Kerala Train Accident: కేరళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కాడ్ జిల్లా షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. షోరనూర్ రైల్వే స్టేషన్ కు కొద్ది దూరంలో ఉన్న షోరనూర్ బ్రిడ్జి రైల్వే ట్రాక్ మీద ఉన్న చెత్తను నలుగురు కార్మికులు తొలగిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కేరళ ఎక్స్ ప్రెస్ దూసుకురావడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు
కేరళ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కాగా, మరో ఇద్దరు పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతులు తమిళనాడుకు చెందిన లక్ష్మణన్, వల్లి, రాణిగా గుర్తించారు. మరో వ్యక్తి మృతదేహం దొరకలేదు. అతడి మృతదేహం సమీపంలోని భరతపూజ నదిలో పడి ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అతడి డెడ్ బాడీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
రైలును గమనించకపోవడం వల్లే ప్రమాదం
న్యూఢిల్లీ- తిరువనంతపురం ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 3.05 గంటలకు కార్మికులను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను అంబులెన్స్ లో పోస్టుమార్టం కోసం పంపించారు. మరో మృదేహం కోసం వెతుకుతున్నారు. రైలు వస్తున్న విషయాన్ని పారిశుద్ధ్య కార్మికులు గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రైలు పెద్ద శబ్దం చేసుకుంటూ వస్తున్నా కార్మికులు ఎందుకు పట్టించుకోలేదు? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
కార్మికుల మృతిపై రైల్వేశాఖ విచారణ
అటు ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కార్మికులు రైలు ఎందుకు గమనించలేకపోయారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుస్తాయని వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణం అయిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
గత కొంతకాలంగా వరుస రైలు ప్రమాదాలు
మరోవైపు గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొన్ని ఆయా సాంకేతిక కారణ వల్ల ప్రమాదాలు జరుగుతుంటే, కొన్ని చోట్ల దుండగులు కావాలనే రైలు ప్రమాదాలు జరిగే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. రైలు పట్టాల మీద సిలిండర్లు, రాళ్లు, కరెంటు స్తంభాలు, పేలుడు పదార్థాలు ఉంచుతున్నారు. ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించి లోకో పైలెట్లు రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదాలు తప్పాయి. ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రైలు ప్రమాదాలకు కారణమయ్యే పనులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది.
तमिलनाडु के पलक्कड़ में एक बड़ा रेल हादसा हुआ है!!
केरल एक्सप्रेस ने ट्रैक पर काम कर रहे चार सफाईकर्मियों को टक्कर मार दी। ये सभी लोग ट्रैक से कचरा उठा रहे थे तभी घटाना घटी।#TrainAccident #railaccident #KeralaNews #TamilNadu pic.twitter.com/8gjE7iV3Ea
— Sachin (@SachinLohre) November 2, 2024
Read Also: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ.. భలే కంట్రోల్ చేశారే, హైదరాబాద్ ఆర్పీఎఫ్‌లకు నెటిజన్స్ సెల్యూట్