హాట్ టాపిక్ గా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం
ఏపీలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఎన్నికల్లో కూటమి సృష్టించిన ప్రభంజనంలో.. ఉమ్మడి జిల్లాలోని పదికి పది స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ప్రతి నియోజకవర్గంలోనూ భారీ మెజార్టీతో గెలుపొంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ వైసీపీకి హవా ఉంటుందట. కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని వైసీపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, సర్పంచులు.. పలు హోదాల్లో పార్టీలో పనిచేస్తున్న నాయకులు అంతా వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఫ్యాన్ పార్టీని కలవర పెడుతుందట.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ వెంటే నడుస్తామంటున్న నేతలు
గతంలో తమకు ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తామంటూ.. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి బై బై చెప్పేస్తున్నారట. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి.. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఒక్కొక్కరిగా క్యూ కడుతున్నారట. వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తూ టీడీపీలో చేర్చుకుంటున్నారట ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. మొత్తానికి రూరల్ నియోజకవర్గంలో వైసీపీని పూర్తిగా ఖాళీ చేయాలనేదే కోటంరెడ్డి సోదరుల స్కెచ్ అని పొలిటికల్ వర్గాల్లో టాక్.నడుస్తోందట.
రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల పోటీ
అయితే వైసీపీ నుంచి కీలక నేతలంతా టీడీపీ లోకి రావడానికి ప్రధాన కారణం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీతో విభేదించి ఎన్నికలకు సరిగ్గా 16 నెలల ముందు పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. ఆ సమయంలో తనతో పాటు నడిచిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు శ్రీధర్ రెడ్డి. గతంలో తాను ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న నేతలు కొంతమందిని వైసీపీ అక్కడే నిర్బంధించింది. వైసీపీ గెలుపు కోసం ఆ నేతలంతా ఆ సమయంలో పనిచేశారు. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆదాల.. వైసీపీ నేతలు, కార్పొరేటర్లకు హుకుం జారీ చేశారు. శ్రీధర్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని వ్యూహాలు రచిస్తూనే.. టీడీపీ నేతలను సైతం పలు రకాలుగా ఒత్తిళ్లకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. కానీ భారీ మెజార్టీతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గెలుపొందడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
వైసీపీ నేతలకు ఫోన్లు చేసిన పట్టించుకోలేదని వాదనలు
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించడంతోనే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో.. అసలు ఆట మొదలైందట. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆదాల హైదరాబాద్ చెక్కేశారని.. ముఖ్య నేతలు ఫోన్లు ఎత్తడమే మానేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. మీ బలవంతంతోనే వైసీపీలో ఉన్నామంటూ.. పలువురు నేతలు ఆదాలకు, కొంతమంది వైసీపీ నేతలకు ఫోన్లు చేసిన పట్టించుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయట. దాంతో వారి సమస్యలను నాధుడే కరువయ్యారని వాపోతున్నారట. కూటమి సర్కారు అధికారం లోకి వచ్చి దాదాపు నాలుగు నెలలు గడిచినా.. వైసీపీ నేతలను, కార్యకర్తలను పట్టించుకునే వారే లేరని పార్టీ వీడేందుకు సిద్దం అవుతున్నారట. అంతే కాకుండా గత ఎన్నికల సమయంలో ఆదాలతో విభేదించిన.. జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డిలు కూడా సైలెంట్ అయిపోవడం ఫ్యాన్స్ కార్యకర్తలను మరింత కలవరపెడుతుందట.
Also Read: జగన్‌లో బెజవాడ వణుకు.. ఎందుకంటే..
నెల్లూరు రూరల్ ఇంచార్జ్ గా ఆనం విజయ కుమార్
ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ గా.. ఆనం విజయ కుమార్ రెడ్డిని.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కార్పొరేషన్ డివిజన్ల సమన్వయకర్తగా పదవి ఇచ్చింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు విజయ్ కుమార్ రెడ్డి. ఈ మీటింగ్ కి నియోజకవర్గ పరిధిలోని 26 మంది కార్పొరేటర్లకు గాను ఒకే ఒక్క కార్పొరేటర్ అటెండ్ కావడంతో నేతలంతా షాక్ అయ్యారట. మిగతా కార్పొరేటర్లు అంతా టీడీపీలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. దాంతో విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన కార్పొరేటర్ల పై, ఎమ్మెల్యే కోటంరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చకు దారి తీసిందట.
తమను పట్టించుకోలేదని కార్పొరేటర్ల విమర్శలు
దీంతో పక్క రోజే కార్పొరేటర్లంతా మీడియా సమావేశం పెట్టి మరీ ఆనంపై విరుచుకుపడ్డారట. కనీసం మూడు నెలల కాలం తమను పట్టించుకున్న నాధుడే కరువయ్యారని.. ఇప్పుడు తమ గురించి మాట్లాడే అర్హత ఆనంకు లేదని.. టీడీపీ గూటికి చేరేందుకు మా అందరికంటే ముందు ఆనమే లైన్లో ఉన్నారని.. కార్పొరేటర్లు గట్టిగానే కౌంటర్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇక మరోవైపు రూరల్ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలనే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. రూరల్ నియోజకవర్గంలో మొత్తం 26 కార్పొరేషన్ డివిజన్లు, 18 గ్రామాలు ఉంటాయి. దాంతో అక్కడ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించాలని వైసీపీ ప్రయత్నిస్తోందట. కానీ ఆ బాధ్యతలను స్వీకరించేందుకు నాయకులు ముందుకు రావడం లేదట.
కూటమి నేతలకు ఫుల్ స్టాప్ పెట్టేలా అనిల్ ప్రణాళికలు
గతంలో ఆదాల నమ్ముకుని అడుగులు వేస్తే.. తీరా ముంచేసారని.. ఇప్పుడు తాము గ్రామాల్లో ఎదురు నిలిచే పరిస్థితి లేదని చెబుతున్నారట. కార్పొరేషన్ డివిజన్ల సమన్వయకర్తగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్.. తనకు రూరల్ లో బలమైన పట్టు ఉందని.. బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కువగా రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నారని.. ఎవరు అధైర్యపడవద్దు అంటూ నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అంత బలమైన నాయకత్వమే ఉంటే అనిల్ సొంత ప్రాంతమైన కొత్తూరులో వైసీపీ కీలక నేతలు శ్రీధర్ రెడ్డి వెంట ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నలు లేవనెత్తుతున్నారట. మొత్తంగా కోటంరెడ్డి బ్రదర్స్ తో పాటు, రూప్ కుమార్ యాదవ్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.
వైసీపీని ఖాళీ చేయాలనే కోటంరెడ్డి స్కెచ్ ఫలిస్తుందా ?
ఈ అనూహ్య పరిస్థితుల్లో వైసీపీని గట్టెక్కించడానికి అనిల్ కుమార్ యాదవ్ ప్రణాళికలు పనికొస్తాయా ? కొత్త నేతలని ముందుకు తీసుకురావడంలో వైసీపీ సక్సెస్ అవుతుందా ? లేదా వైసీపీని ఖాళీ చేయాలనే కోటంరెడ్డి బ్రదర్స్ స్కెచ్ అని ఫలిస్తుందా ? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.