EPAPER

Jagan Master Plan: ‘జగన్నా’టకం.. స్కెచ్ మామూలుగా లేదుగా?

Jagan Master Plan: ‘జగన్నా’టకం..  స్కెచ్ మామూలుగా లేదుగా?

Jagan Master Plan: ఏపీలో వచ్చే నెల నుంచి అమరావతి, పోలవరం ఇలా రకరకాల ప్రాజెక్టుల పనులు మొదలు కానున్నాయి. ఇవి పూర్తి అయితే తమ పనైపోయినట్టేనని మాజీ సీఎం జగన్ భావిస్తున్నరా? అందుకే తన బుర్రకు పదును పెట్టారా? తన అస్త్రాలను ఒకొక్కటిగా బయటపెడుతున్నారా? నేతలతో కొత్త ప్రచారం మొదలుపెట్టేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఆర్థికంగా చితికిపోయిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్రం తన వంతు సహాయ సహకారాలు చేస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా  గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక రేపో మాపో పనులు మొదలు కానున్నాయి.

మరోవైపు కూటమి సర్కార్ పెట్టుబడుల వేట సాగుతోంది. అమరావతిలో ఉంటూ సీఎం చంద్రబాబు పెట్టుబడుదారులను రప్పించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. యువనేత, మంత్రి లోకేష్ అయితే పెట్టుబడుల కోసం వారం రోజులపాటు అమెరికా వెళ్లారు. అక్కడి టాప్-100 కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు.


ఏపీకి అన్నివిధాలుగా తమ వంతు సహాయక సహకారాలు అందించాలని వివిధ కంపెనీల సీఈఓలను కోరారు. రెడీ చేస్తున్న పారిశ్రామిక పాలసీ గురించి వివరించారు. వారి నుంచి కూడా సలహాలు తీసుకున్నారు.

ALSO READ: 2027లో మళ్లీ ఎన్నికలు.. అలా ఎలా?

లేటెస్ట్‌గా వైసీపీ కొత్త ప్రచారం మొదలుపెట్టేసింది. 2027 చివరలో ఏపీకి ఎన్నికలు రాబోతున్నాయంటూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఆదివారం తిరుపతిలో చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమం జరిగింది. దీనికి వైసీపీ కీలక నేతలు హాజరయ్యారు.

త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ పదేపదే నేతలు చెప్పుకొచ్చారు. మనమే మళ్లీ అధికారంలోకి వచ్చేస్తుందని ఊదరగొట్టారు. ఈ తరహా మీటింగులు జిల్లాకు ఒకటి చొప్పున పెట్టి ప్రచారం చేస్తే.. రావాల్సిన పెట్టుబడుదారులు ఏపీ వైపు కన్నేత్తి చూడరు. రావాల్సి వాళ్లంతా వెనక్కి వెళ్లిపోతారు. దీనివల్ల ఏపీలో అభివృద్ధి కుంటుపడుతుంది.

కొన్ని కంపెనీల దృష్టి ఇప్పుడిప్పుడే ఏపీపై పడింది. రియల్‌ఎస్టేట్ కొంచెం ఊపందు కుంటోంది. వైసీపీ నేతల ప్రచారంతో రియల్ మార్కెట్ కాస్త చతికిల పడిపోవచ్చు. కొత్తవారు ఎవరైనా రావాల్సిన వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉంది.

వైసీపీ కాలంలో రివేంజ్ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రజలు నానాఇబ్బందులు పడ్డారు. పెట్టుబడుదారులు వెళ్లిపోవడం, ప్రజా వేదిక కూల్చివేయడం, అమరావతి నిర్మాణం ఆగిపోవడం జరిగాయి. ఆయా పరిస్థితులను గమనించిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి కేవలం ఐదునెలలు మాత్రమే అయ్యింది.

ఈలోగానే ఏపీకి ఎన్నికలకు వచ్చేస్తున్నాయంటూ వైసీపీ ప్రచారం చేపట్టింది. ఇలాంటి ప్రచారం వల్ల రాష్ట్ర ప్రజలు అధైర్యం పడిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్రమోదీ మధ్య చిన్న చర్చ జరిగింది. 15 ఏళ్లపాటు కూటమి ఇలాగే ఉండాలని, దీనివల్ల తాము రాష్ట్రానికి ఏమైనా చేయగలమని ప్రధాని క్లియర్‌గా  చెప్పారట. దీనికి సంబంధించి ప్లాన్ కూడా రెడీ అవుతోంది.

వైసీపీ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటే ఇబ్బందులు తప్పదన్నది విశ్లేషకుల మాట. 2014-19 మధ్య వైసీపీ ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. మరుసటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా అలర్ట్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Nara Lokesh Red Book: రెడ్ బుక్‌లో ఆ పేజీ ఓపెన్ కు సమయం ఆసన్నమైందా.. నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రులేనా?

DGP Warns Netizens: డిప్యూటీ సీఎం కామెంట్స్.. రంగంలోకి డీజీపీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

Lady Aghori: విశాఖలో లేడీ అఘోరీ.. పవన్ కల్యాణ్‌కు నా ఆశీస్సులు

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Anilkumar, Jogi ramesh: కేసుల ఒత్తిడి.. ఇబ్బందుల్లో మాజీమంత్రులు, జనసేనతో మంతనాలు?

Ganesh Selfie Video: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. పెరిగిన హుండీ కానుకల ఆదాయం.. కారణం ఏంటంటే?

Big Stories

×