EPAPER

Newborn Baby Facebook Sale : పసిబిడ్డను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన తల్లి అరెస్ట్.. ఆ డబ్బులు దేనికోసమో తెలుసా?..

Newborn Baby Facebook Sale : పసిబిడ్డను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన తల్లి అరెస్ట్.. ఆ డబ్బులు దేనికోసమో తెలుసా?..

Newborn Baby Facebook Sale | ప్రపంచంలో నిస్వార్థ ప్రేమకు చిహ్నం తల్లిదండ్రులు. చాలా సందర్భాల్లో పిల్లలను తండ్రి పట్టించుకోకపోయినా.. తల్లి మాత్రం ఎన్నికష్టాలు ఎదురైనా సరే. బిడ్డను తన నుంచి దూరం కానివ్వదు. తాను పస్తులుండైనా సరే బిడ్డ కడుపు నింపుతుంది. తన స్వార్థం ఎప్పటికీ చూసుకోదు. కానీ మారుతున్న కాలంతో పాటు నిస్వార్థ మాతృమూర్తులు కరువైపోతున్నారు.


పరుగులు తీసే జీవనంలో డబ్బే సర్వస్వం అయిపోయింది. ఉద్యోగం, వ్యాపారం కోసం కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. తాజాగా ఒక తల్లి తనకు అప్పుడే పుట్టిన బిడ్డను ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టింది. కేవలం డబ్బు కోసమే ఆ పనిచేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

Also Read: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష!.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో నివసించే జూనిపర్ బ్రీసన్ అనే 21 ఏళ్ల యువతి సెప్టెంబర్ నెలలో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసింది. అప్పుడు ఆమె గర్భవతి. తనకు త్వరలో పుట్టబోయే బిడ్డను ఎవరైనా దత్తత తీసుకుంటారా? అని ఆ పోస్ట్ లో రాసింది. ఫేస్ బుక్ లో “బర్త్ మదర్స్ లుకింగ్ ఫర్ అడాప్టివ్ పేరెంట్స్” అనే గ్రూప్ లో ఈ పోస్ట్ చేసింది. దీంతో చాలా మంది ఆమెను బిడ్డ దత్తత తీసుకుంటామని సంప్రదించారు. కానీ బ్రీసన్ వారికి నానా షరతులు పెట్టింది. దీంతో ఒక మహిళ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జూనిపర్ బ్రీసన్ గత వారం ఒక మగబిడ్డను ప్రసవించింది. దీంతో ఆమెను ముందుగా ఒక లెస్బియన్ దంపతులు సంప్రదించారు. ఆమె ఆస్పత్రిలో ఉండగానే వచ్చి పసిబిడ్డను చూసి సంతోషంగా దత్తత తీసుకుంటామని అన్నారు. కానీ బ్రీసన్ వారికి తనకు భోజనం కోసం 25 డాలర్లు ఇవ్వాలని అడిగింది. వారు అందుకు అంగీకరించారు. ఆ తరువాత ఆలోచించుకొని చెబుతానని పంపించేసింది. రెండు రోజుల తరువాత తనకు డబ్బులు అవసరమని వెంటనే 200 డాలర్లు పంపించమని ఫోన్ చేసింది. కానీ ఈసారి ఆ లెస్బియన్ దంపతులు డబ్బులు ఇచ్చేది లేదన్నారు. బిడ్డ దత్తత ఇవ్వాలనుకుంటే చట్ట ప్రకారం.. అగ్రీమెంటు చేసుకునేందుకు వస్తామని తెలిపారు. కానీ బ్రీసన్ వారితో అసభ్యంగా మాట్లాడింది. తనకు 200 డాలర్లు ఇవ్వకుంటే ఎలా? తనకు చాలా ఖర్చులున్నాయని.. తన బిడ్డను వారికి ఇస్తున్నందుకు తనకు చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పింది. దీంతో ఆ లెస్బియన్ దంపతులు వెనుకడుగు వేశారు.

ఆ తరువాత వెండీ విలియమ్స్ అనే 40 ఏళ్ల మహిళ బ్రీసన్ ను సంప్రదించింది. నిజానికి విలియమ్స్ ఆమెను గర్భవతిగా ఉన్నప్పుడే చూసింది. ఆస్పత్రిలో తనకు పిల్లలు పుట్టడం లేదని చికిత్స కోసం వచ్చినప్పుడు గర్భవతి అయిన బ్రీసన్ ను చూసింది. బ్రీసన్ ఫేస్ బుక్ లో పెట్టిన యాడ్ చూసి పిల్లలు పుట్టని తనకు బ్రీసన్ బిడ్డను దత్తత తీసుకోవాలనే కోరిక కలిగింది.

వెండీ విలియమ్స్.. బ్రీసన్ వద్దకు వెళ్లి ఆ బిడ్డను తాను దత్తత తీసుకుంటానని అడిగింది. దీంతో బ్రీసన్ తాను బిడ్డను విక్రయించాలనుకుంటున్నానని.. 10000 డాలర్లు ఇస్తే బిడ్డను తీసుకువెళ్ల వచ్చని తెలిపింది. కానీ విలియమ్స్ వద్ద అంత డబ్బు అప్పుడు లేదు. పైగా బ్రీసన్ బిడ్డ రక్తంలో డ్రగ్స్ ఇన్‌ఫెక్షన్ ఉందని.. చికిత్స అందించాలని తెలిపింది. అందుకు విలియమ్స్ తాను అంత డబ్బు ఎందుకు ఇవ్వాలని అడిగింది? దానికి సమాధానంగా బ్రీసన్ తనకు చాలా ఖర్చులున్నాయని ఇంటి రెంటు, కారు ఈఎంఐ, పార్టీలకు వెళ్లడానికి ఖర్చు అవుతుందని చెప్పింది. ఇది విన్న విలియమ్స్ కు బ్రీసన్ పై అనుమానం కలిగింది.

నిజానికి బ్రీసన్ కు డ్రగ్స్ వ్యసనం ఉంది. అందుకే ఆమె బిడ్డను విక్రయించి డ్రగ్స్ కొనుగోలు చేయాలనుకుంది. దీంతో విలియమ్స్ ఆమె వద్ద బిడ్డ సురక్షితం కాదు అని భావించి ఆస్పత్రిలో బ్రీసన్ పై ఫిర్యాదు చేసింది. కానీ వారు చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విలియమ్స్ ఫిర్యాదు పై విచారణ చేసి డ్రగ్స్ అలవాటు ఉన్న బ్రీసన్ నుంచి పసిబిడ్డకు ప్రమాదం ఉందని భావించి బిడ్డను చైల్డ్ కేర్ కు తీసుకెళ్లారు. ఆ తరువాత విలియమ్స్, లెస్బియన్ దంపతులు వాంగ్మూలం ఆధారంగా బిడ్డను విక్రయించడానికి ప్రయత్నించినందుకు ఆమెను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం టెక్సాస్ కోర్టు బ్రీసన్ కు 30000 డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

Related News

US Election 2024: మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎలక్షన్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే?

Iran Woman Hijab Protest: ఇరాన్ లో లోదుస్తుల్లో నిరసన చేసిన మహిళ మిస్సింగ్.. చంపేశారా?

Trump WhiteHouse: ఓటమిని ట్రంప్ అంగీకరించడా?.. 2020లో వైట్ హౌస్‌ని వీడి తప్పుచేశానని వివాదాస్పద వ్యాఖ్యలు!

Nigeria Kids Death Sentence: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష?.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..

Canada Hindu Attacks: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు

Irani Women Protest : నియంత దేశంలో.. ఈ యువతి గుండె ధైర్యానికి ప్రపంచమంతా సెల్యూట్

Big Stories

×