EPAPER

Venky Atluri: నేను ఒక కథ రాస్తున్నప్పుడు ఆ జోనర్ కి సంబంధించిన 30,40 సినిమాలు చూస్తాను

Venky Atluri: నేను ఒక కథ రాస్తున్నప్పుడు ఆ జోనర్ కి సంబంధించిన 30,40 సినిమాలు చూస్తాను

Venky Atluri: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ దర్శకులలో వెంకీ అట్లూరి ఒకరు. తొలిప్రేమ (Tholi Prema) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు వెంకీ అట్లూరి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మొదట ఈ టైటిల్ ని వరుణ్ తేజ్ సినిమాకి పెట్టినప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు. కానీ సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక లవ్ స్టోరీని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు వెంకీ. ముందుగా వెంకీ నటుడుగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు. హీరోగా ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత స్నేహగీతం (Sneha Geetham) సినిమాతో ఒకవైపు నటుడుగాను మరోవైపు రచయిత గాను కూడా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు. వెంకీ హీరోగా సినిమా చేసినప్పుడు ఎవరైతే ట్రోల్ చేశారో, సేమ్ పర్సన్స్ స్నేహగీతం సినిమా అప్పుడు వెంకీని పొగుడుతూ రాశారు.


Also Read : Varun Tej : తొలిప్రేమ’ టైటిల్ వాడినందుకే వణికాను.. ఇక చిరంజీవిగారి టైటిల్ వాడాలంటే?

వెంకీ దర్శకత్వం వహించిన మూడు సినిమాలు కూడా ట్రోల్ కి గురయ్యాయి. మొదట ఫస్ట్ ఆఫ్ చాలా అద్భుతంగా ఉన్నా కూడా సెకండ్ ఆ విషయాన్ని వస్తే వేరే కంట్రీలో ఆ స్టోరీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వెంకీ అట్లూరి మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ధనుష్ (Dhanush) హీరోగా చేసిన సార్ సినిమా అప్పుడు కూడా ఎటువంటి ట్రోల్స్ వినిపించాయి. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారు. ధనుష్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసి సార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు వెంకీ. ఇక రీసెంట్గా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా చేసిన లక్కీ భాస్కర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రిపోర్ట్ అందుకొని అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే వెంకీ కెరీర్ లో సార్, లక్కీ భాస్కర్ సినిమాలు కీలకమైన పాత్రను పోషించాయని చెప్పాలి.


ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ ఒక జోనెర్ కి సంబంధించిన సినిమా రాసినప్పుడు, ఆ జోనెర్ లో వచ్చిన కనీసం 30,40 సినిమాలను నేను చూస్తాను అని చెప్పాడు. ఇక వెంకీ దర్శకత్వం వహించిన సార్, లక్కీ భాస్కర్ సినిమాల కాన్సెప్ట్స్ కూడా ఇంతకుముందు వేరే సినిమాల్లో వచ్చాయి. అయితే వాటి విషయంలో వెంకీ చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు అని చెప్పాలి. ముందు వచ్చిన సినిమా ఛాయలు ఈ సినిమాలో కనిపించకుండా అద్భుతంగా డీల్ చేశాడు. కొన్ని సీన్స్ రిఫ్లెక్ట్ అయినా కూడా తన సొంత శైలిని యాడ్ చేసి సక్సెస్ అందుకున్నాడు వెంకీ. అయినా కూడా కొంతమంది సార్ సినిమా రిలీజ్ అయినప్పుడు సూపర్ 30, రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా విషయంలో కూడా హర్షద్ మెహతా స్టోరీని తీసుకున్నాడు అని కామెంట్ చేశారు. ఏదేమైనా సాధారణ ఆడియన్స్ ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు అనేది వాస్తవం.

Related News

Jai Hanuman: రానా రాముడిగా మారితే జరిగేది ఇదే… ప్రశాంత్ వర్మ ప్లాన్ బెడిసికొట్టనుందా?

Salman Khan Receives another Threat : భిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదరింపులు… ఈ సారి రెండు ఆఫర్స్..!

Game Changer Movie Teaser: మెగా ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. టీజర్ లాంచ్ కి సర్వం సిద్ధం..!

Chandini Chowdary : తీవ్ర గాయం… సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన హీరోయిన్… మరి బాలయ్యతో సినిమా?

Director Krish Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన డైరెక్టర్ క్రిష్.. వధువు ఎవరంటే..?

War 2 : ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ చనిపోతాడా? స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా…!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు..

Big Stories

×