Chandra Gochar: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద్ధి కారకుడైన చంద్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. నవంబర్ 07న చంద్రుడు ధనుస్సు రాశి నుండి బయటకు వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని. శని పూజించదగిన దేవతల దేవుడు మహాదేవుడు. ఈ సమయంలో శివుని ఆరాధించడం వల్ల అన్ని రకాల దుఃఖాలు దూరమవుతాయి.
చంద్రుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి?
చంద్రుడి సంచారం వల్ల మకర రాశి వారిపై శనిదేవుని ఆశీస్సులు ఉంటాయి. శనిని పూజించడం వల్ల వృత్తిలో విజయం లభిస్తుంది.శి వుని పూజించడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు.
వినాయక చతుర్థి ప్రతి నెల శుక్ల పక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. కార్తీక మాసంలో నవంబర్ 05 న వినాయక చతుర్థి. ఈ రోజున వినాయకుడిని పూజిస్తారు. అలాగే చతుర్థి వ్రతం పాటిస్తారు. గణేశుడిని పూజించడం వల్ల సంపద, బలం పెరుగుతాయి. కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి చాలా మందికి శుభప్రదం. ఈ పవిత్రమైన తేదీన చంద్రుడు రాశిని మారనున్నాడు. ముఖ్యంగా దీని వల్ల 2 రాశుల వారు విశేష ప్రయోజనాలు పొందుతారు.
కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్థిన చంద్రుడు రాశిని మారనున్నాడు. ఈ శుభ సమయంలో, చంద్రుడు ఉదయం 09.45 గంటలకు వృశ్చిక రాశి నుండి బయటికి వెళ్లి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఈ రాశిలో రెండు రోజులు ఉంటాడు. తరువాత ధనుస్సు నుండి బయటకు వెళ్లి మకర రాశిలోకి వెళతాడు.
Also Read: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్
వృశ్చికరాశి:
వృశ్చిక రాశి వారు చంద్రుని రాశి మార్పు వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఈ రాశికి అధిపతి హనుమాన్ . హనుమంతుడిని పూజించడం ద్వారా జాతకంలో కుజుడు బలపడతాడు. అంతే కాకుండా శని దోషం కూడా తొలగిపోతుంది. శని దోషం నుండి రక్షణ పొందడానికి హనుమంతుడిని పూజించాలి. ఈ రాశి వారు ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతుడిని పూజింంచాలి. ఈ మంగళవారం నాడు చంద్రుడు రాశిని మర్చుకోనున్నాడు. దీని వలన వృశ్చిక రాశి వారికి అన్ని రంగాలలో లాభాలు కలుగుతాయి. చంద్రుని అనుగ్రహంతో మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు శుభ కార్యాలలో విజయం సాధిస్తారు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. మీ సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారు చంద్రుడి రాశి వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారికి చంద్రుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన అనుగ్రహం వల్ల కుంభ రాశి వారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. దీంతో పాటు వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. చెడు విషయాలు జరగవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.కానీ పెట్టుబడి పెట్టే ముందు, ఖచ్చితంగా ఇంట్లోని పెద్దలను సంప్రదించండి. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి, సోమవారం, శుక్రవారం పచ్చి ఆవు పాలతో శివునికి అభిషేకం చేయండి. దీంతో పాటు కార్తీక పూర్ణిమ వరకు సాయంత్రం చంద్రుడిని పూజించండి .