EPAPER

Maharaja : దేశంకాని దేశంలో ట్రెండింగ్ లో విజయ్ సేతుపతి మూవీ… “మహారాజా” ఖాతాలో మరో రికార్డు

Maharaja : దేశంకాని దేశంలో ట్రెండింగ్ లో విజయ్ సేతుపతి మూవీ… “మహారాజా” ఖాతాలో మరో రికార్డు

Maharaja : విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటించిన ‘మహారాజా’ (Maharaja) మూవీ ఆయన కెరీర్ లోనే ఒక మరచిపోలేని మైలురాయిగా మిగిలిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా ఇంకా ఆ ఎఫెక్ట్ తగ్గలేదు. తాజాగా ఈ సినిమా దేశం కాని దేశంలో టాప్ 10 ట్రెండింగ్ లో నిలిచి మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరి ఆ రికార్డులు ఏంటో తెలుసుకుందాం పదండి.


విజయ్ సేతుపతి నటించిన క్రైం థ్రిల్లర్, తమిళ మూవీ ‘మహారాజా’ (Maharaja). పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ తో పాటు ఓటిటిలో కూడా రికార్డుల కింగ్ గా నిలిచింది. సేతుపతి 50వ సినిమాగా జూన్ లో నెట్ ఫ్లిక్స్ (Netflix) లోకి వచ్చింది ఈ సినిమా. జూన్ 14న భారతదేశంలో విడుదల కాగా దక్షిణాసియాతో పాటు తూర్పు ఆసియా దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లో ఒక వారం గ్యాప్ తర్వాత ‘మహారాజా’ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే జూన్ 18 నుంచి ఈ సినిమా తైవాన్ లో ప్రసారమవుతోంది. ఇప్పుడు అక్కడ ఈ సినిమా తైవాన్ దేశంలోని టాప్ 10 ఆంగ్లేతర సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక్కడ అక్టోబర్ 27 నాటికి ఆరు వారాల పాటు వరుసగా టాప్ 10లో తన స్థానాన్ని పదిల పరుచుకుంది ‘మహారాజా’ మూవీ. ఇలాంటి ఘనత సాధించిన ఒకే ఒక్క భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ‘మహారాజా’.

కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ట్రెండింగ్ లో నిలవడం అన్నది చిన్న విషయం కాదు. ఇక భారత దేశంలో ‘మహారాజ’  (Maharaja) రికార్డు స్థాయిలో దాదాపు 12 వారాల పాటు ఓటీటీలో టాప్ 10 సినిమాల జాబితాలో ఉంది. అక్టోబర్ 14 తర్వాత ఈ మూవీ ఆ లిస్ట్ నుంచి మాయమైంది అంటే ‘మహారాజా’ ఎఫెక్ట్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ మూవీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఒమన్, శ్రీలంక వంటి దేశాలలో కూడా అనూహ్యమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ ‘మహారాజా’ మూవీ గ్లోబల్ టాప్ 10 ఇంగ్లీషేతర సినిమాల జాబితాలో దాదాపు 7 వారాల పాటు ట్రెండ్ అయింది. అంతేకాకుండా ఈ ఏడాది నెట్ ఫిక్స్ లో అత్యధికంగా వీక్షించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 20 దేశాల్లో టాప్ 10 సినిమాల జాబితాలో ‘మహారాజా’ మూవీ ఎంత కాలం ట్రెండింగ్ లో ఉందో తెలుసుకుందాం పదండి.


ఆస్ట్రేలియా: 1 వారం
బహ్రెయిన్: 6 వారాలు
బంగ్లాదేశ్: 9 వారాలు
భారత్: 12 వారాలు
ఇండోనేషియా: 2 వారాలు
కువైట్: 6 వారాలు
మలేషియా: 5 వారాలు మాల్దీవులు:
6 వారాలు
మారిషస్: 4 వారాలు
నైజీరియా: 5 వారాలు
ఒమన్: 9 వారాలు
పాకిస్థాన్: 8 వారాలు
ఫిలిప్పీన్స్: 3 వారాలు
ఖతార్: 5 వారాలు
సౌదీ అరేబియా: 4 వారాలు
సింగపూర్: 4 వారాలు
శ్రీలంక: 7 వారాలు
తైవాన్: 5 వారాలు
థాయిలాండ్: 3 వారాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 6 వారాలు

Related News

Lavanya Tripathi: సతీ లీలావతిగా మారిన మెగా కోడలు.. ?

Rana comments on Mr Bachchan: లాస్ట్ కి అవార్డు తీసుకునే స్టేజ్ మీద కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు

Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు

Chiranjeevi : మెగాస్టార్ ఇంట మెగా ఫంక్షన్… గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయిన శ్రీజ

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Sai Pallavi: సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. ఇక నుంచి ఆమె పేరు ఇదే

Big Stories

×