Pumpkin Seeds: గుమ్మడి కాయలు తిన్న తరువాత గింజలను పాడేస్తూ ఉంటారు. కానీ గుమ్మడి గింజల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించడం ద్వారా మీరు అనేక చర్మ సంబంధిత సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.
గుమ్మడిగింజలు మీ అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడతాయని మీకు తెలుసా. అవును.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం, ఫ్యాటీ యాసిడ్‌లు మీ చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలను ముఖానికి ఉపయోగించడం ద్వారా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. గుమ్మడి గింజలు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మాయిశ్చరైజర్‌గా..
గుమ్మడికాయ గింజలు పుష్కలంగా కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు గుమ్మడి గింజల నూనెను ముఖంపై మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇదే కాకుండా, రెండు చెంచాల గుమ్మడికాయ గుజ్జులో ఒక చెంచా పెరుగు, తేనె మిక్స్ చేసి మీ ముఖంపై రాసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. అంతే కాకుండా మృదువుగా మారుతుంది.
ముడతలు రాకుండా చేస్తాయి:
గుమ్మడి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్ ఇ, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. అందుకే తరుచుగా మీ ఆహారంలో భాగంగా గుమ్మడి గింజలను చేర్చుకోవడం లేదా వాటి నూనెను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
జుట్టును నల్లగా, పొడవుగా చేస్తుంది:
ఈ గింజల్లో జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, ఒత్తుగా మార్చడంలో సహాయపడతాయి . గుమ్మడి గింజల పొడిని తయారు చేసుకుని జుట్టుకు వాడే నూనెలో కూడా కలపుకోవచ్చు. లేదా మీ జుట్టుకు మసాజ్ చేయడానికి నేరుగా గుమ్మడి గింజల నూనెను ఉపయోగించవచ్చు.
గోళ్లను బలోపేతం చేస్తాయి:
గుమ్మడి గింజల్లో ఉండే ప్రొటీన్, విటమిన్ ఇ గోళ్ల బలాన్ని పెంచుతాయి. స్నాక్స్‌గా లేదా సలాడ్ తో కూడా కలిపి వీటిని తినవచ్చు. ఇది మీ గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Also Read:వంటిట్లో వాడే గిన్నెలు నల్లగా మారాయా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్
చర్మం మెరిసేలా చేయడానికి:
గుమ్మడి గింజలను పేస్ట్ చేసి , ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ముఖానికి దీనిని ఉపయోగించడం వల్ల ముఖం ప్రకాశవంతం మారుతుంది. అంతే కాకుండా ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్ర పరిచి మెరిసేలా చేస్తుంది.
చర్మ సమస్యలను తొలగిస్తాయి:
గుమ్మడి గింజలలో ఉండే జింక్, ఫ్యాటీ యాసిడ్స్ మొటిమలు , వాపు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి . వాటిని గ్రైండ్ చేసి ముఖానికి అప్లై చేయడం లేదా వాటి నూనెను ఉపయోగించడం ద్వారా అద్భుత లాభాలు ఉంటాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.