Kanguva : ప్రస్తుతం సౌత్ ప్రేక్షకులు మొత్తం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’ (Kanguva). తాజాగా నిర్మాతకు ఎదురైన సమస్యల వల్ల ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ మూవీకి ఇప్పుడు అడ్డంకిగా మారింది ఏంటి? నిజంగానే ‘కంగువా’ పోస్ట్ పోన్ కాబోతోందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ ప్లాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘కంగువ’ (Kanguva). ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలోకి తీసుకురాబోతున్నాం అంటూ ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అలాగే తమిళ సినిమా ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయిన 1000 కోట్ల మార్క్ ను ‘కంగువ’ టచ్ చేయబోతోంది అంటూ మేకర్స్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లతో పాటు భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ముంబైని చుట్టేసింది చిత్రబృందం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో సూర్యతో పాటు చిత్ర బృందం మీడియా ముందుకు రావడం, బిగ్ బాస్ వంటి పాపులర్ షోలలో కనిపించడం తెలిసిందే. అయితే ‘కంగువ’ (Kanguva) సినిమా ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతుంది అనుకుంటున్న తరుణంలో సమస్య మొదలైంది. అనూహ్యంగా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘కంగువ’ సినిమాను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
అయితే ఇది నిజానికి సినిమా సమస్య కాదు. నిర్మాత సమస్య ఎఫెక్ట్ సినిమాపై పడింది. ‘కంగువ’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన జ్ఞానవేల్ రాజా (TJ Gnanavel Raja) గతంలో తమ దగ్గర రూ. 99.22 కోట్ల అప్పును తీసుకున్నాడని, ఆ మొత్తంలో కొంతవరకు వివిధ రూపాల్లో చెల్లించారని, కానీ ఇంకా రూ.45 కోట్లు ఆయన చెల్లెలించాల్సి ఉందనీ కోర్టుకు విన్నవించుకుంది రిలయన్స్ సంస్థ. ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత ‘కంగువ’ (Kanguva) సినిమాను రిలీజ్ చేసుకోవాలని ఆదేశించాల్సిందిగా మద్రాస్ హైకోర్టుకు రిలయన్స్ సంస్థ విజ్ఞప్తి చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అయితే ఇప్పటి ఇప్పుడు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఇంత భారీ మొత్తంలో చెల్లించడం అన్నది నిర్మాత జ్ఞానవేల్ రాజాకి సాధ్యమయ్యే పని కాకపోవచ్చు అనేది కోలీవుడ్ బజ్.
కాబట్టి ‘కంగువ’ (Kanguva) సినిమా విషయంలో కోర్టు స్టే ఇచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికైతే నవంబర్ 7న ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. అయితే విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కోర్టు సినిమా రిలీజ్ విషయంలో ఒక నిర్ణయాన్ని.తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రిలయన్స్ సంస్థ వారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు రిలీజ్ టైం దగ్గర పడ్డాక న్యాయపరమైన చిక్కులు రావడం పట్ల సూర్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.