EPAPER

Indian Railway: ఇండియన్ రైల్వేస్ లో రెడ్, బ్లూ కోచ్‌లు, వీటిలో ఏ బోగీలు స్ట్రాంగ్? తేడా ఏమిటీ?

Indian Railway: ఇండియన్ రైల్వేస్ లో రెడ్, బ్లూ కోచ్‌లు, వీటిలో ఏ బోగీలు స్ట్రాంగ్? తేడా ఏమిటీ?

Red And Blue Coaches In Indian Railways: భారతీయ రైల్వేలు దేశ ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. నిత్యం మూడు కోట్లకు పైగా మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే, రైళ్లు సంబంధించిన చాలా విషయాలు ప్రయాణీకులకు తెలియదు. వాటిని ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


రైల్ కోచ్ లు ఎరుపు, నీలం రంగులో ఎందుకు ఉంటాయి?

భారత్ లోని చాలా రైళ్లు రెండు రకాల రంగుల కోచ్ లను కలిగి ఉంటాయి. వాటిలో ఒక రకం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF)లో తయారైనవి కాగా, మరోరకం లింక్ హాఫ్‌ మన్ బుష్ (LHB) కోచ్‌ లు. బ్లూ కలర్  కోచ్‌లు ICF అయితే, ఎరుపు రంగు కోచ్‌లు LHB. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.  దేశంలోని ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో నీలం రంగు బోగీలు ఉంటాయి. రాజధాని, సూపర్‌ ఫాస్ట్ ప్రీమియం రైళ్లలో ఎరుపు రంగు బోగీలు ఉంటాయి.


ఎరుపు రంగు కోచ్ ల ప్రత్యేకత

రెడ్ కోచ్‌ లను లింక్ హాఫ్‌మన్ బుష్ అని పిలుస్తారు. ఎరుపు రంగు కోచ్‌లు నీలం రంగుల కంటే చాలా సురక్షితమైనవి. అవి ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే, సులభంగా ట్రాక్‌పై పడకుండా ఉండే యాంటీ టెలిస్కోపిక్ డిజైన్‌ తో రూపొందించబడతాయి. అంతే కాదు రైలు ప్రమాద సమయంలో బోగీ పైకి ఎక్కకుండా ఈ కోచ్ లను రూపొందించారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లలో వీటిని వినియోగిస్తారు. ముప్పై ఏళ్లుగా రెడ్ కోచ్‌లను ఉపయోగిస్తున్నారు. అవి 2000ల ప్రారంభంలో ట్రాక్ ఎక్కాయి. వీటిని సాధారణంగా పంజాబ్‌ లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఎరుపు రంగు ప్రీమియం సేవల లేబుల్‌ ను కలిగి ఉంటాయి.

బ్లూ కలర్ కోచ్ ల ప్రత్యేకత

బ్లూ కోచ్ లను తొలుత చెన్నైలో తయారు చేశారు. వీటని పూర్తి స్థాయి ఇనుముతో తయారు చేస్తారు. ఎయిర్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి.  దీని నిర్వహణ చాలా ఖరీదైనది. ఎందుకంటే నీలిరంగు హైయ్యర్ స్టాండెర్డ్ ప్రయాణానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇవి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణీకుల కారణంగా ఈ రైళ్లకు అధిక డిమాండ్‌ను కలిగి ఉంటాయి. ఇందులో తక్కువ సీట్లు ఉంటాయి. ఇవి ప్రమాదాలను తట్టుకోవడంలో ఎరుపు రంగు కోచ్‌ల మాదిరి స్ట్రాంగ్ గా ఉండవు. వీటి లైఫ్ టైమ్ ఇరవై ఐదు సంవత్సరాలు. ఆ తర్వాత వీటిని ట్రాక్ నుంచి తొలగిస్తారు. ఈ బ్లూ కరల్ కోచ్‌లు  తరచుగా భారతీయ రైల్వేలలో, ముఖ్యంగా రాజధాని, శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ వంటి రైళ్లలో కనిపిస్తాయి. వాటి వేగం గంటకు 70 కిలో మీటర్ల వరకు ఉంటుంది.

Read Also: రైల్వే టిక్కెట్లు ఇన్ని రకాలా? ఒక్కోదాని మధ్య తేడా ఏంటి? వాటిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Related News

Hyderabad – Visakhapatnam: నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు.. ఈ రైలు ప్రత్యేకత ఇదే, ఎప్పటి నుంచంటే?

Indian Railways: మన దేశంలో అన్ని రైళ్లు ఉన్నాయా? భోలు ఏనుగు లోగో ప్రత్యేకత ఏమిటీ?

Big Stories

×