OnePlus 13 vs iQOO 13 : iQOO 13, OnePlus 13 మెుబైల్స్ తాజాగా చైనాలో లాంఛ్ అయ్యాయి. ఇక ఈ ఫోన్స్ ఒకదానికొకటి పోటీ పడుతూ అదిరిపోయే ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ తో పనిచేస్తున్నాయి. ఇక వన్ ప్లస్, ఐక్యూ ఓల్డ్ వెర్షన్ మెుబైల్స్ తో పోలిస్తే ఈ రెండు మొబైల్స్ మరింత లేటెస్ట్ అప్డేట్స్ తో అందుబాటు ధరల్లోనే మార్కెట్లోకి వచ్చాయి. సామ్ సాంగ్, యాపిల్ మొబైల్స్ తో పోలిస్తే ఈ రెండిట్లో ఏది బెస్ట్ మొబైల్ అని సెలెక్ట్ చేసుకోలేకపోతే ఫీచ,ర్స్ స్పెసిఫికేషన్స్ పై ఓ లుకేయాల్సిందే.
iQOO 13, OnePlus 13 మెుబైల్స్ ను డిస్‌ప్లే గ్లాస్ బ్యాక్ మెటల్ ఫ్రేమ్‌తో డిజైన్ చేశారు. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా IP69 రేటింగ్‌తో ఉన్నాయి. ఇక ఈ రెండు మొబైల్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ లో వస్తున్న మైక్రోకర్వ్డ్ డిస్ప్లేకు విరుద్ధంగా ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉన్నాయి.
OnePlus 13 స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంఛ్ అయింది. ఇందులో LPDDR5X 24GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ – 50MP సూపర్ టెలిఫోటో, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాతో కూడా 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఫోన్ ఫ్రంట్ – బ్యాక్ కెమెరాతో 4K Dolby Vision వీడియోలు షూట్ చెయ్యెచ్చు. ఇక 6000mAh బ్యాటరీ, అల్ట్రా ఫస్ట్ కేహార్జ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ లో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్, 6.82 అంగుళాల AMOLED స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ QHD+ (3168×1440) రిజల్యూషన్, 4500nit పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉన్నాయి.
ALSO READ : ఇచ్చిపడేసిన ఫ్లిప్కార్ట్.. 50MP కెమెరా, 5000mahబ్యాటరీ మెుబైల్స్ పై ఊహించని తగ్గింపు
iQOO 13 మెుబైల్ 6.82 అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED డిస్‌ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, 6150mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ తో లాంఛ్ అయింది. బ్లాక్, గ్రీన్, గ్రే, వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈ మెుబైల్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. OISతో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, OISతో 50 మెగాపిక్సెల్ సోనీ టెలిఫొటో కెమెరా సైతం అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP69 + IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్సీతో ఉంది. 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయి. ఇక 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 47,200, 16GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 50,800, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 53,100 గా ఉన్నాయి. ఇక 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 55,500, 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 61,400 గా ఉంది.