EPAPER

Prashanth Neel – Prasannth Varma : ఈ ప్రశాంత్ ప్రూవ్ చేసుకున్నాడు… ఆ ప్రశాంత్ నాశనం చేసుకున్నాడు..

Prashanth Neel – Prasannth Varma : ఈ ప్రశాంత్ ప్రూవ్ చేసుకున్నాడు… ఆ ప్రశాంత్ నాశనం చేసుకున్నాడు..

Prashanth Neel – Prasannth Varma : సౌత్ ఇండియాలో ఈ మధ్య కాలంలో కొంత మంది డైరెక్టర్లు ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో కన్నడ నుంచి ప్రశాంత్ నీల్. తెలుగు నుంచి ప్రశాంత్ వర్మ. కేజీఎఫ్, సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్‌కు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. ఇటు ప్రశాంత్ వర్మ… హనుమాన్ మూవీతో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ హిట్స్ తర్వాత ఇద్దరిలో ఎవరు కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేస్తున్నారు అని అనాలిసిస్ చేస్తే… ప్రశాంత్ నీల్ కంటే, ప్రశాంత్ వర్మనే ముందు ఉన్నాడు. ఎలా అనుకుంటున్నారా… అయితే ఇక్కడ చూడండి…


ఫస్ట్ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుదాం…

ప్రశాంత్ వర్మ… హనుమాన్ తర్వాత పక్క ప్లాన్‌తో వెళ్తున్నాడు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో వీలైనన్ని ఎక్కువ మూవీస్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతే కాదు, ఈ సినిమాటిక్ యూనివర్స్ పైన ఫొకస్ పెడుతూనే తనలో ఉన్న రైటర్‌కి పని చెబుతూ క్యాష్ చేసుకుంటున్నాడు.


కథలను అందిస్తూ తన అసిస్టెంట్స్‌తో సినిమాలను డైరెక్ట్ చూయిస్తున్నాడు. దీంతో తక్కువ టైంలోనే తన సినిమాటిక్ యూనివర్స్‌లో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మ.. హనుమాన్‌కి ముందు అద్భుతం అనే మూవీకి కథ అందించాడు. మల్లిక్ రామ్ దీనికి డైరెక్టర్.

హనుమాన్ తర్వాత “దేవకీ నందన వాసుదేవ” అనే మూవీకి స్టోరీ అందించాడు. ఈ సినిమాలో అశోక్ గల్ల హీరో. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కి సంబంధం లేదు. కథ అందిచిన తర్వాత ఈ సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్‌ తీసుకుని చేతులు దులుపుకోలేదు. ప్రమోషన్స్ లోనూ పాల్గొటున్నాడు.

Also Read : ‘జై హనుమాన్’ 7వ మూవీనా? ఈ కన్ఫ్యూజ్ ఏంటి మాస్టారు.. ఆ రెండిటి పరిస్థితి ఏంటి?

దీంతో పాటు ప్రశాంత్ వర్మ అందిస్తున్న మరో కథ.. మహకాళి. ఆయన సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోతున్న లేడీ సూపర్ హీరో మూవీ ఇది. దీనికి ప్రశాంత్ వర్మనే కథ అందించాడు. ఈ సినిమాకు మార్టిన్ లూథర్ కింగ్ ఫేం పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకత్వం పూజ అపర్ణ అయినా… ప్రశాంత్ వర్మనే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుదాం…

ప్రశాంత్ వర్మ లా.. ప్రశాంత్ నీల్ కూడా ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. కేజీఎఫ్‌తో పేరుతో సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సలార్‌ పార్ట్ 1 చేశాడు. పార్ట్ 2 రాబోతుంది. ఈ సినిమాలు ఉండగానే, వేరే సినిమాలకు కథలను అందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అలా వచ్చిందే బఘీర మూవీ. యాక్షన్ సీన్స్ అన్ని ఉండేలా ప్రశాంత్ నీల్ కథను అందించాడు. దీనికి డాక్టర్ సూరి డైరెక్టర్. అయితే ఇక్కడ ప్రశాంత్ నీల్ ఓన్లీ కథను మాత్రమే అందించాడు. తర్వాత ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. దీంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒంటరైపోయింది. ప్రశాంత్ నీల్ కథ కాబ్టటి… తెలుగు ఆడియన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఏ మాత్రం ప్రూవ్ చేసుకోకుండా బఘీర నిరాశపరిచింది. ఇక కన్నడలో కూడా అదే పరిస్థితి.

Also Read : ‘బఘీర’ మూవీ రివ్యూ

ఒక వేళ ప్రశాంత్ వర్మ… ఈ సినిమాకు అన్ని తానై చూసుకుంటే, బజ్ బాగా క్రియేట్ అయ్యేది. మంచి రిజల్ట్ వచ్చేది. ఈ విషయంలో ప్రశాంత్ వర్మ ముందు ప్రశాంత్ నీల్ తేలిపోయాడని చెప్పొచ్చు.

Related News

Thandel Release Date: ‘తండేల్’ రిలీజ్ డేట్ ఇదే.. సేఫ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్..?

Kamal Haasan: కమల్ పుట్టినరోజుకు సిద్ధంగా ఉండండి థగ్స్.. మణిరత్నం నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుంది

Dhoom Dhaam Movie: బఘీర మూవీ పై యంగ్ హీరో అసహనం.. కెరియర్ పై దెబ్బేసుకుంటారా..?

Citadel Honey Bunny: హైదరాబాద్‌లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ స్పెషల్ స్క్రీనింగ్.. యంగ్ హీరోతో సమంత సందడి

Amala Paul: మొదటి భర్త పై అలాంటి కామెంట్స్ చేసిన అమలాపాల్.!

Trisha: విజయ్ తో రూమర్స్ పై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన త్రిష..!

Samantha : తోడుగా నేనుంటా… నెటిజన్ ప్రపోజల్ కు సామ్ హార్ట్ ఫెల్ట్ రిప్లై

Big Stories

×