Indian Railways: రైలు ప్రయాణం ఎన్నో సరికొత్త అనుభూతులను అందిస్తుంది. రైలు ఏదైనా నార్త్ నుంచి సౌత్ వరకు రకరకాల వ్యక్తులు కనిపిస్తుంటున్నారు. ప్రయాణ సమయంలో ఎన్నో ఆసక్తికర అంశాలు కనిపిస్తుంటాయి. చాలా మంది చిన్న పిల్లలను పడుకోబెట్టడానికి రైల్లోనే చీరతో లేదంటే లుంగీతో ఉయ్యాలు కడుతారు. అందులో వేసి ఊపుతూ నిద్రపుచ్చుతారు. మరికొంత మంది ఒకే బెర్తులో ఇద్దరు, ముగ్గురు కూడా అడ్జెట్ అయి పడుకుంటారు. ఇంకొంత మంది రైలు ఫ్లోర్ మీదే పడుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రయాణీకుడు కూడా ఇలాంటి కోవకు చెందిన వాడే. రద్దీగా ఉన్న రైల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు ఏకంగా రెండు అప్పర్ బెర్తుల నడుమ సన్నటి తాడుతో ఉయ్యాలను అల్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రెండు బెర్తుల నడుమ తాడుతో స్పెషల్ బెర్త్ తయారీ
ఇటీవలే ఓ ప్రయాణికుడు న్యూఢిల్లీ నుంచి దర్భంగా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. బుకింగ్ సమయంలో, వెయిటింగ్ లిస్ట్ 124గా చూపించింది. ఆ తర్వాత RAC టిక్కెట్‌పై వెయిటింగ్ 31కి పడిపోయింది. చివరకు RAC టిక్కెట్‌పై వెయిటింగ్ 12కి పడిపోయింది. అయితే, ఫైనల్ చార్ట్ రెడీ అయ్యే సరికి వెయిటింగ్ లిస్టు 18కి పెరిగింది. అత్యవసరంగా వెళ్లాల్సి ఉండటంతో రద్దీలోనే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే, రైల్లో బెర్త్ లేకపోవడంతో ఎలాగైనా సొంత బెర్త్ ఏర్పాటు చేసుకుని కాసేపు నిద్రపోవాలి అనుకున్నాడు. అప్పర్ బెర్తుల్లో ఉన్న ప్రయాణీకులను ఒప్పించి, రెండు బెర్తుల నడుమ తాడుతో ఉయ్యాల లాగ అల్లాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకునేలా ఏర్పాటు చేసుకున్నారు. తోటి ప్రయాణీకుల సాయంతో ఇబ్బందిలేకుండా జర్నీ కొనసాగించాడు. ఆయన స్పెషల్ గా బెర్త్ తయారు చేసుకుంటున్న వీడియోను కొంత మంది సెల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.
भारत जुगाड़ प्रधान देश है. pic.twitter.com/etICt6wwuI
— Priya singh (@priyarajputlive) November 4, 2024
Read Also: బాబూ! అది స్లీపర్ బెర్త్ కాదు, మెట్రో రైల్- మరీ అలా పడుకుంటే ఎలా?
రైళ్లలో ఇలాంటి ఘటనలు కామన్
ప్రయాణికులు స్పెషల్ గా బెర్త్ రెడీ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మేలో ఓ ప్రయాణీకుడు ఏకంగా ఆరు సీట్లకు అడ్డంగా ఓ టెంపరరీ బెర్త్ ఏర్పాటు చేశాడు. అందులో తన బిడ్డను బెడ్ షీట్ కప్పి పడుకోబెట్టాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మైసూరు సమ్మర్ స్పెషల్ లోని 3ఏసీ కోచ్‌లో ఈ ఘటన జరిగింది. తాజాగా మరోసారి అలాంటి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైళ్లలో దూర ప్రయాణాలు చేసే సమయంలో బెర్త్ లేనప్పుడు ప్రయాణీకులు తాతాల్కికంగా ఇలా బెర్తులు ఏర్పాటు చేసుకుంటూ జర్నీ చేయడం కనిపిస్తుంది. ప్రయాణీకుడి ఆలోచనకు నెటిజన్లు అభినందిస్తున్నారు.
Read Also: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ.. వేగంగా దూసుకొచ్చిన రైలు, రెప్పపాటులో ఎగిరిపడ్డ యువకుడు