Chicken Curry Murder| తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు. కానీ ఈ కాలంలో యువత అంతా ప్రతి చిన్న విషయానికి కోపం చూపించడమే హీరోయిజం అని ఫీలవుతుంది. ఈ క్రమంలో ఈగోలతో గొడవలు జరిగి హింసాత్మకంగా మారుతాయి. ఆ క్షాణికావేశంలో ఎన్నో జీవితాలు నాశనమైపోతాయి. తాజాగా అలాంటిదే ఒక ఘటనలో ఒక హోటల్ వెయిటర్ ని కొందరు కస్టమర్లు హత్య చేశారు. ఈ ఘటన పంజాబ్, హర్యాణా రాజధాని చండీగఢ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చండీగఢ్ నగరంలోని సెక్టార్ 24 పరసరాల్లో ఓ ఢాబా ఉంది. అందులో పనిచేస్తన్న వెయిట్లలో ఇద్దరి పేరు ఆకాశ్ (28), జెస్సీ – జస్ప్రీత్ సింగ్ (37). వీరిద్దరూ రాత్రివేళ ఢాబా మూసే వరకు ఉంటారు. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు క్లోజ్ చేసి జెస్సీ సమీపంలోని తన ఇంటికి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఢాబా మూసివేస్తున్న సమయంలో అక్కడికి ఒక కారులో నలుగురు కస్టమర్లు వచ్చారు. అందరూ 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వాళ్లు.
Also Read: దీపావళి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త.. అతని ప్రైవేట్ పార్ట్ కోసేసిన భార్య!
ఢాబాలోకి రాగానే ఆ నలుగురు యువకులు ఢాబాలో చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చారు. కానీ వెయిటర్ గా పనిచేస్తున్న జెస్సీ వారికి ఢాబా క్లోజింగ్ టైమ్ అని చెప్పాడు. అయినా ఆ నలుగురు 11 గంటలే కదా.. కాసేపు తిని, తాగి వెళ్లిపోతామని.. ఆర్డర్ తీసుకొని రావాలని అడిగారు. ఢాబాలో బీర్ కూడా తీసుకురావాలిన చెప్పారు. కానీ జెస్సీ బీర్ లేదని అన్నాడు. కిచెన్ లోకి జెస్సీ వెళ్లి చూస్తే.. చికెన్ అయిపోయింది. దీంతో వారికి తిరిగి వచ్చి.. ఇక చికెన్ అయిపోయిందని తెలిపాడు. దీంతో ఆ నలుగరు తమ కారులో ఉన్న బీర్ బాటిల్స్ తీసి అక్కడే కూర్చొని తాగబోయారు.
అది చూసిన జెస్సీ బయటి నుంచి తీసుకువచ్చిన డ్రింక్స్ లేదా ఫుడ్ ఢాబాలో తినేందుకు అనుమతి లేదని.. అయినా క్లోజింగ్ టైమ్ కాబట్టి వాళ్లని బయలు దేరాలని కోరాడు. ఇది విన్న ఆ నలుగురు తామ కస్టమర్లం కాబట్టి అక్కడ కూర్చొని తాగితే తప్పేంటని గొడవ చేశారు. జెస్సీ కూడా వారితో వాదించాడు. అయితే కాసేపు వాగ్వాదం జరిగాక ఆ నలుగరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లాక జెస్సీ, ఆకాశ్ ఢాబా క్లోజింగ్ పనిలో పడ్డారు. సరిగ్గా అరగంట తరువాత ఆ నలుగురు కుర్రాళ్ల తిరిగి వచ్చారు. ఈ సారి బాగా మద్యం సేవించి ఉన్నారు.
Also Read: పనిమనిషిని హత్య చేసిన దంపతులు.. మరొకరిపై గ్యాంగ్ రేప్
వచ్చిరాగానే ఢాబాలో అన్ని వస్తువులు పగలగొట్టడం ప్రారంభించారు. అడ్డు వచ్చిన జెస్సీని క్రికెట్ బ్యాట్ తో చితకబాదారు. జెస్సీ కూడా వారిని కొట్టాడు. ఈ క్రమంలో ఆ నలుగురిలో ఒక వ్యక్తి జెస్సీని కత్తితో పొడిచాడు. జెస్సీని కాపాడడానికి వెయిటర్ ఆకాశ్ అడ్డురాగా ఆకాశ్ ని కూడా తీవ్రంగా కొట్టారు. అలా అంత నాశనం చేశాక నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జెస్సీకి తీవ్ర రక్తస్రావం అవుతున్న అతను ఢాబా ఓనర్ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఓనర్ కొడుకు పంకజ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకొని ఆకాశ్, జెస్సీని సెక్టర్ 16లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జెస్సీ తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పోలీసులు జెస్సీ హత్య కేసు, ఆకాశ్ కు తీవ్ర గాయాలు కావడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
సిసిటీవి వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఢాబా దాడి కేసులో గుర్మీత్, వీరు, రాజీ, జొగిందర్ అనే యువకులను అరెస్టు చేశామని, వీరిపై జెస్సీ హత్య కేసు మరో హత్యా యత్నం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు.