EPAPER

Rushikonda Palace: జగన్‌కు బిగ్ షాక్.. రుషికొండ ప్యాలెస్ వాళ్లకే?

Rushikonda Palace: జగన్‌కు బిగ్ షాక్.. రుషికొండ ప్యాలెస్ వాళ్లకే?

Rushikonda Palace: విశాఖ లోని రిషికొండపై వందల కోట్ల ప్రజల సొమ్ముతో భారీ భవనలను నిర్మించారు. ఓ వైపు ప్రజా ధనంతో.. సొంత భవనాలను నిర్మించారని కూటమి ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. కానీ మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వ భవనాలు అంటూ చెబుతూ మీరు నిర్మించలేకపోయారు అని కవర్ చేస్తున్నారు. ఇరు వర్గాల వైఖరి ఎలా ఉన్నా కానీ.. 500 కోట్లతో నిర్మించిన భారీ భవనాలు ఇప్పుడు నిరుపయోగంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


రుషికొండ నిర్మాణాల్లో గుండె చెదిరే నిజాలు

రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమా అనిపించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి నేరాలు చేయాలంటే.. చాలా తెగించి ఉండాలి. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణంగా చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ప్యాలెస్ చూస్తే మొదట ఆశ్చర్యం, తర్వాత ఉద్వేగం కలుగుతుందన్నారు.


మరోసారి హాట్ టాపిక్ గా విశాఖ రిషికొండపై నిర్మించిన భవనాలు

సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్‌తో.. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ రిషికొండపై.. 500 కోట్ల రూపాయలతో.. నిర్మించిన భవనాలు.. మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సొమ్ము ప్రజలది.. సోకు వైసీపీది.. కానీ.. భారం మాత్రం కూటమి సర్కార్‌ది అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో ప్రతిపక్షాల్ని, ప్రజల్ని, ఎవ్వరినీ కొండ దరిదాపుల్లోకి కూడా రానీయకుండా… వైసీపీ నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి ఏడు భవన సముదాయాలను పూర్తి చేయించారు. పచ్చదనంతో కళకళలాడే రుషికొండను బోడి కొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. అనుమతులు లేకపోయినా.. జగన్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిర్మాణాలను పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాజకోట రహస్యం బయట పడింది.

ప్యాలెస్‌ల కంటే ముందు రిషికొండపై హరిత రిసార్ట్స్

ఈ ప్యాలెస్‌ల కంటే ముందు.. ఈ రిషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేది. ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతున్న రిసార్ట్స్‌ని కూల్చేసి.. కొండను తొలిచి.. 22 ఎకరాలను చదును చేసి.. ఈ భారీ నిర్మాణాలను చేపట్టారు. ఈ ప్యాలెస్ కోసం టూరిజం శాఖకు చెందిన కాటేజీలను కూల్చడమే కాదు.. దీనికి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వాదనలు ఉన్నాయి. నాలుగున్నర ఎకరాల్లో భారీ భవనాలు నిర్మించారు. ఐదు ఎకరాల్లో వందలాది మొక్కలతో.. ల్యాండ్ స్కేపింగ్, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. ఈ నిర్మాణాలు జరుగుతున్న సమయంలో.. సెవెన్ స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, కాటేజీలు నిర్మిస్తున్నామని మభ్య పెట్టారు. కానీ.. ఐదు బ్లాకుల్లో బెడ్ రూంలు, డైనింగ్, లివింగ్ రూమ్స్, మీటింగ్ హాల్స్ నిర్మించారు. రాజభవనంలా.. విశాలంగా, విలాసవంతంగా ఈ ప్యాలెస్‌లను తీర్చిదిద్దారు. మాయాబజార్‌ సినిమాలోని మయసభను తలపిచేలా పెద్దపెద్ద గదులు, హాల్స్‌, ఫన్నీచర్‌తో నింపేశారు.

Also Read:  ‘జగన్నా’టకం.. స్కెచ్ మామూలుగా లేదుగా?

మెయింటెనెన్స్ కోసం ప్రతి నెలా లక్షల రూపాయల ఖర్చు

ఎన్నికల ఫలితాల తర్వాత.. ఈ ప్యాలెస్‌ లోపల ఇంటీరియర్‌ని ఎలా తీర్చిదిద్దారు? ఎలాంటి ఫర్నిచర్ ఏర్పాటు చేశారనేది.. ఏపీ ప్రజలంతా చూశారు. అయితే.. ఈ ప్యాలెస్ కట్టి ఏడాది పూర్తవుతున్నా.. దీనిని ఏం చేయాలి? ఎలా వాడుకోవాలి? అనే విషయంలో టూరిజం కార్పొరేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా.. ప్రతి నెలా లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఖర్చవుతుండటం.. అదనపు భారంగా మారింది. ఇప్పటివరకు ఒక్క విద్యుత్ శాఖకే.. 85 లక్షల కరెంటు బిల్లులు చెల్లించారట. దీనికితోడు.. గార్డెన్ మెయింటెనెన్స్, ఈ ప్యాలెస్‌కు సెక్యూరిటీ, రోజూ పనిచేసే సిబ్బందికి జీతాలు.. ఇలా నెలకు లక్షల్లో చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు..

ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రుషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు. ప్రజా కోర్టులో రుషికొండలో జరిగిన నేరంపై చర్చ జరగాలన్నారు. ఇక్కడ విలాసవంతమైన భవనాలు చూసి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. పర్యాటక శాఖకు కూడా రుషికొండ కాస్ట్లీ ఎఫైర్ అయ్యిందన్నారు. రుషికొండ కోసం ప్రజాస్వామ్యం భారీ మూల్యం చెల్లించిందన్నారు. రుషికొండ చర్చ అవసరం లేదు శిక్ష మిగిలిందన్నారు.

టీడీపీ ఎందుకు కట్టలేకపోయిందో ఆలోచించాలి – అంబటి

ఈ వ్యవహారంలోనే సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసిన వైసీపీ నేతలు తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్‌ మార్చేశారు. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు ఈ భవనాల వ్యవహారంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు ప్రజలను సైతం అయోమయనికి గురి చేస్తున్నాయి. రుషికొండలో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనాలు చూసి చంద్రబాబు ఆశ్చర్య పోతున్నారని ఆయన సెటైర్లు వేశారు. ఇలాంటి భవనాలు అమరావతిలో తామెందుకు కట్టలేకపోయామో అని చంద్రబాబు ఆలోచించాలని అన్నారు అంబటి.

రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే -వైసీపీ

రిషికొండ ప్యాలెస్‌కు సంబంధించి కూటమి నేతలు.. ప్రజాధనాన్ని వృధా చేశారని.. ఆ భావనలను సొంత అవసరాల కోసం మాజీ సీఎం నిర్మించారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారని చెబుతున్నారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టమంటున్నారు. ఇరు వర్గాల వైఖరి ఎలా ఉన్నప్పటికీ భారీ మొత్తంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉండడం పట్ల ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు.

భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిస్తారా?

ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చర్చ జరుగుతోంది. భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిస్తారా? ఏపీ టూరిజం శాఖకు అప్పజెబుతారా ? ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటారా ? అని చర్చ జరుగుతోంది.

 

Related News

Vemireddy Prabhakar Reddy: నన్నే అవమానిస్తారా.. వేమిరెడ్డి టీటీపీకి హ్యాండ్ ఇస్తాడా..?

Alleti Maheshwar Reddy: సీఎం మార్పు.. ఏలేటి మాటల వెనుక ఆ మంత్రి స్కెచ్?

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

YS Jagan: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

Big Stories

×