EPAPER

Vande Bharat – Rajdhani: ఈ రైలు వచ్చిందంటే.. వందే భారత్, రాజధాని ఎక్స్‌ ప్రెస్ కూడా పక్కకి తప్పుకోవల్సిందే!

Vande Bharat – Rajdhani: ఈ రైలు వచ్చిందంటే.. వందే భారత్, రాజధాని ఎక్స్‌ ప్రెస్ కూడా పక్కకి తప్పుకోవల్సిందే!

Self Propelled Accident Relief Medical Trains: ఇండియన్ రైల్వేస్ లో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు లేదంటే రాజధాని ఎక్స్‌ ప్రెస్ రైళ్లు అత్యంత విఐపి రైళ్లుగా భావిస్తాం. అత్యంత వేగవంతమైన ప్రయాణంతో ఈ రైళ్లు తమకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కానీ, ఈ రైళ్లు కూడా ఆగి మార్గం ఇవ్వాల్సిన రైలు ఒకటి ఉంది. దాని గురించి చాలా మంది రైల్వే ప్రయాణీకులకు పెద్దగా తెలియదు. రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాద ప్రోటోకాల్స్ మాదిరిగానే వెంటనే రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దేశంలో రైలు ప్రమాదం ఎక్కడ జరిగినా, రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ ను ఇండియన్ రైల్వేస్ తీసుకుంటుంది. ఈ ఆపరేషన్ కోసం ఓ రైలును ఉపయోగిస్తారు. ఇండియన్ రైల్వేస్ లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిన ఈ రైలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


రైలు ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి స్పెషల్ ట్రైన్

ఇండియన రైల్వేస్ ప్రమాదాలను నిర్వహించడానికి ఒక ప్రత్యేక రిలీఫ్ వ్యవస్థను కలిగి ఉంది. దేశంలో ఈ మూలన రైలు ప్రమాదం జరిగినా, రైల్వే అధికారులు యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లతో పాటు యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ రైళ్లను నడుపుతాయి. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే రెస్క్యూ సిబ్బందితో పాటు మెడికల్ ఎక్యుప్ మెంట్స్ తో  IR సిస్టమ్‌పై గంటకు 160 కి. మీ  వేగంతో ప్రయాణించే సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్లను (SPART) పంపిస్తారు. అన్ని యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్లకు స్పెషల్ బీట్లు, షెడ్యూల్ ను కలిగి ఉంటాయి.


యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ల గురించి..

విపత్తుల సమయంలో భారతీయ రైల్వే తన లోకోమోటివ్ హాల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్లను (ARMVs) సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్లతో (SPARMVs) భర్తీ చేస్తారు. గంటలకు 160 కిలో మీటర్ల వేగంతో హై స్పీడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్లను(HS-SPARTs) కూడా రంగంలోకి దింపుతారు. విపత్తు సమయంలో రెస్పాన్స్  సమయాన్ని వేగవంతం చేయడానికి గోల్డెన్ అవర్ ను కీలకంగా భావిస్తారు. అంటే, ప్రమాదం జరిగిన గంటలో రెస్క్యూ టీమ్స్ స్పాట్ కు చేరుకునేలా ప్రయత్నం చేస్తారు. ఈ స్పెషల్ ట్రైన్ ద్వారా ప్రమాదం జరిగిన స్పాట్ కు రెస్క్యూ సిబ్బందితో పాటు ప్రయాణీకులకు అవసరం అయిన మెడికల్ సామాగ్రి, వైద్యుల బృందం ఈ రైళ్లు వెళ్తుంది.

సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్లను రంగంలోకి దిగితే..

కేవలం ప్రమాద సమయంలోనే సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్లను తమ విధులను నిర్వహిస్తాయి. ఈ రైళ్లు పట్టాల మీదకు వచ్చాయంటే, మిగతా రైళ్లు అన్ని పక్కకు తప్పుకుని వీటికి దారి ఇవ్వాల్సి ఉంటుంది. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైళ్లుగా చెప్పుకునే వందే భారత్, రాజధాని రైళ్లు కూడా సైడ్ జరగాల్సిందే. ప్రమాద సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ రైళ్లకు ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఉంటుంది.

Read Also: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ.. వేగంగా దూసుకొచ్చిన రైలు, రెప్పపాటులో ఎగిరిపడ్డ యువకుడు

Related News

IRCTC Super App: అన్ని రైల్వే సేవలు ఒకే చోట, ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ వచ్చేస్తోంది!

Bihar Man on Indian Railway: RAC టికెట్ వెయిటింగ్ 12 నుంచి 18కి జంప్, ప్రయాణీకుడు ఏం చేశాడంటే?

Indian Railway: ఇండియన్ రైల్వేస్ లో రెడ్, బ్లూ కోచ్‌లు, వీటిలో ఏ బోగీలు స్ట్రాంగ్? తేడా ఏమిటీ?

Hyderabad – Visakhapatnam: నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు.. ఈ రైలు ప్రత్యేకత ఇదే, ఎప్పటి నుంచంటే?

Indian Railways: మన దేశంలో అన్ని రైళ్లు ఉన్నాయా? భోలు ఏనుగు లోగో ప్రత్యేకత ఏమిటీ?

Big Stories

×