OTT Bold Movie : టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ప్రైవసీ అనేది తగ్గిపోతూ వస్తోంది. ఎక్కడ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి? అనే విషయం అర్థం చేసుకోవడం ఇప్పుడున్న డిజిటల్ యుగంలో చాలా కష్టం. ఇలా సీక్రెట్ కెమెరాలకు సంబంధించిన ఓ స్కాం నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయంలోకి వెళ్తే….
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వెబ్ సిరీస్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎంతోమంది ప్రైవేట్ వీడియోలు సీక్రెట్ కెమెరాల వల్ల బయటకు వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్ కూడా ఇలాంటిదే. ప్రస్తుతం ఈ సిరీస్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel extreme) అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ పేరు “వీడియో క్యాం స్కాం” (Video CAM SCAM ). ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్లు ఉంటాయి.
కథలోకి వెళ్తే…
మూవీ మొదట్లోనే రామ్ అనే అబ్బాయి తన ఫోన్ లో వీడియోను చూసి కంగారు పడతాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన క్లాస్మేట్ అండ్ రూమ్మేట్ తన ప్రైవేట్ వీడియోని తీసి, నెట్ లో వైరల్ చేస్తానంటూ భయపెడుతున్నాడని కంప్లైంట్ చేస్తాడు. దీంతో ఓ పోలీస్ ఆఫీసర్ కాలేజీకి వెళ్లి వాడి కొట్టి ఆ వీడియోని డిలీట్ చేయిస్తాడు. ఆ తర్వాత ఓ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు కలిసి సపరేట్ గా ఓ యాప్ ని మెయింటైన్ చేస్తారు. ఇద్దరమ్మాయిలు అబ్బాయిలకి వీడియో కాల్స్ చేయడమే కాకుండా, వాటిని రికార్డ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తామంటూ బాధితులను భయపెడతారు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు ఈ ముగ్గురూ. ఈ క్రమంలోనే ఓ బిజినెస్ మాన్ ఫోన్ కి అలాంటి వీడియోతో పాటు తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని మెసేజ్ వస్తుంది. దీంతో అతను ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఈ క్రమంలోనే ఈ యాప్ ని రన్ చేస్తున్న వాళ్లు ఒక లింక్ ని గూగుల్ లో షేర్ చేస్తారు. ఎవరైనా ఆ లింక్ ని క్లిక్ చేశారంటే వెంటనే వీడియో కాల్ కనెక్ట్ అవుతుంది.
అయితే ఒకానొక సందర్భంలో పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఆ లింకుని క్లిక్ చేస్తాడు. ఒక అమ్మాయి ముందు బాగా మాట్లాడి ఆ తర్వాత బట్టలు విప్పడం మొదలు పెడుతుంది. దీంతో కంగారుపడి హీరో కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ గుర్తొస్తే ఈ లింక్ క్లిక్ చెయ్ అంటూ ఓ మెసేజ్ చేస్తారు. హీరో ఇగ్నోర్ చేయడంతో మళ్లీ కాల్స్ కూడా చేస్తారు. కానీ ఆయన అవేమీ పట్టించుకోడు. మరోవైపు వీడియో కాల్స్ మాట్లాడుతున్న వారందరికీ బ్లాక్ మెయిల్ మెసేజెస్ పంపుతారు. ఇంకోవైపు ఓ హ్యకర్ ఆ యాప్ కు సంబంధించిన వారిపై ఒక కన్ను వేసి ఉంచుతాడు. అయితే అంతలోనే హీరోకి ఓ వీడియో వస్తుంది. ఆ వీడియోలో హీరో ఫేస్ ని ఏఐతో రీప్లేస్ చేసి అతను సెల్ఫ్ గా సంతృప్తి చెందుతున్నట్టు క్రియేట్ చేస్తారు. తము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని హెచ్చరిస్తారు. మరి ఇంతకీ చివరికి ఆ పని చేసింది ఎవరు అనే విషయాన్ని హీరో కనిపెట్టగలిగాడా? అసలు ఈ గ్యాంగ్ అంతా కలిసి ఎందుకు అందర్నీ ఇలా ఫేక్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? చివరికి ఈ స్టోరీ ఎలాంటి టర్న్ తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కెయ్యండి.