Henna For Hair: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. రాలే జుట్టును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాంటి వారు కొన్ని రకాల నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా మంది జుట్టుకు హెన్నా ఉపయోగిస్తున్నారు. ఈ హెన్నా జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా జుట్టును ధృడంగా మారుస్తుంది.
నిర్జీవమైన, పొడి జుట్టుతో మీరు కూడా ఇబ్బంది పడుతున్న వారికి హెన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టు సమస్యలపై మ్యాజిక్ లాగా పని చేస్తుంది. జుట్టును మృదువుగా, మెరిసేలా, దృఢంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది సహజమైన కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. కొంతమంది జుట్టు సంరక్షణ కోసం అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. హెన్నాతో చేసిన హెయిర్ మాస్క్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని రెగ్యులర్ ఉపయోగించడం వల్ల జుట్టు పొడిగా మారకుండా ఉంటుంది.
నల్లటి జుట్టు కోసం హెయిర్ మాస్క్ :
కావలసినవి :
హెన్నా – 1 కప్పు
అలోవెరా జెల్ – సగం కప్పు
రోజ్ వాటర్ – 3 టేబుల్ స్పూన్లు
తేనె – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 1 నిమ్మకాయ
నీరు – అవసరాన్ని బట్టి
తయారీ విధానం: హెన్నా హెయిర్ మాస్క్ చేయడానికి, ఒక గిన్నెలో హెన్నా పౌడర్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో అలోవెరా జెల్, రోజ్ వాటర్, తేనె, నిమ్మరసం కలపాలి. అన్నింటినీ బాగా మాక్స్ చేసి మందపాటి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయండి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టుకు పూర్తిగా పట్టించాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని మీ జుట్టు మీద సుమారు 35-45 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత మీ జుట్టును చల్లటి నీటితో బాగా కడగాలి. వీలైతే మీరు మీ జుట్టుకు షాంపూని కూడా వాడవచ్చు.
హెన్నా హెయిర్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు :
హెన్నా జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడుతుంది.
హెన్నా మీ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది.
కలబంద, తేనె మీ జుట్టును మృదువుగా చేస్తాయి.
నిమ్మరసం చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది.
మెహందీ, కలబంద జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.
ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టుకు అవసరమైన పోషణను కూడా అందిస్తుంది.
Also Read: మందారతో అద్భుతం.. ఇలా వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు
ఈ విషయాలపై జాగ్రత్త వహించండి:
మీరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేయవచ్చు.
మీ జుట్టు చాలా పొడిగా ఉంటే, మీరు కొబ్బరి నూనెను కూడా హెన్నాలో కలుపుకోవచ్చు.
హెన్నాను జుట్టుకు అప్లైచేసే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.
హెన్నా రంగు మరింత పెరగడానికి, మీరు దానికి కొద్దిగా కాఫీ పొడిని కూడా కలుపుకోవచ్చు.