EPAPER

Yogi Adityanath Death Threat: ’10 రోజుల్లో సిఎం రాజీనామా చేయాలి లేకపోతే లేపేస్తాం’.. పోలీసులకు ఫోన్ చేసిన క్రిమినల్స్

Yogi Adityanath Death Threat: ’10 రోజుల్లో సిఎం రాజీనామా చేయాలి లేకపోతే లేపేస్తాం’.. పోలీసులకు ఫోన్ చేసిన క్రిమినల్స్

Yogi Adityanath Death Threat| దేశంలో క్రిమినల్ గ్యాంగ్స్ చెలరేగి పోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాఫియా గ్యాంగ్స్ బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు హత్య చేస్తామని బెదిరించారు. నవంబర్ 2, 2024 శనివారం సాయంత్రం, ముంబై పోలీసులకు ఫోన్ చేసి యోగి ఆదిత్యనాథ్ పది రోజుట్లో సిఎం పదవికి రాజీనామా చేయకపోతే అతడిని హత్యచేస్తామని బెదిరించారు.


ముంబై పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “శనివారం సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసి యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయకపోతే అతడికి కూడా ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్దిఖికి పట్టిన గతే పడుతుందని చెప్పాడు. మేము ఫోన్ చేసిన వ్యక్తిని, ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేస్తున్నం. ఇప్పటికే ఒక పోలీస్ బృందం ఈ కేసులో విచారణ చేపట్టింది” అని తెలిపారు.

Also Read: ‘లైఫ్ జాకెట్ వేసుకుంటే సెల్ఫీ చెడిపోతుంది’.. సముద్రంలో మునిగిపోయిన ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు


బాబా సిద్దిఖి హత్య
ముంబైకి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) నాయకుడు బాబా సిద్దిఖిని(66) అక్టోబర్ 12, 2024 రాత్రి ఆయన కుమారుడు జీషాన్ సిద్దిఖి ఆఫీసు బయట ఉండగా.. ముగ్గురు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. బాబా సిద్దఖి తన కారు వద్దకు వెళుతుండగా.. కాల్పులు జరిగాయి. దుండగులు ఆ తరువాత టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ ఘటన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉండగానే జరిగింది. పోలీసులు దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించగా.. వారు కారంపొడి చల్లిపారిపోయారు. కాల్పుల కారణంగా తీవ్ర గాయాలతో కుప్పకూలిన బాబా సిద్దిఖిని లీలావతి ఆస్పత్రికి తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ మరణించారు.

దాడి చేసిన దుండగులలో పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న వ్యక్తి శివకుమార్ గౌతమ్ ఒక 9 mm పిస్టల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. అరెస్ట అయిన ఇద్దరు నిందితులు కాల్పులు జరపలేదు. కేవలం టియర్ గ్యాస్, కారం పొడి చల్లి అతని సాయం చేశారు. ఈ ఘటన వెనుక గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ఉన్నట్లు సమాచారం.

చనిపోయిన బాబా సిద్దిఖి.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు. సల్మాన్ ఖాన్‌ని కూడా చాలా సార్లు బిష్ణోయి గ్యాంగ్ హత్య చేస్తామని బెదిరించింది. సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు దుండగులు కాల్పులు కూడా చేశారు. అయితే బాబా సిద్దిఖి మహారాష్ట్రలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు . ఆయన మరణం పట్ల దేశంలోని ప్రముఖ సినీతారలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. బాబా సిద్దిఖి 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే సంవత్సరం క్రితం ఆయన అజిత్ పవార్ ఎన్‌సీపీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున మూడు సార్లు బాంద్రావెస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒక సారి మంత్రి పదవి కూడా చేపట్టారు. బాలీవుడ్ తారలకు రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడంతో ఆయన ఫేమస్ అయ్యారు.

బాబా సిద్దిఖి కుమారుడు జీషాన్ సిద్దిఖికి కూడా బెదిరింపులు
బాబా సిద్దిఖి కుమారుడు ఎమ్మెల్యే జీషాన్ సిద్దికిని కూడా చంపేస్తామని ఇటీవల అతని ఆఫీసుకి ఒక ఫోన్ వచ్చింది. ముంబై పోలీసులు ఈ ఫోన్ బెదిరింపుల కేసులో ఒక 20 ఏళ్ల యువకుడని అరెస్ట్ చేశారు. అతను నోయిడాకు చెందిన గర్ఫాన్ అని తెలిసింది.

Related News

PM Modi: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి, ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!

Bengaluru Man Dies: చావు తెచ్చిన ఛాలెంజ్.. క్రాకర్ పై కూర్చొన్న యువకుడు.. క్షణాల్లో మృతి

MiG-29 Fighter Jet Crashes: ఆగ్రా సమీపంలో కూలిన జెట్ విమానం.. ఎగిసిపడ్డ అగ్ని కీలలు.. పైలట్లు సేఫ్

Stalin Thalapathy Vijay: విజయ్ కొత్త పార్టీపై సెటైర్ వేసిన సిఎం స్టాలిన్.. ఆ ఉద్దేశంతోనే రాజకీయాలు అని ఎద్దేవా

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల గొడవ.. తొలి సమావేశంలోనే ఆర్టికల్ 370పై మాటల యుద్ధం

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి

Lashkar-e-Taiba Commander : సైన్యం వ్యూహం అదుర్స్.. బిస్కెట్లతో ఉగ్రవాది హతం

Big Stories

×