EPAPER

Secret of Aghoras : నాగసాధువులు ఇప్పుడు ఎక్కడున్నారు…

Secret of Aghoras : నాగసాధువులు ఇప్పుడు ఎక్కడున్నారు…

Secret of Aghoras : శ్రీశ్రీశీ ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా.. అరబ్ లు, పార్శీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపుతుండే వారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు ఆదిశంకరాచార్యులు. ఓ వర్గాన్ని తయారు చేశారు. ఆ వర్గమే నాగ సాధువులు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే.. శాపాలు, ఆర్థనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని, దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగ సాధువులకు అప్పగించారు.


హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా జీవిస్తుంటారు. నిత్యం శివ నామస్మరణతో జీవితాన్ని గడుపుతుంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకుని ఉంటారు. నాడు హిందూ దేవాలయాల మీద జరిగే దాడిని క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగ సాధువులను వేడుకునే వారు అంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో.. నాగ సాధువుల బృందం వేల సంఖ్యలోని బలశాల అరబ్బుల సైన్యాన్ని ఎదుర్కొని పరాక్రమం చూపించారు.

నాగ సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో గడుపుతుంటారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు..నాగ సాధువులు శాకాహారులు. వీరు నేల పైనే నిద్రించాలి. రోజులో ఒక సారి మాత్రమే భుజించాలి. వీరు భిక్షాటన ద్వారా తమ అహారాన్నివారే సంపాదించుకోవాలి. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు.


వీరు దిగంబరంగా జీవించాల్సి ఉంటుంది శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే దరిస్తారు. వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి. మొదటిగా శివుని, శక్తిని వినాయకుని, విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు.నాగ సాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగ సాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్నానాలు పుణ్య జలాలకు మరింత పుణ్యాన్ని ఆపాదిస్తారని విశ్వాసం.

Tags

Related News

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Big Stories

×