EPAPER

Kondakal Village Land Scam: కొండకల్ క్లియరెన్స్ పై ఈడీ ఫోకస్‌.. బాధితులకు ‘స్వేచ్ఛ’ ఆహ్వానం

Kondakal Village Land Scam: కొండకల్ క్లియరెన్స్ పై ఈడీ ఫోకస్‌.. బాధితులకు ‘స్వేచ్ఛ’ ఆహ్వానం

కొండకల్ కబ్జా కథలు
అడ్రస్ లేని భూములకు ఎసరు!
ఈడీ ఫోకస్‌తో చెక్ పడుతుందా?


⦿ చేతులు మారుతున్న బిలా దాఖలా భూములు
⦿ సర్వే నెంబర్ లేని భూమికి ఒకనాడు అసైన్డ్ పత్రం ఇచ్చిన వైఎస్ సర్కార్
⦿ ప్రాసెస్ సరిగ్గా జరగలేదని రికార్డుల్లోకి ఎక్కించని అధికారులు
⦿ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన మర్రి జనార్ధన్ రెడ్డి
⦿ 123 ఎకరాలను అగ్రిమెంట్ చేసుకున్న వినాయక డెవలపర్స్
⦿ ముందుండి అంతా నడిపించిన దాసరి మధు మోహన్, భూపాల్
⦿ ఆలస్యం చేయడంతో గ్రామస్తుల తిరకాసు
⦿ ఇంటింటికీ 8 లక్షల నగదు చేరేలా సెటిల్మెంట్
⦿ మళ్లీ ఊపందుకున్న రిజిస్ట్రేషన్ పక్రియ
⦿ ఎకరం రూ.7 కోట్ల ఖర్చుతో ముందుకొచ్చిన సూర్య బిల్డర్స్
⦿ ఒక్క డీల్‌తో రూ.350 కోట్లు దొచుకున్న బీఆర్ఎస్ నేత
⦿ మార్కెట్ వాల్యూ రూ.3,700 కోట్లకు పైనే
⦿ బినామీ వ్యవహారం చూస్తే రూ.850 కోట్లకు పైనే?
⦿ కొండకల్ క్లియరెన్స్ వ్యవహారంపై కొత్తగా ఈడీ ఫోకస్‌
⦿ బీఆర్ఎస్ హయాంలో అసైన్డ్ భూముల దోపిడీపై స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 1

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Kondakal Village Land Scam: కొండకల్ భూములంటేనే కిరికిరి లేకుండా ఉండదు. విక్రమ్ రెడ్డి దొర చేసిన అరాచకాలకు, వేల ఎకరాలకు వారసులమని చెప్పుకుంటూ చేసిన దందాలను మరువకముందే బిలా దాఖలా భూముల వివాదం ముందుకు తెచ్చారు బీఆర్ఎస్ నేతలు. 2023లో అప్పటి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఈ భూముల కొనుగోలుకు ప్రయత్నం మొదలుపెట్టారు.


రూ.2 కోట్ల 40 లక్షలకు ఎకరం చొప్పున 123 ఎకరాల భూమిని వినాయక డెవలపర్స్ పేరుతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆ భూములను దాసరి మధు మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కుమారుడు భూపాల్ 12 మంది కుటుంబాల అసైనీల వద్ద నుంచి పూలింగ్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్స్ పక్రియ కొనసాగుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు.

గ్రామానికి చెందిన భూములు, అసైనీలకు రెవెన్యూ రికార్డులు ఎక్కలేదని గొడవలు చేశారు. వందల కోట్లకు రేట్లు పెరిగిపోవడంతో గ్రామం అంతా ఏకమైంది. ఆ భూమంతా తమకే చెందాలని గొడవలు పెట్టడంతో సమస్య మొదటికొచ్చింది. దీంతో కొంతమంది మధ్యవర్తిగా వ్యవహరించి కొండకల్ ఊరిలో ప్రతి కుటుంబానికి డబ్బులు చేరేలా రూ.75 కోట్ల నగదు, ఎకరం భూమి క్లియర్ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. రూ.75 కోట్లు సూర్య బిల్డర్స్ ఇచ్చేంత వరకు 8 ఎకరాల 20 గుంటల భూమిని వారి అగ్రిమెంట్స్ నుంచి తొలిగించేలా అంగీకరించారు.

దీంతో మొదటగా వినయక డెవలపర్స్ నుంచి సూర్య బిల్డర్స్‌కి ఎకరానికి కొటి రూపాయలు ఎక్కువయింది. మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ.300 కోట్ల నుంచి రూ.850 కోట్లకు ఏడాదిన్నరలో తీసుకొచ్చారు. ఇదే గ్రామానికి, మోకిల రెవెన్యూ పరిధిలో మిగులు భూమి మరో 22 ఎకరాలు ఉంటుంది. దీన్ని కూడా గంపగుత్తగా మొత్తం 123 ఎకరాలను క్లియర్ చేసుకుంటామని, 25 శాతానికే కొనుగోలు వ్యవహారం కొనసాగుతోంది.

ఇది ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్ కాదా?
బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను కొల్లగొట్టిన నేతలు లక్షల కోట్లకు పడగలెత్తారు. అందుకు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. 2005లో ప్రభుత్వ భూమిగా, సర్వే నెంబర్స్ కేటాయించకపోవడంతో ఆ భూములను పక్కనే దున్నుకుంటున్న రైతుల కుటుంబాలకు కేవలం పత్రాలు మాత్రమే అందజేశారు. కానీ, రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ 554 వరకు సర్వే నెంబర్స్ ఉన్నాయని 555గా సర్టిఫికెట్స్ ఇచ్చారు. దీంతో ఆ భూమి అంతా 555 గానే ఉండిపోయింది. కానీ, ఎక్కడా ఈ సర్వే నెంబర్ రికార్డుల్లో లేదు. ఇది అసైన్డ్ భూమిగా పరిగణించాలి. ఈ భూమిని 22(ఏ)లో పొందుపర్చాలి. అమ్మితే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి.

జీవో నెంబర్ 1406 ఆఫ్ 1958 ప్రకారం రైతులకు అసైన్ చేసిన భూములను అమ్ముకోరాదు. వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977 అమల్లోకి వస్తుంది. లేదా ఎవరూ లేని భూమిగా రెవెన్యూలో ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేలా చర్యలు ఉండాలి. కానీ, మార్కెట్ విలువ ప్రకారం రూ.3,700 కోట్ల విలువ చేసే భూమి అప్పనంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లూటీ అయింది. నిజానికి, బిలా దాఖలా భూమి అనేది కొలతకు రానిది. సర్వే నెంబర్ లేని ప్రభుత్వ భూమిగా చెబుతారు.

అమోయ్ ఖాతాలోనే ఈ బిలా దాఖలా భూములు.. ఈడీ ఫోకస్ అందుకేనా?
శంకర్‌పల్లి ఎమ్మార్వోకి, చేవెళ్ల ఆర్డీవో‌కి, తెలియకుండా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండానే 555 సర్వే నెంబర్‌లో బిలా దాఖలా భూముల వ్యవహారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు చేకూరేలా నవంబర్ 2023లో ధరణిలో చకచక ఎక్కించేశారు. ఎవరి పేర్లు చెబితే వారికి అగ్రిమెంట్ల రూపంలోనే ఈ భూములు బదులాయింపులు జరిగాయి.

సర్కార్‌కి చెందాల్సిన ఈ భూముల వ్యవహరంపై ఈడీ ఫోకస్ చేసింది. దీనిపై ఐఏఎస్ అమోయ్ కుమార్‌ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గతంలోనే దీనిపై ఫిర్యాదులు ఈడీకి చేరాయి. కానీ, అదే గ్రామస్తులు ఇంటింటికి రూ.8 లక్షల నగదు, ఎకరం భూమి విక్రయించి మరొకచోట లే అవుట్ చేసుకునేలా ప్లాన్ అంతా సెట్ చేయడంతో రూ.3,700 కోట్ల ప్రభుత్వ భూమిని మింగేస్తున్నారు.

Also Read: Musi River : మూసీ తీరాన సీఎం పాదయాత్ర

బాధితులకు ‘స్వేచ్ఛ’ ఆహ్వానం
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అసైన్డ్ భూముల సమస్యలను వెలుగులోకి తెస్తాం. బాధితులు ‘స్వేచ్ఛ’ను సంప్రదించవచ్చు. భూమి మీదై గులాబీ లీడర్ల చేతిలో ఉంటే 9848070809 ఫోన్ నెంబర్‌కు కాల్ చేయండి. బీఆర్ఎస్ బాధితులకు ఇదే మా ఆహ్వానం.

Related News

Caste Census Survey: బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే

Formula E Race Scam: ఫార్ములా రేస్ స్కామ్.. ఏసీబీ దర్యాప్తు వేగవంతం, రేపో మాపో నోటీసులు

Rahul Gandhi: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. కులగణనపై చర్చ, ఆపై

CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం – విద్యార్ధులకు సీఎం రేవంత్ హామీ

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

Big Stories

×