trinayani serial today Episode: ముక్కోటి చాప దిండు తీసుకుని వెళ్తుంటే బామ్మ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో ముక్కోటి అత్తా చాప దిండు కూడా కొట్టేస్తాను అనుకుంటున్నావా..? అని అడుగుతాడు. వైకుంఠం వచ్చి పడుకోవడానికి వెళ్తున్నాడు అమ్మా అని చెప్తుంది. దీంతో పక్కింటికి వెళ్తున్నావా.? అంటూ తిడుతుంది. దీంతో ఊరికే తిట్టకే అంటూ త్రినేత్రి వస్తుంది.
తిట్టడం లేదే మొన్న చూసినప్పుడు పక్కింటి పంకంజం ఇంట్లోకి దూరిపోయాడు. నేను కళ్లారా? చూశాను. అలాగే ఇప్పుడు కూడా వెళ్తున్నావేమోనని అలా వెళితో ఏదో ఒకరోజు చస్తావు అంటుంది. దీంతో ఎవరు ఎలా పోవాలని ఉంటే అలా పోతారని వైకుంఠం అంటుంది. ఇంతలో త్రినేత్రి పంతులు గారి దగ్గరకు వెళ్లావు కదా? ఏమన్నాడు అని అడుగుతుంది త్రినేత్రి. పెళ్లి చేసుకోవాలని నీకు ఎంత ఉబలాటంగా ఉందో చేయాలని నాకు అంతే ఉబలాటంగా ఉందంటూ రేపే నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడని చెప్తుంది. త్రినేత్రి సిగ్గుతో వెళ్లిపోతుంది.
విక్రాంత్ ఏవో పేపర్స్ తీసుకొచ్చి నయనికి చూపిస్తుంటాడు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. ఏంటో అంత హడావిడిగా చూస్తుంది మా అక్క అంటూ అడుగుతుంది సుమన. దీంతో కాస్త ఆగు సుమన అంటూ నయని పేపర్స్ చూస్తుంది. చాలా ముఖ్యమైనది అయ్యుండొచ్చు అంటాడు వల్లభ. దీంతో హాసిని ఇరిటేటింగ్‌గా కాస్త ఆగమన్నప్పుడు ఆగాలి అంటుంది. ఇంతలో విశాల్ వచ్చి ఏంట్రా అని అడుగుతాడు. బ్రో వదినకు కలలో కనిపించిన అమ్మవారి తాలూకా వివరాలు సంపాదించాను అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు.
ఈ విషయంలో విక్రాంత్ బాబు చాలా కష్టపడ్డాడు అని నయని చెప్తుంది. అభిమానంతో చెవులే కాదు చాలా కోసుకునేలాఉన్నారు ఇంకా చెప్పాలంటే పిచ్చ ఫ్యాన్ అంటుంది సుమన. నీకు అసూయతో అలాంటి మాటలు వస్తున్నాయి. చిట్టి మీరు ఎవరూ చెల్లి మాటలు నమ్మకపోయినా.. విక్రాంత్ నిజం అని నమ్మించాడు అని చెప్తుంది హాసిని. ఏంటా నిజం అంటూ అడుగుతుంది తిలొత్తమ్మ. దీంతో వల్లభ పెద్ద మరదలుకు వచ్చిన కల అంటాడు. అయితే చావడమేనా..? అని సుమన అడగడంతో అందరూ షాక్ అవుతారు.
ఇంతలో నయని నాకు కనిపించిన గుడి దేవీపురంలో ఉందని చెప్తుంది. దీంతో విశాల్ ఆశ్చర్యంగా ఇది యాదృచ్చికమో.. దేవుడి మహిమో తెలియడం లేదు కానీ మనం ఒక ప్రాజెక్టు చేయాలని నిన్ననే ఒక డీల్ జరిగింది అని చెప్తాడు. దీంతో తిలొత్తమ్మ వెరీ ఇంట్రెస్టింగ్ అంటుంది. అంటే అక్కడికి మా నయని అక్క వెళ్తుందా..? వెళ్లే విష ప్రయోగం జరుగుతుందా..? ప్రాణగండం అక్కడే వస్తుందా..? అని సుమన అడుగుతుంది. దీంతో విక్రాంత్ కోపంగా సుమనను తిడతాడు.
ఇంతలో నయని లేదు విక్రాంత్ బాబు.. సుమన అన్నది నిజమే అంటుంది. నేను అక్కడికి వెళితే ఒక క్లారిటీ వస్తుంది అనగానే రిస్క్ తీసుకోవడం ఎందుకు చెల్లి అంటూ హాసిని చెప్తుంది. ముందు విశాల్ ను వెళ్లనివ్వు అక్కడి పరిస్థితులు తెలుసుకోనివ్వు అని చెప్తుంది. దీంతో నేను ఇంట్లోనే ఉన్నా నాకు వచ్చే గండం వస్తూనే ఉంటుంది. కానీ అది ఎలా వస్తుందో తెలుసుకుంటే ఆపొచ్చేమోనని నయని చెప్తుంది. ఇంతలో హాసిని ఆధారాలు నిజమైతే ఆపద నిజమే అవుతుంది అని చెప్పగానే ఈ విషయంలో అందరం కలిసికట్టుగా ఉందామని తిలొత్తమ్మ చెప్తుంది.
బామ్మ తినేత్రిని పిలుస్తుంటే.. ఏంటత్తా అని ముక్కోటి వస్తాడు. దీంతో ముక్కోటిని బామ్మ తిడుతుంది. ఇప్పుడు మా ఆయన ఏమన్నాడని తిడుతున్నావే అమ్మా అంటూ వైకుంఠం అడుగుతుంది. నేను త్రినేత్రిని పిలుస్తే వీడొచ్చి పలుకుతాడేంటి..? అంటుంది. ఇంతలో బామ్మ తీసుకొచ్చిన చీరను వైకుంఠంతో త్రినేత్రికి ఇప్పించి.. ఈ సంబంధం ఖాయం కాకపోతే వైకుంఠానికి ఆ ఏడుకోండల వాడికి గుండు కొట్టిస్తానని చెప్తుంది. దీంతో వైకుంఠం బాధపడుతుంది. ముక్కోటి మాత్రం ఆ దేవుడికి తలనీలాలు ఇవ్వడం పుణ్యమే కదా? అంటాడు. ఇంతలో త్రినేత్రి చీర కట్టుకుంటానని లోపలికి వెళ్తుంది.
విశాల్ దేవీపురం వెళ్లడానికి రెడీ అయి కిందకు వస్తాడు. నయనిని పిలుస్తాడు. ఇంతలో అందరూ వస్తారు. పావణమూర్తి మాత్రం అల్లుడి డ్రెస్ చూస్తుంటే వెళ్లే పని సక్సెస్ అయినట్టే అంటాడు. ఇంతలో సుమన, విక్రాంత్ గొడవ పడుతుంటే.. ఆగండని నేను దేవీపురం వెళ్తున్నాను మీరు గొడవ పడకండి అని చెప్తాడు. ఎందుకు అని వల్లభ అడిగితే వెళ్లేది రెండు పనుల కోసం కదరా.. ఆ రెండు పనులు సక్సెస్ కావాలని చెప్తుంది తిలొత్తమ్మ.
అయితే విశాల్ కు గాయత్రి పాపను ఎదురురమ్మని చెప్తుంది హాసిని. దీంతో ఎదురుగా వెళ్లిన గాయత్రి పాప వద్దని చేతులతో సైగ చేస్తుంది. దీంతో విక్రాంత్ ఎదురు రావాలి అమ్మా నాన్నా నిన్ను వదిలేసి వెళ్లిపోతున్నాడని వద్దంటున్నావా…? అంటాడు. ఇంతలో సుమన కొంపదీసి ఈ పిల్లకు కూడా జరగబోయేది తెలిసే శక్తి వచ్చిందా? అంటుంది. విక్రాంత్ కోపంగా సుమనను తిడతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.