర్వాత కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని పండగకు ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చామని చెప్పడంతో కళ్యాణ్, అప్పులు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.