The Kashmir Files : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే.. ప్రథమంగా వినిపించే పేరు బాహుబలి 2 (Bahubali 2). ఆ తర్వాత ఆర్ఆర్ఆర్(RRR), కేజిఎఫ్(KGF), పఠాన్(Pathaan), జవాన్(Jawan), కల్కి 2898AD (Kalki 2898AD) వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకి పైగా రాబట్టి.. రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. ఇకపోతే బాహుబలి 2, దంగల్ సినిమా రికార్డులను ఇప్పటివరకు ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. సాధారణంగా పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభం బట్టి లెక్క వేసుకుంటే మాత్రం ఈ భారీ బడ్జెట్ సినిమాలు లిస్టులో చాలా వెనుక ఉంటాయనటంలో సందేహం లేదు.
రూ.15 కోట్ల బడ్జెట్ తో రూ.341 కోట్ల లాభం..
ఉదాహరణకు చిన్న సినిమాలుగా వచ్చిన ఎన్నో సినిమాలు కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెట్టిన పెట్టబడికి 1165% లాభం తెచ్చిపెట్టి ఇండియాలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir files). వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి కేవలం రూ.15 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. మొదట్లో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఆ తర్వాత నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులోని ఎమోషనల్ సన్నివేశాలకు ఇటు సౌత్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు. అలా ప్రపంచవ్యాప్తంగా రూ.341 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది ఈ సినిమా.
రెండు జాతీయ అవార్డులు కూడా..
ఇక ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ విషయానికి వస్తే.. రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఒకటి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డుతో పాటు బెస్ట్ సపోర్టింగ్ నటి విభాగంలో పల్లవి జోషి నేషనల్ అవార్డు అందుకున్నారు. అటు ఆరు విభాగాలలో ఫిలింఫేర్ అవార్డుల్లో నామినేట్ అయిన ఈ సినిమా.. అక్కడ మాత్రం అవార్డులు అందుకోలేకపోయింది. కానీ లాభాల్లో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మొత్తానికైతే ఈ సినిమా ముందు కలెక్షన్స్ తో పాటు లాభాల విషయంలో బాహుబలి , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దంగల్ లాంటి సినిమాలు లీస్ట్ లో ఉంటాయ్ అనడంలో సందేహం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కథ..
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ 1980 – 1990 లలో కాశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యకాండని తెలిపింది. కాశ్మీర్లోని హిందువులపై పాకిస్తాన్ తో పాటు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణకాండ కు పాల్పడ్డారు. కాశ్మీర్ పండిట్లను విచక్షణారహితంగా చంపడమే కాకుండా ఆడవారిని మానభంగాలు చేసే చిన్న పిల్లల్ని కూడా చూడకుండా అత్యంత దారుణంగా చంపేశారు. ఈ మారణకాండలో కొన్ని లక్షల మంది హిందువులు చనిపోయారు. సుమారు రూ.5 లక్షల మంది కాశ్మీరీ పండితులు భయపడి వివిధ రాష్ట్రాలకి వలస వెళ్లిపోయారు. ఈ విషయాలు అన్నింటికీ కూడా ఇందులో చక్కగా చూపించారు. అయితే ఈ సినిమా పూర్తిగా అందరిని కట్టిపడేసింది. అందుకే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయని సమాచారం.