EPAPER

Canada India: కెనెడా శత్రుదేశాల జాబితాలో ఇండియా.. అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు

Canada India: కెనెడా శత్రుదేశాల జాబితాలో ఇండియా.. అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు

Canada India| కెనెడాలోని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారతదేశాన్ని తన శత్రు దేశాల జాబితాలో చేర్చింది. కెనెడాపై సైబర్ దాడులు చేసే దేశంగా ఇండియాను ప్రకటించింది. శనివారం కెనెడా ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్‌మెంట్ 2025-26 జాబితాలో శత్రు దేశాలుగా ఇండియా, చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాల పేర్లున్నాయి.


భారతదేశం తమ వద్ద సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీని కెనెడాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని ఈ రిపోర్ట్ లో కెనెడా ప్రభుత్వం ఆరోపణలు కూడా చేసింది. ఇదేకాకుండా ఇండియా థర్డ్ పార్టీ యూజర్ల ద్వారా కెనెడా ప్రభుత్వ కార్యకలాపాలాపై గూఢాచర్యం చేస్తోందని ఈ రిపోర్ట్ లో పేర్కొంది.

ఈ ప్రకటనపై భారతదేశ ప్రభుత్వం మండిపడింది. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పేరును దిగజార్చడానికే కెనెడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తోందని ఆరోపణలు చేసింది.


భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కెనెడా తీరు తీవ్రంగా ఖండించింది. శనివారం సాయంత్రం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. కెనెడా అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండానే భారతదేశంపై నిందలు వేస్తున్నారని.. ఇదంతా ప్రపంచదేశాల దృష్టిలో ఇండియాను దిగజార్చడానికి కెనెడా ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వ్యాఖ్యానించారు. కెనెడా ప్రభుత్వం జారీచేసిన సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్.. అందులో భారతదేశం పేరు శత్రు దేశాల జాబితాలో చేర్చడం ఈ కుట్రలో భాగమని చెప్పారు. కెనెడా చేబుతున్నట్లు ఇండియా సైబర్ గూఢాచర్యం చేస్తుంటే ఆధారాలు చూపాలని అంతేకాని ఇలా నిరాధారంగా నిందలు వేస్తే.. ఇది తాము కేవలం కుట్రగానే పరిగణిస్తామని ఆయన అన్నారు.

Also Read: గూగుల్‌కు భారీ జరిమానా విధించిన రష్యా .. 20 డెసిలియన్ డాలర్లు.. అంటే 2 తరువాత 34 జీరోలు!

వీటితో కెనెడా ప్రభుత్వం తమ దౌత్యాధికారులపై నిఘా పెట్టిందని.. ఇది అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్ధమని రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. కెనెడా దేశంలోని ఇండియన్ డిప్లొమాట్స్ పై కెనెడా ప్రభుత్వం నిరంతరం నిఘా పెట్టిందని.. వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు తమ వద్ద రిపోర్ట్ ఉందని జైస్వాల్ తెలిపారు. ఇలా చేయడం తమ దౌత్యాధికారులను వేధించడంకాక మరేంటని ప్రశ్నించారు. కెనెడా చర్యలను ఇండియా తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు.

మరోవైపు కెనెడా విదేశాంగ మంత్రిత్వశాఖ డిప్యూటీ అయిన డేవిడ్ మారిసన్ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశ హోం మంత్రి అమిత్ షా.. కెనెడాలో హత్యలకు కుట్ర చేస్తున్నారని అన్నారు. 2023లో కెనెడా పౌరుడైన ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు అమితా షానే మాస్టర్ మైండ్ అని.. ఆయన ఆదేశాలతోనే కెనెడాలో క్రిమినల్స్ హత్యలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. డేవిడ్ మారిసన్ చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం మండిపడింది. ఇండియాలోని కెనెడా అంబాసిడర్ ని పిలిచి అధికారికంగా దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్.. డేవిడ్ మారిసన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. “ఈ వ్యాఖ్యలన్నీ అర్థం పర్థం లేనివి, నిరాధారమైనవి కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.” అని అన్నారు. కెనెడాలో చదువుకునే విద్యార్థులు, కార్మికుల భద్రతపై భారత ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా కెనెడాలోని ఒట్టావా నగరంలో 23 సంవత్సరాలుగా జరుగుతున్న దీపావళి వేడుకలను స్థానిక ఎంపీ, ప్రతిపక్ష నేత రద్దు చేయడంపై కెనెడాలోని భారతీయులు, హిందువులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కెనెడాలో మరో సంవత్సర కాలంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో అక్కడి ప్రతిపక్షం, అధికార పార్టీలు.. స్థానిక సిక్కులు, ఖలిస్తానీ వేర్పాట వాదుల మద్దతు కోసం, వారిని మెప్పించడం ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Related News

US Election 2024: మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎలక్షన్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే?

Iran Woman Hijab Protest: ఇరాన్ లో లోదుస్తుల్లో నిరసన చేసిన మహిళ మిస్సింగ్.. చంపేశారా?

Trump WhiteHouse: ఓటమిని ట్రంప్ అంగీకరించడా?.. 2020లో వైట్ హౌస్‌ని వీడి తప్పుచేశానని వివాదాస్పద వ్యాఖ్యలు!

Newborn Baby Facebook Sale : పసిబిడ్డను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన తల్లి అరెస్ట్.. ఆ డబ్బులు దేనికోసమో తెలుసా?..

Nigeria Kids Death Sentence: 29 మంది పిల్లలకు ఉరిశిక్ష?.. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధింపులు..

Canada Hindu Attacks: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు

Irani Women Protest : నియంత దేశంలో.. ఈ యువతి గుండె ధైర్యానికి ప్రపంచమంతా సెల్యూట్

Big Stories

×