EPAPER

J&K Encounter : ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు.. కశ్మీర్ లో ఒకేరోజు మూడు ఘటనలు

J&K Encounter : ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు.. కశ్మీర్ లో ఒకేరోజు మూడు ఘటనలు

J&K Encounter : కశ్మీర్ లోని వేరువేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య వరుస ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ ఉస్మాన్ లష్కరీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. రోజంతా జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బందికి సైతం గాయలైయ్యాయి. ఇందులో.. ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీస్ దళాలకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు CRPF జవాన్లుగా అధికారులు వెల్లడించారు. గాయపడిన సిబ్బందిని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించిన ఆధికారులు.. వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు.


సాధారణ విధుల్లో భాగంగా.. ఖాన్యార్‌ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దాంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఉగ్రమూకతో రోజంతా ఎన్ కౌంటర్ ను కొనసాగించారు. చివరికి.. ఓ ఉగ్రమూక హతం కాగా.. నలుగురు సైనికులు గాయాలతో బయటపడ్డారు.

కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది ఉస్మాన్ .. పాకిస్థాన్ కు చెందిన వాడిగా గుర్తించిన అధికారులు.. ఇతను కొన్ని నెలలుగా శ్రీనగర్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గతేడాది అక్టోబరు 29న శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న పోలీస్ అధికారి.. ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వానీ హత్య కేసులో ఇతని ప్రమేయం ఉందని జమ్ముకశ్మీర్ ఐజీపీ వెల్లడించారు.


మరోవైపు.. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఇద్దరిలో ఒకరు పాకిస్థాన్ కు చెందిన వాడు కాగా.. మరొక ఉగ్రవాది స్థానికుడిగా గుర్తించారు. అయితే.. మృతి చెందిన ఉగ్రవాది ఏ ముఠా సభ్యుడో ఇంకా నిర్థారించలేదు. సైన్యంపై ఈ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. తిప్పికొట్టిన సైనికులు కొద్దిసేపట్లోనే ఇద్దరిని హతమార్చినట్లు ప్రకటించారు.

కాగా మరోవైపు… ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులే లక్ష్యంగా బుద్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితులు బుల్లెట్ గాయాలతో బయటపడగా, వారిని శ్రీనగర్ లోని ఆసుపత్రిలో చేర్పించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.

Also Read : లడఖ్ లో కీలక ప్రయోగం చేపట్టిన ఇస్రో.. సరికొత్త లక్ష్యాలకు సిద్ధమేనా.?

ఇటీవల కాలంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేస్తుండడంతో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నారు.  స్థానికంగా రిక్యూట్ మెంట్ ను సమర్థవంతంగా కట్టడి చేయడం, పాక్ నుంచి చొరబాట్లను నియంత్రిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో అడపాదడపా సైన్యంపై కాల్పులకు ప్రయత్నిస్తున్నారు. ఇదే తరహాలో దిపోరాలోని పనార్‌లో ఉగ్రమూకల అనుమానాస్పద కదలికలు గుర్తించిన సైన్యం.. సోదాలు ముమ్మరం చేయగా, సైనికులపై కాల్పులు జరిపుతూ సమీపంలోని అటవిలోకి కొందరు ఉగ్రవాదులు పారిపోయారు.

Related News

Priyanka Gandhi: మీకు నేనున్నా.. బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకగాంధీ

PM Modi: కెనడాలో హిందూ దేవాలయంపై దాడి, ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం!

Bengaluru Man Dies: చావు తెచ్చిన ఛాలెంజ్.. క్రాకర్ పై కూర్చొన్న యువకుడు.. క్షణాల్లో మృతి

MiG-29 Fighter Jet Crashes: ఆగ్రా సమీపంలో కూలిన జెట్ విమానం.. ఎగిసిపడ్డ అగ్ని కీలలు.. పైలట్లు సేఫ్

Stalin Thalapathy Vijay: విజయ్ కొత్త పార్టీపై సెటైర్ వేసిన సిఎం స్టాలిన్.. ఆ ఉద్దేశంతోనే రాజకీయాలు అని ఎద్దేవా

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల గొడవ.. తొలి సమావేశంలోనే ఆర్టికల్ 370పై మాటల యుద్ధం

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు, 36 మంది మృతి

Big Stories

×