Film Stars: ఒకప్పుడు ప్రతి సినిమా కూడా ఆ భాష ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యేది. ఆ తర్వాత కాలక్రమేనా తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ అంటూ ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇంకో భాషలో రీమేక్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సెలబ్రిటీస్. ఈ నేపథ్యంలోనే అప్పట్లో రూ.100 కోట్ల వసూళ్లు అంటే భారతీయ సినిమాలో గొప్ప విజయం గా భావించేవారు. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు చాలా సునాయాసంగా ఈ టార్గెట్ ను రీచ్ అవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న యంగ్ హీరోలు, హీరోయిన్లు కూడా ఈ టార్గెట్ రీచ్ అవుతున్నారటంలో సందేహం లేదు. ఇకపోతే రూ .100 కోట్ల క్లబ్ లో ఎక్కువ సినిమాలు చేర్చిన ఆ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
అక్షయ్ కుమార్:
బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈమధ్య కాలంలో విలన్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఈయన నటించిన చిత్రాలలో ఏకంగా 16 సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇకపోతే రూ.100 కోట్ల కలెక్షన్స్ ను ఎక్కువ సినిమాలు సాధించిన స్టార్స్ జాబితాలో అక్షయ్ కుమార్ రెండవ స్థానంలో ఉన్నారు. మరి ప్రథమ స్థానంలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.
సల్మాన్ ఖాన్ :
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటుడిగా, నిర్మాతగా, టీవీ హోస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 30 ఏళ్లకు పైగా బాలీవుడ్ లో రాజ్యమేలుతున్నారు సల్మాన్ ఖాన్. ఇకపోతే ఈయన నటించిన 17 సినిమాలు ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి.
విజయ్ దళపతి :
తమిళ సినిమా స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi)బాక్సాఫీస్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన 69వ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే ఈయన నటించిన దాదాపు 11 చిత్రాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి.
షారుఖ్ ఖాన్ :
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చాలా హిట్ సినిమాలలో నటించారు. రూ .100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి. దీంతో ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇకపోతే కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన ఈయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి పఠాన్, జవాన్, డంకీ వంటి సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నారు.
రజనీకాంత్..
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ఇటీవల నటించిన జైలర్, వేట్టయాన్ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే రజినీకాంత్ నటించిన తొమ్మిది సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి. దీంతో అనేకసార్లు తమ సినిమాలతో రూ.100 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిన హీరోగా ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు.