Quincy Jones Death: మైఖేల్ జాక్సన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. పాప్ సింగర్, డ్యాన్సర్‌గా తన పేరునే ఒక బ్రాండ్‌గా మార్చుకున్నారు. అయితే ఆయన టాలెంట్‌ను ప్రపంచాన్ని చూపించడం కోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయనను నమ్మి, ఆయన ఆల్బమ్స్‌ను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. ఆయనే క్విన్సీ డిలైట్ జోన్స్ జూనియర్ అలియాస్ క్విన్సీ జోన్స్. 1933 మార్చి 14న జన్మించిన ఆయన.. నవంబర్ 3న మరణించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ ప్రపంచమంతా ఆయన మరణాన్ని తీరని లోటని సోషల్ మీడియాలో క్విన్సీ జోన్స్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
27 సార్లు విన్నర్
దాదాపు తన 70 ఏళ్ల జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు క్విన్సీ జోన్స్ (Quincy Jones). ఆయన ఒక అమెరికన్ రికార్డ్ ప్రొడ్యూసర్, సాంగ్ రైటర్, కంపోజర్, అరేంజర్, టీవీ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు జోన్స్. దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మైఖేల్ జాక్సన్ లాంటి ఎంతోమంది లైఫ్ ఇచ్చారు. సంగీత ప్రపంచంలో పనిచేసేవారికి గ్రామీ అవార్డ్ అందుకోవాలి అనేది ఒక కలలాగా నిలిచిపోతుంది. అలాంటిది 27 సార్లు గ్రామీ అవార్డును అందుకున్న ఘనత క్విన్సీ జోన్స్ సొంతం. 79 సార్లు గ్రామీ అవార్డ్‌కు నామినేట్ అవ్వగా అందులో 27 సార్లు ఆయనకు అవార్డ్ దక్కడం విశేషం.
Also Read: రౌడీ హీరో మూవీలో డేంజరస్ హాలీవుడ్ యాక్టర్… అప్పుడు మమ్మీలో విలన్… ఇప్పుడు..?
ఎంతోమందికి మెంటర్‌గా
ఎంతోకాలం పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట క్విన్సీ జోన్స్. ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని బెల్ ఏయిర్ సెక్షన్ ప్రాంతంలో ఉన్న స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. క్విన్సీ జోన్స్‌కు ఏడుగురు పిల్లలు. అందులో ఒకరే నటి రషీదా జోన్స్. మైఖేల్ జాక్సన్‌కు మాత్రమే కాకుండా రే చార్లెస్, ఫ్రాంక్ సినాత్ర వంటి వారికి కూడా ఆయన మెంటర్‌గా వ్యవహరించారు. మైఖేల్ జాక్సన్ ఫేమస్ ఆల్బమ్స్ అయిన ‘ఆఫ్ ది వాల్’, ‘థ్రిల్లర్ అండ్ బ్యాడ్’ లాంటి సూపర్ హిట్స్ ఆల్బమ్స్‌ను క్విన్సీ జోన్స్ నిర్మించారు. మామూలుగా అమెరికాలో బ్లాక్స్ అండ్ వైట్స్ అనే తేడా చాలా ఉంటుంది. అలాంటి తేడాను మొదటిసారి ఎదిరించి నిలబడ్డారు జోన్స్.
పుస్తకాలు రాశారు
సినిమాలకు అత్యుత్తమ సంగీతాన్ని అందించిన మొదటి బ్లాక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా క్విన్సీ జోన్స్ ఘనతను సాధించారు. ఆయన బాటలోనే మరెందరో బ్లాక్స్.. మ్యూజిక్ ప్రపంచంలో అడుగుపెట్టగలిగారు. 1964లో విడుదలయిన ‘ది పాన్ బ్రోకర్’ అనే సినిమాకు మొదటిసారి సంగీత దర్శకుడిగా వెండితెరపై అడుగుపెట్టారు జోన్స్. 1967లో ఆయన సంగీతం అందించిన సినిమాకు ఆస్కార్ దక్కడంతో అసలు క్విన్సీ జోన్స్ అంటే ఎవరో ప్రపంచానికి తెలిసింది. తన సంగీత ప్రయాణాన్ని మొత్తం ఒక పుస్తకంగా కూడా రాశారు. అలా తన జర్నీని ప్రపంచంతో పంచుకొని ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచారు. క్వీన్స్ జోన్స్ మన మధ్య లేకపోయినా సంగీత ప్రపంచంలో ఆయన స్థానం చెరిగిపోదని ఫ్యాన్స్ అంటున్నారు.