EPAPER

YS Jagan: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

YS Jagan: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

YS Jagan: గత ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో కూటమి సాధించిన విజయంతో.. వైసీపీ దాదాపు నేలమట్టం అయిన పరిస్థితి వచ్చింది. ఫయన్స్ పార్టీకి కంచు కోటలు లాంటి జిల్లాల్లో సైతం అరకొర సీట్లు మాత్రమే వైసీపీ సాధించగలిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటూ అప్పుడప్పుడు జగన్ జనంలో కనిపిస్తున్నారు. ఇక నేతలంతా వలస పోతున్న తరుణంలో కార్యకర్తలను అయినా కాపాడుకునేందుకు అలర్ట్ అవుతున్నారట మాజీ సీఎం. అందుకే మళ్లీ ఇప్పుడు నాడు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాపై జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారట. ఇంతకీ ఆ జిల్లా ఏంటి ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం.


ఏపీలో వైసీపీ కొంపముంచిన 2024 ఎన్నికలు

ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి 12 స్థానాలలో విజయం సాధిస్తే.. ఫ్యాన్ పార్టీ రెండు స్థానాలకే చతికిలపడింది. వై నాట్ 175 టార్గెట్ తో ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ.. ఊపదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నామంటూ లీడర్లు తెగ చెప్పుకొచ్చారు. కానీ ఊహించని రీతిలో ప్రజల తీర్పుతో కంచుకోటలన్నీ బద్దలు అవ్వడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారట పార్టీ అధినేత. నాయకులంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెప్తున్న తరుణంలో.. కార్యకర్తలను అయినా కాపాడుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారట.


నాయకులంతా వరుసగా పార్టీకి గుడ్ బై

వైసీపీ లీడర్లు అంతా వలసల బాట పడుతున్న తరుణంలో.. డిఫెన్స్ లో పడ్డారట జగన్. కార్యకర్తలను అయినా కాపాడుకునేందుకు ఫోకస్ పెట్టారట. అందుకోసమే రీసెంట్ గా ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జ్ లను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇంచార్జ్ లు పర్యటించి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని ఆదేశించారట. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని వర్గాల కమిటీలు నియమించాలని సూచించారట. పార్టీ క్యాడర్లో ఎలాంటి అసంతృప్తి కలగాకుండా.. కాపాడుకోవాలని చెప్పారట జగన్. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాపై మాజీ సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారట.

కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఎస్వీ

గతంలో కర్నూలు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బివై రామయ్య బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇటీవల అధిష్టానం ప్రకటించిన నూతన జిల్లా అధ్యక్షునిగా ఎస్వీ మోహన్ రెడ్డిని నియమించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్వీ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సీనియర్ పొలిటీషియన్ గా గుర్తింపు ఉండటంతో.. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉండే ఏడు నియోజకవర్గాలను ఫోకస్ చేయాలని పార్టీ అధిష్టానం సూచించడంతో ఆ పనిలో ఎస్వీ మోహన్ రెడ్డి నిమగ్నమయ్యారట.

Also Read:  ‘జగన్నా’టకం.. స్కెచ్ మామూలుగా లేదుగా?

2011లో జగన్ ఓదార్పు యాత్రకు ఎస్వీ మోహన్ మద్దతు

ఎస్వీ మోహన్ రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బా రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ పొలిటిషియన్ గా ఉంటూ మాజీ మంత్రిగా చేశారు. తన తండ్రి జాడలో నడుస్తూ మోహన్ రెడ్డి కూడా తనదైన స్టైల్ లో కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు ఎస్వీ మోహన్ రెడ్డి మద్దతుగా నిలిచారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జగన్ కు మద్దతుగా నిలిచారు. 2014 సంవత్సరంలో వైసీపీ కర్నూల్ సిటీ సీటు కేటాయించగా.. టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్ పై విజయం సాధించారు. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో.. 2016లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలలో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ.. మోహన్ రెడ్డికి సీటు కేటాయించకపోవడంతో మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు.

2019 హాఫిజ్ ఖాన్ కు విజయం కోసం కృషి చేసిన ఎస్వీ

2019 ఎన్నికల్లో కర్నూలులో మరో బలమైన నేత హాఫిజ్ ఖాన్ కు సీటు కేటాయించడంతో.. ఎస్వీ మోహన్ రెడ్డి ఆయన విజయం కశవం కృషి చేశారు. గతంలో చిన్నపాటి గ్రూప్ తగాదాల వల్ల హఫీజ్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కొంత డిస్టెన్స్ వచ్చిందట. ఎవరి క్యాడర్ వారిది అన్నది అన్నట్లుగా వ్యవహరించడంతో.. పార్టీ అధిష్ఠానం 2024 ఎన్నికల్లో నూతన అభ్యర్థి ఇంతియాజ్ కి అవకాశం ఇచ్చింది. దాంతో ఎస్వీ వర్గం, హఫీజ్ ఖాన్ వర్గం.. జగన్ ఆదేశాలతో ఇంతియాజ్ కి సపోర్ట్ చేశారని అంటుంటారు. అయితే కర్నూల్ నగరంలో రెండు రూపాయల డాక్టర్గా పేరుగాంచారు ఇస్మాయిల్. ఆయన వారసులైన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను రంగంలోకి దించినప్పటికి.. ఓటమి పాలవ్వడంతో.. ముగ్గురు నాయకులు ఏం చేయాలో తెలియక షాక్ కి గురయ్యారట.

వ్యూహాలతో పార్టీ క్యాడర్ ని జగన్ కాపాడుకోగలుగుతారా?

కర్నూలు వైసీపీలో బలమైన పార్టీ కేడర్ ఉన్నప్పటికీ.. టీజీ భరత్ గెలుపొందడంతో ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టారట. అందుకే మళ్లీ అధ్యక్షుడుగా ఎస్వీ మోహన్ రెడ్డికి పగ్గాలు ఇవ్వటంతో పార్టీ నూతన ఉత్సాహంతో పుంజుకుంటుందని భావిస్తుందట. నాయకులంతా ఏకతాటి పైకి వచ్చి పనిచేయాలని జగన్ సూచించారట. అలానే కూటమి ప్రభుత్వం హామీల అమలు, పాలనా వ్యవహారాలపై ఫోకస్ పెట్టి విమర్శలు గుప్పించేలా ఉండాలని ఆదేశాలు ఇస్తున్నారట. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామీణ స్థాయి నుంచి కమిటీలు నియమించి.. పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారట. ఈ వ్యూహాలతో అయినా జగన్ పార్టీ క్యాడర్ ని కాపాడుకోగలుగుతారా ? నేయకులు ఏకతాటి పైకి పని చేయగలుగుతారా ? గత వైఫ్యల్యాలను ఎలా అధిగమిస్తారు ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు ఫలిస్తాయో లేదో మరి చూడాలి.

Related News

Vemireddy Prabhakar Reddy: నన్నే అవమానిస్తారా.. వేమిరెడ్డి టీటీపీకి హ్యాండ్ ఇస్తాడా..?

Alleti Maheshwar Reddy: సీఎం మార్పు.. ఏలేటి మాటల వెనుక ఆ మంత్రి స్కెచ్?

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

Rushikonda Palace: జగన్‌కు బిగ్ షాక్.. రుషికొండ ప్యాలెస్ వాళ్లకే?

Big Stories

×