OTT Movie : ఈరోజుల్లో డిజిటల్ మీడియా ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. మూవీ లవర్స్ కు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఒక వరం గా మారిందని చెప్పవచ్చు. మూవీ లవర్స్ తనకు నచ్చిన సినిమాలను ఓటీటీలలో వీక్షించే అవకాశం ఉండటంతో మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ సైకో కిల్లర్ మూవీ వీక్షకులను ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ కధతో తెరకెక్కిన ఒక సైకో కిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
జి 5 (Zee5)
ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ పేరు “ఎఫ్ఐఆర్ ” (F.I.R). ఇది ఒక బెంగాలీ మూవీ. ఈ మూవీ స్టోరీ మారుమూల గ్రామంలో కొంతమందిని చంపే ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక మారుమూల గ్రామంలో సుశీల్ అనే సర్పంచ్ ఉంటాడు. అదే గ్రామంలో మాజీ సర్పంచ్ భగీర అనే గ్యాంగ్ స్టర్ కూడా ఉంటాడు. ఎలక్షన్లు దగ్గరకి వస్తూ ఉండటంతో ఈ రెండు గ్యాంగులకు సంబంధించిన గోడవల్లో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. అయితే ఈ హత్యలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. భగీర ఇల్లీగల్ పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఈ కేసును ఇన్వెస్ట్ చేయడానికి దత్త అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. దత్త గ్రామ సర్పంచ్ దగ్గరికి ఎంక్వయిరీకి వస్తాడు. హత్యలు ఎవరు చేశారో నాకు తెలియదు. నాకు భగీర పైన అనుమానం ఉంది. అతనికి భయపడి నా కొడుకుని కూడా దూరంగా చదివిస్తున్నాను అని ఆ పోలీస్ ఆఫీసర్ తో చెప్తాడు సుశీల్. ఇలా ఎంక్వయిరీ చేస్తుండగానే ఇంకో హత్య జరుగుతుంది.
పోలీస్ ఆఫీసర్ ఈ హత్యలు ఎలా జరిగాయో డాక్టర్ని పోస్టుమార్టం రిపోర్ట్ అడుగుతాడు. చంపిన వ్యక్తి వీరి మీద పగబట్టి చంపినట్టు ఉన్నాడు. మొదట వీళ్లను చంపి తరువాత వాళ్లని తాడుతో ఉరితీసాడని డాక్టర్ పోలీస్ ఆఫీసర్ కి చెబుతుంది. ఇదే క్రమంలో భగీర అమ్మాయిలను లారీలలో ఎక్స్పోర్ట్ చేస్తుండగా పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడు. మరోవైపు సైకో కిల్లర్ మరికొన్ని హత్యలు చేస్తాడు. ఈ కేసును ఛేదించే క్రమంలో పోలీస్ ఆఫీసర్ కి దిమ్మతిరిగే నిజాలు తెలుస్తాయి. చివరికి ఆ సైకో కిల్లర్ని ఈ పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడా? ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో పోలీస్ ఆఫీసర్ తెలుసుకున్న ఆ రహస్యాలు ఏమిటి? ఆ సైకో కిల్లర్ తో పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఎఫ్ఐఆర్ ” (F.I.R) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి. ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉన్న ఈ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ మిస్ అవ్వకుండా చూడండి.