EPAPER

Genelia: అలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న జెనీలియా..!

Genelia: అలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న జెనీలియా..!

Genelia.. ప్రముఖ హీరోయిన్ జెనీలియా ‘సత్యం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై తన అందం నటనతో తెలుగు ఆడియన్స్ లో మంచి మార్కులే వేయించుకుంది. ఆ తర్వాత ‘సాంబ’,’ నా అల్లుడు’, ‘ సుభాష్ చంద్రబోస్’, ‘హ్యాపీ ‘, ‘రామ్’, ‘బొమ్మరిల్లు’, ‘ ఢీ’, ‘ఆరెంజ్’, ‘నా ఇష్టం’, ‘రెడీ’ వంటి సినిమాలలో నటించి మెప్పించింది జెనీలియా. ఇలా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ చాలా మంది హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.


అరుదైన వ్యాధితో బాధపడుతున్న జెనీలియా..

వివాహం తర్వాత ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన జెనీలియా భర్త , పిల్లలతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకున్నా .. ఆమె మాత్రం రీ ఎంట్రీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఇదిలా ఉండగా పైకి చాలా సంతోషంగా కనిపించే జెనీలియా ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతోందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


వింత వ్యాధితో కష్టాలు..

చాలా అరుదుగా వచ్చే జబ్బుతో జెనీలియా గత కొంతకాలంగా బాధపడుతోందని సమాచారం. ఆమెకి క్లైమేట్ చేంజ్ అయితే బాడీలో వెంటనే చేంజస్ వస్తాయట. ముఖ్యంగా స్వీట్స్, కూల్డ్రింక్స్ లాంటివి తీసుకున్నా.. లేదా చల్లని నీళ్లు, చల్లటి పానీయాలు, పదార్థాలు ఇలా ఏవి తీసుకున్నా సరే వెంటనే శరీరంపై రాషెష్ వస్తాయట. దీనికి తోడు కళ్ళు కూడా మసకగా కనిపిస్తాయట. అందుకే ఎప్పుడూ కూడా కొంచెం టెంపరేచర్ ఉన్న నీళ్ళని , ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటుందట జెనీలియా. అంతే కాదు చల్లని వాతావరణం జోలికి అసలే వెళ్లదట. మరి చలికాలం వస్తే ఏంటి పరిస్థితి అంటే సాధ్యమైనంత వరకు బయటకి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. తప్పని పరిస్థితుల్లో బయటకి వచ్చినా ఫుల్ బాడీని కవర్ చేసుకునేలా దుస్తులు ధరిస్తుందట జెనీలియా. ఇకపోతే ఇప్పటికే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే ఇప్పటికి ఆమె ఈ వ్యాధి నుంచి బయటపడలేకపోతుందని సమాచారం. ఇకపోతే జెనీలియాకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుండగా ఈ వార్త విన్న అభిమానులు ఎంత కష్టం వచ్చింది అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక జెనీలియా త్వరగా కోలుకోవాలని విదేశాలకు వెళ్లిన ట్రీట్మెంట్ తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

అరుదైన జబ్బుల బారిన పడుతున్న హీరోయిన్స్..

ఇకపోతే ఇలాంటి అరుదైన సమస్యలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ బాధపడుతున్నారు. కొంతమంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. ఉదాహరణకు సమంత(Samantha )తో పాటు మరికొంతమంది హీరోయిన్స్ మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి కూడా చర్మ సంబంధిత సమస్యలు మరెన్నో వస్తున్నాయి. అయితే వీరంతా కూడా వీటిని అధిగమించి ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జెనీలియా కూడా ఇలా తనను తాను బలోపేతం చేసుకొని ఇండస్ట్రీలో నటించాలని కోరుకుంటున్నారు. మరి జెనీలియా ఇండస్ట్రీ కి రావడం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related News

Rana comments on Mr Bachchan: లాస్ట్ కి అవార్డు తీసుకునే స్టేజ్ మీద కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు

Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు

Chiranjeevi : మెగాస్టార్ ఇంట మెగా ఫంక్షన్… గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయిన శ్రీజ

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Sai Pallavi: సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. ఇక నుంచి ఆమె పేరు ఇదే

Nivetha Pethuraj : అతని చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్.. అయ్యో పాపం..

Thandel: తండేల్.. ఫిబ్రవరి రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా..?

Big Stories

×