గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అనుకోకుండా. మృత్యువాత పడుతూ అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నారు. అయితే అందులో కొంతమంది వయసు రీత్యా వృద్ధాప్య కారణాలవల్ల స్వర్గస్తులయితే , మరికొంతమంది వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొంతమంది చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు ఎదుర్కొని పరమపదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన ఎవరో కాదు గురు ప్రసాద్ (Guruprasad).. కన్నడ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న స్టార్ డైరెక్టర్..
పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్నడ నటుడిగా, డైరెక్టర్ గా మంచి పేరు అందుకున్న గురు ప్రసాద్ బెంగళూరులోని తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించారు. మూడు రోజుల క్రితమే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు చుట్టుపక్కల వారు అనుమానిస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఏ కారణం చేత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం తెలియక అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యంతో పాటు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గురు ప్రసాద్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గురు ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రాలు..
గురు ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రాల విషయానికి వస్తే.. మాత, ఇడ్డేలు మంజునాథ, రంగనాయక వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడుగా ఈయన నటించిన చిత్రాల విషయానికి వస్తే.. బాడీగాడ్, కుష్క, విజిల్, మైలారీ, జిగర్తాండ, హుడుగురు వంటి చిత్రాలలో నటించారు. ఇకపోతే దర్శకుడిగా మంచి పేరు అందుకున్న ఈయన బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
దుర్వాసన రావడంతో అప్రమత్తమైన స్థానికులు..
గురు ప్రసాద్ మదనాయకహళ్లి లోని తన అపార్ట్మెంట్ లో ఆయన మృతదేహం వేలాడుతూ కనిపించింది. అయితే అపార్ట్మెంట్ దుర్వాసన రావడంతో ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా.. వారు ఆయన ఇంటికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించినట్లు సమాచారం. అసలు విషయంలోకెళితే.. ఇటీవల గురు ప్రసాద్ దర్శకత్వం వహించిన రంగనాయక సినిమా ఘోర పరాభవాన్ని చవిచూసిం.ది దీనితో ఆయన పూర్తిగా అప్పుల పాలయ్యారట. మరొకవైపు కొన్ని నెలల క్రితం ఈయన రెండో పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం. గత ఎనిమిది నెలలుగా బెంగళూరు ఉత్తర తాలూకాలోని మదనాయకహళ్లి సమీపంలో ఉన్న టాటా న్యూ హావెల్ అపార్ట్మెంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అక్కడే గురు ప్రసాద్ మృతదేహం లభించింది. మరి ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలిసిందా లేదా ఆయన భార్య ఎక్కడ ఉంది అనే విషయాలు మాత్రం తెలియలేదు.. దీనికి తోడు ఆయన కుటుంబం ఎవరు? ఏంటి? అనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఏది ఏమైనా ఒక మంచి డైరెక్టర్ ను కన్నడ పరిశ్రమ కోల్పోయింది అనడంలో సందేహం లేదు.