Congress :
⦿ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఫోకస్
⦿ వేగవంతం చేసేలా ప్రణాళికలు
⦿ ఉమ్మడి జిల్లాల వారీగా 9 మంది ఐఏఎస్‌ల నియామకం
⦿ తక్షణమే పర్యటనలు చేసి పరిశీలించాలని ఆదేశాలు
⦿ జిల్లాల వారీగా రోజు వారీ రిపోర్టులు
⦿ ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, స్వేచ్ఛ : రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అలాగే, రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. జిల్లాల వారీగా రోజు వారీ రిపోర్ట్ అందించాలన్నారు సీఎం.
ప్రత్యేక అధికారులు వీరే
⦿ ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య
⦿ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల – ఆర్వీ కర్ణన్
⦿ నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనితా రామచంద్రన్
⦿ నిజామాబాద్, కామారెడ్డి – ఏ శరత్
⦿ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి- డీ దివ్య
⦿ మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ – రవి
⦿ వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – వినయ కృష్ణా రెడ్డి
⦿ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట- హరిచందన దాసరి
⦿ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం – కె సురేంద్ర మోహన్
ALSO READ : రిజర్వేషన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ నేతలు