AP Elections: వైసీపీ నేతలు కొత్త జోస్యం చెప్పారు.. అదేంటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు, వైసీపీ నేతలు. ఇది అసలు సాధ్యమేనా? ఒకవేళ నిజమైతే అదేలా? అనేది అర్థం కావడం లేదు. ఇంతకీ వైసీపీ నేతలు ఏం మాట్లాడరనేదే కదా మీ డౌట్.. అయితే చూసేయండి.
విషయం ఏంటో పూర్తిగా అర్థం కాలేదా? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? అయితే ఈ నేత మాట్లాడిన మాటలు చూడండి. 2027లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ మాటను ఘంటా పథంగా చెబుతున్నారు వైసీపీ నేతలు. వారు కూడా ఆషామాషీ గల్లీ లీడర్లు కాదు. వైసీపీలో అధినేత తర్వాత అధినేతల లాంటి వారు. సరే వారి విషయానికి తర్వాత వద్ధాం. అసలు 2027లో ఎన్నికలు ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. ఏ ఆశలతో వైసీపీ నేతలు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు?
టీడీపీ 135.. జనసేన 21.. బీజేపీ 8.. ఇవి మొన్నటి ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన సీట్లు. ఈ మూడు పార్టీలు కలిసి.. ప్రభుత్వ బలం 164. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 88 సీట్ల కంటే ఏకంగా 76 సీట్లు ఎక్కువ. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు కూలుతుంది?
సరే.. మరో సినారియో చూద్దాం.. కూటమిలోని పార్టీలు విడిపోయాయనుకుందాం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేరు పడి.. 21 మందితో ఆయన బయటికి వెళ్లిపోయారనే అనుకుందాం. అయినా కూడా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు. ఆయనతో పాటు మరో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లినా.. మొత్తం 29 మంది ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్నా.. టీడీపీ సొంతంగా ప్రభుత్వాన్ని రన్ చేసే సత్తా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు, ఎలా కూలుతుంది?
Also Read: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. నైరాశ్యంలో జగన్ టీమ్, పీకే టీమ్ లేకుంటే పనికాదా?
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు, పవన్ జోడు గుర్రాల్లా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒకరినొకరు పొగుడుకుంటూ, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ ఆల్ ఈజ్ వెల్ అనే రీతిలో పాలన సాగిస్తున్నారు. రీసెంట్‌గా గుంతలు పూడ్చే విషయంలో కూడా ఈ ఆలోచన పవన్‌దే అంటూ పూర్తి స్థాయిలో క్రెడిట్ జనసేనానికే ఇచ్చారు చంద్రబాబు. అటు పవన్ కూడా పాలనలో చంద్రబాబు అనుభవాన్ని పదే పదే పొగుడుతూ ముందుకెళ్తున్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి అపార్థాలకు ప్లేస్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎలా, ఎందుకు కూలుతుంది?
టీడీపీ ప్రభుత్వం కూలడానికి మరో అవకాశం ఉంది. అదేంటంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేసి వైసీపీ వైపు రావాలి. కానీ ఆ పరిస్థితి ఉందా? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఓ సమర్థుడైన నాయకుడన్న నమ్మకం ఉంది. దీనికి తోడు టీడీపీ నేతలు పార్టీ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గడచిన ఐదేళ్లు. అప్పుడే పార్టీని అంటి పెట్టుకొని ఉన్న నేతలు.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దూరమవుతారంటే అది అవివేకమైన ఆలోచనే. అంతేకాదు.. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీని నమ్ముకుంటారంటే అది ఆశ్చర్యమనే చెప్పాలి. మరి కూటమి ప్రభుత్వం ఎలా, ఎందుకు కూలుతుంది?
ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించిన నేతలు ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి.. మరొకరు విజయసాయి రెడ్డి. వీరిద్దరు వైసీపీలో జగన్ తర్వాత జగన్ అంత పెద్దవారు. ఒకరకంగా గతంలో ప్రభుత్వాన్ని నడిపించిన వారు. మరి అలాంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలు ఎలా చేశారు? తెలియక చేశారా? రోజురోజుకు పార్టీ నేతలు, కార్యకర్తల్లో పెరుగుతున్న నైరాశ్యాన్ని కంట్రోల్ చేయడానికి కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టు.. తమ పార్టీ పెద్దలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థంకాక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారట ఆ పార్టీ నేతలు,