EPAPER

Varun Tej: నేను కేవలం మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను, అంతకుమించి బ్రెయిన్ వాడను కూడా

Varun Tej: నేను కేవలం మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను, అంతకుమించి బ్రెయిన్ వాడను కూడా

Varun Tej : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వెర్షటైల్ యాక్టర్స్ లో వరుణ్ తేజ్ (Varun Tej) ఒకరు. శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. ఈ సినిమాలో వరుణ్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యూలేషన్ ఇవన్నీ కూడా సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ అవడం మాత్రమే కాకుండా మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఒక విలేజ్ పొలిటికల్ డ్రామాని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు శ్రీకాంత్. అలానే ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం కూడా మంచి ప్లస్ అయింది. ఇప్పటివరకు నారప్ప సినిమా మినహాయిస్తే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో మిక్కీ జే మేయర్ సంగీతం కీలకపాత్రను పోషించింది.


Also Read : Kollywood: సెలబ్రిటీ డాగ్ ని బలి తీసుకున్న దీపావళి సెలబ్రేషన్స్… సినిమాలో జరిగినట్టే…!

ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ కెరియర్ హీరోగా మొదలైనప్పటి నుంచి నాగబాబు కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు. మరి వరుణ్ ఏం దృష్టిలో పెట్టుకున్నాడో తెలియదు గానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను సెట్ చేసుకొని అద్భుతమైన కథలను ఎన్నుకున్నాడు. వరుణ్ కెరియర్లో కొన్ని డిజాస్టర్ సినిమాలు ఉండొచ్చు, కానీ వరుణ్ హీరోగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. వరుణ్ చేసిన అన్ని కాన్సెప్ట్ బేస్ సినిమాలు మెగా ఫ్యామిలీస్ లో ఏ హీరో కూడా ఇప్పటివరకు చేయలేదు. అందరూ కమర్షియల్ జోనర్ లో వెళ్తుంటే వరుణ్ మాత్రం కాన్సెప్ట్ బేస్ సినిమాలో ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్లాడు. అయితే రీసెంట్ టైమ్స్ లో వరుణ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది.


Also Read : Leo 2 : “లియో” సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన లోకేష్ కనగరాజ్

ఇక ప్రస్తుతం కరుణ్ కుమార్ (Karun Kumar) దర్శకత్వంలో వరుణ్ చేస్తున్న సినిమా మట్కా(Matka). ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ను రీసెంట్ గానే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచింది. ఖచ్చితంగా ఒక కమర్షియల్ హిట్ సినిమాను వరుణ్ అందుకుంటాడు అని చాలామందికి ఒక స్థాయి నమ్మకం కూడా వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక జర్నలిస్ట్ వరుణ్ క్వశ్చన్ చేస్తూ.. కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేస్తున్నందుకు వర్కౌట్ కాలేదు అని చెప్పి ఈ మట్కా సినిమాను ఎంచుకున్నారా అని అడిగితే… నాకు ఇప్పుడు అలా ఏమీ అనిపించదు నేను మంచి సినిమాలు చేయాలని అనుకుంటాను. అంతకుమించి పెద్దగా నా బ్రెయిన్ కూడా వాడను అంటూ చాలా ప్రొఫెషనల్ గా ఆన్సర్ ఇచ్చాడు వరుణ్.

Related News

Allu Arjun’s Pushpa 2 : నిర్మాతలు మాట తప్పుతున్నారా..? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితేంటి..?

Manchu Manoj : కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తండ్రి బాటలో… మంచు మనోజ్ విలన్ వేషాలు వర్కవుట్ అయ్యేనా?

Thandel Release Date: ‘తండేల్’ రిలీజ్ డేట్ ఇదే.. సేఫ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్..

Kamal Haasan: కమల్ పుట్టినరోజుకు సిద్ధంగా ఉండండి థగ్స్.. మణిరత్నం నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుంది

Dhoom Dhaam Movie: బఘీర మూవీ పై యంగ్ హీరో అసహనం.. కెరియర్ పై దెబ్బేసుకుంటారా..?

Citadel Honey Bunny: హైదరాబాద్‌లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ స్పెషల్ స్క్రీనింగ్.. యంగ్ హీరోతో సమంత సందడి

Amala Paul: మొదటి భర్త పై అలాంటి కామెంట్స్ చేసిన అమలాపాల్.!

Big Stories

×