EPAPER
Kirrak Couples Episode 1

Team India : టీమిండియాకు షాక్.. రెండో టీ20లో శ్రీలంక గెలుపు..

Team India : టీమిండియాకు షాక్.. రెండో టీ20లో శ్రీలంక గెలుపు..

Team India : పుణెలో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. తొలుత లంక బ్యాటర్లు చెలరేగి ఆడటంతో భారత్ ముందు 207 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది. లక్ష్య చేధనలో భారత్ బ్యాటర్లు తడబడ్డారు. ఇషాన్ కిషన్ (2 పరుగులు), శుభ్ మన్ గిల్ ( 5 పరుగులు), రాహుల్ త్రిపాఠి ( 5 పరుగులు), కెప్టెన్ హార్థిక్ పాండ్యా( 12 పరుగులు) వెంటవెంటనే అవుట్ కావడంతో టీమిండియా 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపటికే దీపక్ హుడా వెనుదిరగడంతో 57 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది.


గెలుపుపై ఆసలు సన్నగిల్లిన దశలో సూర్యకుమార్ తో అక్షర్ పటేల్ జత కలిశాడు. 10 ఓవర్లలో భారత్ స్కోర్ 64 పరుగులు. విజయానికి 60 బంతుల్లో 143 రన్స్ చేయాలి. అసాధ్యంగా కనిపించిన ఈ లక్ష్యాన్ని చేధించేందుకు సూర్య, అక్షర్ శతవిధాలు ప్రయత్నించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ సిక్సర్లతో చెలరేగాడు. హసరంగా బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సులు బాదాడు. అదే ఓవర్ లో సూర్య కూడా మరో సిక్సు కొట్టడంతో భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. ఈ క్రమంలో సూర్య , అక్షర్ జోడి 40 బంతుల్లో 91 పరుగులు జోడించింది. ఈ సమయంలో సూర్య కుమార్ అవుట్ కావడంతో లంక తిరిగి మ్యాచ్ పై పట్టుబిగించింది. సూర్య అవుటైన తర్వాత అక్షర్ అదే ఊపు కొనసాగించలేకపోయాడు. అయితే శివం మావి అనూహ్యంగా చెలరేగి ఆడటంతో ఉత్కంఠ రేగింది. చివరి ఓవర్ లో విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో భారీ షాట్లు కొట్టే ప్రయత్నంలో అక్షర్, మావి కూడా అవుట్ అయ్యారు. దీంతో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచింది. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 65 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 36 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్సులతో 51 పరుగులతో రాణించాడు. మావి 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగుల చేశాడు.

లంక బౌలర్లు మరోసారి సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా కసున్ రజిత భారత్ ను తొలి దెబ్బకొట్టాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ ను పెవిలియన్ కు పంపి టీమిండియాను ఆరంభంలోనే ఇబ్బందుల్లోకి నెట్టాడు. రజిత 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మదుషంక భారీగా పరుగులిచ్చినా ప్రారంభ ఓవర్లలో రాహుల్ త్రిపాఠిని, కీలకమైన సమయంలో సూర్యకుమార్ ను పెవిలియన్ కు పంపాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన కెప్టెన్ శనక 4 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.


అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (33), కుషాల్ మెండిస్ చెలరేగి ఆడారు. తొలి వికెట్ కు 8.2 ఓవర్లలోనే 82 పరుగులు జోడించారు. రాజపక్ష( 2) వెంటనే అవుటైనా చరిత అసలంక (37) మెరుపు షాట్లతో రెచ్చిపోయాడు. చివరి ఓవర్లలో కెప్టెన్ శనక విధ్వంసం సృష్టించాడు. కేవలం 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంమీద 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో భారత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో చివరి 4 ఓవర్లలో లంక బ్యాటర్లు 68 పరుగులు చేశారు.

బౌలర్లు విఫలం
తొలి మ్యాచ్ లో రాణించిన పేసర్లు ఈ మ్యాచ్ లో పూర్తిగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న అర్ష్ దీప్ చెత్త ప్రదర్శన చేశాడు. తన తొలి ఓవర్ లో 3 నోబాల్స్ వేశాడు. మొత్తంమీద ఈ మ్యాచ్ లో రెండు ఓవర్లే బౌలింగ్ చేసినా అందులో 5 నోబాల్స్ ఉన్నాయి. ఉమ్రాన్ మాలిక్, శివ మావి కూడా చెరో నో బాల్ వేశారు. ఫ్రీహిట్ లను లంక బ్యాటర్లు సద్వినియోగంచేసుకున్నారు. ఇదే భారత్ కొంపముంచింది. లేకుంటే శ్రీలంక స్కోర్ 180 పరుగులలోపే పరిమితమయ్యేది. మొత్తం లంక బ్యాటర్లు 14 సిక్సులు కొట్టారు. ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీసినా 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చేశాడు. గత మ్యాచ్ లో విఫలమైన స్పిన్నర్లు అక్షర్ ,చాహల్ ఈ మ్యాచ్ లో మెరుగ్గా బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్ 24 పరుగులే ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చాహల్ 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. తొలిమ్యాచ్ లో అద్భతంగా బౌలింగ్ చేసిన శివం మావి ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. టాప్ ఆర్డర్ విఫలం కావడం, బౌలర్ల తేలిపోవడంతో రెండో టీ20లో భారత్ ఓడిపోయింది. శనివారం రాజ్ కోట్ లో జరిగే మూడో టీ20.. సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది.

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×