EPAPER

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల గొడవ.. తొలి సమావేశంలోనే ఆర్టికల్ 370పై మాటల యుద్ధం

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల గొడవ.. తొలి సమావేశంలోనే ఆర్టికల్ 370పై మాటల యుద్ధం

Jammu Kashmir Assembly| జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల ఎన్నికలు జరిగిన తరువాత తొలిసారిగా సోమవారం అసెంబ్లీ కొలువుదీరింది. అసంబ్లీ తొలి సమావేశంలో చర్చ ప్రారంభమైన కాపేట్లోనే ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. కానీ ఈ గొడవ అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీల మధ్య జరగలేదు. ప్రతిపక్ష పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బిజేపీ), పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పిడిపి) ఎమ్మెల్యేల మధ్య జరగడం విచిత్రం.


మెహ్‌బూబా ముఫ్తీ నేతృత్వంలోని పిడిపి ఎమ్మెల్యే వహీద్ పారా అసెంబ్లీ తొలి సమావేశంలో జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ బిల్లును ప్రవేశ పెట్టారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి తిరిగి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన బిల్లు ప్రవేశ పెట్టగానే బిజేపీ ఎమ్మెల్యేలు వెంటనే వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీలో గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే వహీద్ పారా డిమాండ్లను, ఆయన చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని బిజేపీ ఎమ్మెల్యేలు కోరారు. వహీద్ పారా అసెంబ్లీ నియమాలను ఉల్లంఘించారిన ఆరోపించారు.

Also Read: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు


అయితే పిడిపి అధ్యక్షరాలు మెహ్‌బూబా ముఫ్తీ తమ పార్టీ ఎమ్మెల్యే అయిన వహీద్ పారా ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తొలి సమావేశంలోనే జమ్మూ కశ్మీర్ కు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తినందుకు ఆయనను ప్రశంసించారు. “ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకించి జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదీ కల్పించాలని ఎమ్మెల్యే వహీద్ పారా తొలి సమావేశంలోనే డిమాండ్ చేయడం అభినందనీయం” అని చెప్పారు.

‘అంతా పిడిపి ఆడుతున్న నాటకం.. కెమెరాల్లో కనిపించేందుకే ఆర్టికల్ 370 ప్రస్తావన’
పిడిపి ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 ప్రస్తావన తొలి సమావేశంలోనే తీసుకురావడంపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. దీని గురించి ముందుగానే సమాచారం ఇవ్వలేదని.. ఇదంతా నాటకమని చెప్పారు. “ఆర్టికల్ 370పై ఈ సమయంలో చర్చించడం అంత అవసరం కాదు. ఒకవేళ ఏమైనా ఉంటే మాకు మాతో ముందే చర్చించాల్సింది. ఇదంతా కెమెరాల్లో కనిపించేందుకు పిడిపి ఎమ్మెల్యే చేస్తున్నారు. అంతేకానీ వారికి చిత్త శుద్ధి లేదు. కానీ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019లో రద్దు చేసిన నిర్ణయాన్ని జమ్ము కశ్మీర్ ప్రజలు ఇప్పటికీ అంగీకరించేలేదనేది వాస్తవం. ఒకవేళ అంగీకరించి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి. ఈ అంశంపై అసెంబ్లీ లో అందరూ చర్చించాలి. అంతేకానీ ఒక్క ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడం సరికాదు” అని సిఎం అబ్దుల్లా అన్నారు.

మరోవైపు కశ్మీర్ లోని మరో రాజకీయ పార్టీ అయిన పీపుల్స్ కాన్ఫెరెన్స్ నాయకుడు సజ్జాద్ లోన్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ కు అన్యాయం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోమ్ మంత్రి అమిత్ షాకు ఢిల్లీకి వెళ్లి.. కశ్మీరీ శాలువాలు బహూకరించడం ఏంటని ఎద్దేవా చేశారు.

సోమవారం నవంబర్ 4, 2024న ఉదయం 10.30 గంటలకు కశ్మీర్ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. లెఫ్టెనెంట్ గవర్నర్ మనో సిన్హా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగం చేశారు. కానీ సమావేశంలో తొలిగానే గొడవ జరగడంతో సభ 11.30 గంటలకే ముగిసింది.

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ గా అబ్దుల్ రహీం ఎన్నిక
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ గా అధికార పార్టీ నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు, చరారెషరీఫ్ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అబ్దుల్ రహీం రాథెర్ ఎన్నికయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ తొలి అసెంబ్లీ స్పీకర్ గా ఆయన ఘనత సాధించారు. అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే అయిన అబ్దుల్ రహీం వయసు 80 ఏళ్లు.

Related News

Priyanka Gandhi: మీకు నేనున్నా.. బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకగాంధీ

PM Modi: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి, ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!

Bengaluru Man Dies: చావు తెచ్చిన ఛాలెంజ్.. క్రాకర్ పై కూర్చొన్న యువకుడు.. క్షణాల్లో మృతి

MiG-29 Fighter Jet Crashes: ఆగ్రా సమీపంలో కూలిన జెట్ విమానం.. ఎగిసిపడ్డ అగ్ని కీలలు.. పైలట్లు సేఫ్

Stalin Thalapathy Vijay: విజయ్ కొత్త పార్టీపై సెటైర్ వేసిన సిఎం స్టాలిన్.. ఆ ఉద్దేశంతోనే రాజకీయాలు అని ఎద్దేవా

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి

Big Stories

×