Satyam Sundaram : రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన సత్యం సుందరం సినిమా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. కార్తీ అరవిందస్వామి కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. 96 సినిమా తర్వాత సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండేవి. అంచనాలన్నిటిని కూడా ఈ సినిమా సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది. దాదాపు 3 గంటల పాటు ఉండే ఈ సినిమా ప్రేక్షకులకు బోరు కొట్టకుండా అద్భుతంగా డీల్ చేసాడు దర్శకుడు. స్వతహాగా ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) కూడా సినిమాటోగ్రాఫర్ కావడం వలన ఈ సినిమాలో విజువల్స్ కూడా అద్భుతంగా రాబట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ సినిమాకి గోవింద వసంత్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన 96 మ్యూజిక్ కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకుంది.
Also Read : Sree Vishnu : సెన్సార్ కి కూడా దొరకకుండా అన్ని బూతులు ఎలా మేనేజ్ చేస్తావ్ అన్న.?
ఈ సినిమా తమిళ్ వెర్షన్ దాదాపు 3 గంటలకు పైగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ సీన్స్ రాయమన్నప్పుడు.. రాకేంద్ మౌళి (Rakendh Mouli) మాట్లాడుతూ సినిమా చాలా బాగా చేశారు కానీ తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి కొన్ని సీన్స్ మనం కట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారట. ఈ విషయంలో రచయితకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు సి ప్రేమ్ కుమార్. తమిళనాడులో జల్లికట్టు ఎంతగా ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పండగను ఒక సాంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూ వస్తున్నారు. దీని గురించి ఆ మధ్య కాలంలో చాలా రకాల వివాదాలు కూడా అయ్యాయి. అయితే వీటన్నిటి గురించి ఈ సినిమాలో చర్చించాడు సి ప్రేమ్ కుమార్. తెలుగు ప్రేక్షకులకి జల్లికట్టు గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఈ సీన్స్ ను తగ్గించడం చాలా మంచిది అని చెప్పి చాలా వరకు సీన్స్ కట్ చేశారు.
కేవలం జల్లికట్టు సీన్స్ ను తెలుగు డబ్బింగ్ సినిమాకి తగ్గించడం మాత్రమే కాకుండా ఒరిజినల్ తమిళ్ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ని కూడా కట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. రీసెంట్గా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఈ సినిమాలో డిలీటెడ్ సీన్స్ ని రిలీజ్ చేశారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది తమిళ్ ప్రేక్షకులు అనవసరంగా ఈ సీన్ కట్ చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా కంప్లీట్ వెర్షన్ నాలుగు ఐదు గంటలు ఉన్నా కూడా చూస్తాము అంటూ సినిమాపై ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ఈ సినిమాకి తమిళ్ కంటే కూడా మిగతా భాషల నుంచి మంచి అప్రిసేషన్ వచ్చిందని ఇదివరకే సి ప్రేమ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.