AP Home Minister :
⦿ వడమాలపేట బాధిత కుటుంబానికి పరామర్శ
⦿ నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామని హామీ
⦿ వైసీపీ హయాంలో ఏం జరిగిందో చూసుకోవాలి
⦿ నేతలకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్
తిరుపతి, స్వేచ్ఛ : తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబానికి మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిత గత ఐదు సంవత్సరాల పాలన వైఫల్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. గంజాయి, మద్యం మత్తులో చిన్నారిపై లైంగిక దాడి, హత్య జరిగిందని చెప్పారు.
రోజాకు కౌంటర్
‘ నిందితుడికి మూడు నెలల్లో శిక్ష పడేలా పనిచేస్తాం. పాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. వైసీపీ నేతలు పదే పదే ప్రభుత్వ వైఫల్యమని విమర్శిస్తున్నారు. ముందు మీ హయాంలో ఏం జరిగిందో చూసుకోండి. గత ఐదేళ్లలో అత్యాచారాలు, హత్యలు జరగలేదా? గతంలో నిందితులపై కనీసం కేసులు కూడా పెట్టలేదు.. వారిని పట్టుకోలేదు. దిశ అనే యాప్ లేదు.. అది ఫోర్త్ లైన్ యాప్ మాత్రమే. దిశ అనే హాడావుడి ఎందుకు? సీఎం చంద్రబాబుకు అడబిడ్డలు లేరని ప్రచారం చేస్తున్నారు కానీ రాష్టంలోని ఆడబిడ్డలను తన ఆడ బిడ్డలాగా చూసుకుంటున్నారు. మద్యం షాపుల్లో వైసీపీ బ్రాండ్లు పెట్టడం లేదని రోజా బాధపడుతున్నారా? బెల్టు షాపులు కనపడితే, బెల్టు తీస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. రోజాకు సామాజిక బాధ్యత ఉంటే ఎక్కడైనా బెల్టు షాపులు ఉంటే ఫిర్యాదు చేయాలి. వెంటనే చర్యలు తీసుకునే పని మేం చేస్తాం. ఎవరు పడితే వాళ్లు ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని అనిత హెచ్చరించారు.
ALSO READ : వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. నైరాశ్యంలో జగన్ టీమ్, పీకే టీమ్ లేకుంటే పనికాదా?