EPAPER

Pushpa 2 Movie Promotions : పుష్ప 2 ప్రమోషన్స్ షెడ్యూల్.. సుక్కు ప్లాన్ కు థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Pushpa 2 Movie Promotions : పుష్ప 2 ప్రమోషన్స్ షెడ్యూల్.. సుక్కు ప్లాన్ కు థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Pushpa 2 Movie Promotions : టాలీవుడ్ యంగ్ హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun), సుకుమార్ ( Sukumar ) కాంబినేషన్ లో పుష్ప 2 రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అటు ఫ్యాన్స్, ఇటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మరో వారం పది రోజుల్లో పూర్తి కానుందట. డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ కానున్నాయి. భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. దానికోసం డైరెక్టర్ సుకుమార్ అదిరిపోయే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేసినట్లు ఓ వార్త షికారు చేస్తుంది. అసలు సుక్కు ప్లాన్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


2020 లో వచ్చిన పుష్ప ( Pushpa ) మూవీ నేషనల్ వైడ్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఇక ఈ రెండో పార్ట్ పుష్ప ది రూల్ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప 2కి ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్‌ పెట్టారని ఇండస్ట్రీ టాక్ . ఆ మొత్తంలో ప్రమోషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీగా ఖర్చు చేయబోతున్నారని ఓ వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు క్రేజ్ ను తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌ లేదా ఏపీలోని ఏదైనా ప్రధాన నగరంలో భారీ జనాలతో ఓపెన్‌ గ్రౌండ్‌ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించే విధంగా మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారని టాక్.. ఆ తర్వాత ముంబై, చెన్నై, కొచ్చి ఇలా చాలా ఏరియాల్లో ప్రత్యేక కార్యక్రమాల ను నిర్వహించనున్నారట. గతంలో ప్రచారం లేకుండానే ఉత్తర భారతంలో వంద కోట్లకు మించి వసూళ్లు చేసిన పుష్ప ఈసారి అక్కడ భారీ ప్లాన్ తో దిగబోతున్నారని టాక్ వినిపిస్తుంది. సినిమా షూటింగ్ అవ్వగానే ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టనున్నట్లు క్లారిటీ ఇచ్చేసారు.


ఎంతగా ప్రమోషన్స్ చేస్తే అంతగా సినిమా హిట్ అవుతుంది. అప్పుడే ఓపెనింగ్స్ కూడా ఆ స్థాయిలో వస్తాయి. మొదటి రోజు రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేస్తేనే లాంగ్‌ రన్‌‌లో పుష్ప 2 మేకర్స్‌, బయ్యర్లు ఆశించిన వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక పుష్ప 3 కూడా ఉందనే టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Oscars 2025 : ఆస్కార్ రేసులో ఇండియన్ షార్ట్ ఫిల్మ్… కేన్స్ లోనూ బెస్ట్ మూవీగా అవార్డు

Rahasyam Idam Jagath: ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని కథ ‘రహస్యం ఇదం జగత్‌’: దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌

Dulquer Salmaan Remuneration : కోట్లు కొల్లగొట్టిన ఈ లక్కీ భాస్కర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Lokesh Kanagaraj: ‘కూలీ’లో నాగార్జున క్యారెక్టర్ రివీల్ చేసిన లోకేష్.. పూనకాలే

Allu Arjun’s Pushpa 2 : నిర్మాతలు మాట తప్పుతున్నారా..? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితేంటి..?

Manchu Manoj : కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తండ్రి బాటలో… మంచు మనోజ్ విలన్ వేషాలు వర్కవుట్ అయ్యేనా?

Thandel Release Date: ‘తండేల్’ రిలీజ్ డేట్ ఇదే.. సేఫ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్..?

Big Stories

×