Irani Women Protest : దేశంలో మహిళలు, యువతులపై కొనసాగుతున్న అణిచివేతలకు నిరసగా ఇరాన్ లో ఓ యువతి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దేశంలోని ప్రతీ మహిళ.. బయటకు వచ్చేటప్పుడు.. ఆమె మెహం, శరీరం ఎవరికీ కనిపించకుండా హిబాజ్ ధరించాలంటూ నిబంధన విధించారు. కాదని.. ఎవరైనా వ్యవహరిస్తే, బహిరంగంగా శిక్షలు అమలుచేస్తున్నారు. ఈ నిబంధనలను నిరసిస్తూ.. ఏకంగా హిజాబ్ తో పాటు, తన ఒంటిపై దుస్తులన్నింటినీ తొలగించిందో యువతి. కేవలం లోదుస్తులతోనే బయట సంచరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఇరాన్ లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్శిటీలో ఓ యువతి, అర్థనగ్నంగా బయట తిరగి, తన నిరసన వ్యక్తం చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశంలో మహిళలు, యువతల స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారంటూ ఆమె ఈ ప్రదర్శనకు దిగినట్లు తెలుస్తోంది. అయితే.. చిన్నచిన్న నేరాలకు సైతం కఠిన శిక్షలు అమలు చేస్తున్న ఇరాన్ లో ఆమె పరిస్థితి ఇప్పుడేంటంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్య దేశాన్ని మతరాజ్యంగా మార్చుకున్న తర్వాత.. అక్కడ మహిళలపై అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిత్యం ఏదో ఓ నిబంధనలతో వాళ్లను వేధిస్తున్నారు. ఎవరైనా.. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే, ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తోంది.
ఈ ఘటనలో నిరసన వ్యక్తం చేసిన యువతిని సైతం అదుపులోకి తీసుకున్న యూనివర్సిటీ పోలీసులు.. అరెస్ట్ తర్వాత ఆమెను తీవ్రంగా కొట్టి, గాయపరిచినట్లు కొంతమంది సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హిజాబ్ కు వ్యతిరేకంగా యువతి చేపట్టిన చర్యలు తీవ్రంగా పరిగణించిన యూనివర్సిటీ అధికారులు.. ఆమెకు మతిస్థితితం సరిగా లేనట్లుందని వ్యాఖ్యానించారు. ఆమెను మానసిక వైద్యశాలకు తరలిస్తామని ప్రకటించారు.
నిరసన తెలిపిన యువతిపై ఆమ్నేష్టి ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ స్పందించింది. ఇరాన్ అధికారులు ఆ యువతని వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేసింది. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించకుండా నిరోధించాలని.. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని డి0మాండ్ చేసింది.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల ఫాలోవర్స్ ఉన్న ఉడత.. అమెరికాలో కమలా హ్యారిస్‌కు డేంజర్
కాగా.. నియంత పరిపాలనలోని ఇరాన్ లో ఒంటరిగా ఓ యువతి ఇంతటి సాహసం చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందంటూ.. అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ధైర్యానికి జోహార్లు అంటూ కొంతమంది కామెంట్ చేయగా, ఇప్పుడు ఆవిడ పరిస్థితి తలచుకుంటే భయమేస్తోందంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. మరొక యూజర్ స్పందిస్తూ.. యువతి ధైర్యానికి సెల్యూట్ అంటూ ప్రశంసించారు.