EPAPER

Breaking News: విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికకక్కడే మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే?

Breaking News: విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికకక్కడే మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే?

Breaking News: తమ గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆ యువకులు. కానీ ప్లెక్సీలు కడుతుండగా, దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ప్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకై, ప్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29) పలువురు యువకులు నిమగ్నమయ్యారు.


అయితే ఈ నలుగురు ప్లెక్సీని కట్టే క్రమంలో ప్రక్కనే గల విద్యుత్ తీగలు తగిలి నలుగురు యువకులు షాక్ కు గురయ్యారు. స్థానికులు వీరిని రక్షించేలోగానే వీరు అక్కడే కన్నుమూశారు. అలాగే ఒకరికి తీవ్ర గాయాలు కాగా, తణుకు ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్లెక్సీలు కడుతూ నలుగురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివాదం నుండి విషాదం వరకు..


తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షలు కూడా తలెత్తాయి. చివరికి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో సమస్య పరిష్కారమైంది. ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణ, అన్న సమారాధన కు ఏర్పాట్లు చేస్తుండగా, దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగింది.

4 రోజుల క్రితం ఇక్కడే ఇద్దరు మృతి..

ఇదే ఉండ్రాజవరం మండలంలో నాలుగు రోజుల క్రితం క్రాకర్స్ తయారీ కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు సజీవ దహనమైన విషయం తెలిసిందే. అలాగే ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, వారు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇదే మండలంలో ఇద్దరు, నేడు ప్లెక్సీలు కడుతూ నలుగురు మృతి చెందారు.

విద్యుత్ షాక్ తో తమ పిల్లలు మృత్యువు బారిన పడగా, ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇలాంటి విషాదకర ఘటన జరగడంతో తాడిపర్రు గ్రామంలో ఎటు చూసినా రోదనలే వినిపిస్తున్నాయి.

Related News

Paritala Case : పరిటాల రవీంద్ర హత్య కేసులో భానుకు బెయిల్.. 12 ఏళ్లకు స్వల్ప ఊరట

Manda Krishna on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై మందకృష్ణ మాదిగ కోపానికి కారణం అదేనా?

Lady Aghori: అఘోరీకి ప్రమాదం పొంచి ఉందా? అందుకే ఆ లాయర్ రక్షణ కోరారా?

YCP Leaders: వైసీపీ అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఛీ మరీ ఇంత దిగజారాలా?

Janasena Leader Kiran Royal: అంబటికి గంట, అరగంట అలవాటే.. రోజవ్వకు జబర్దస్త్ గాలి పోలేదా.. జనసేన సెటైర్స్

Nara Lokesh Red Book: రెడ్ బుక్‌లో ఆ పేజీ ఓపెన్ చేసే సమయం అసన్నమైందా? నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రులేనా?

DGP Warns Netizens: డిప్యూటీ సీఎం కామెంట్స్.. రంగంలోకి డీజీపీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×